ప్ర‌ముఖహీరో భార్య మృతి షాక్ లో సినీఇండ‌స్ట్రీ

486

ఆనాటి బాలీవుడ్ న‌టుడు త‌న ద‌ర్శ‌క‌త్వం న‌ట‌న నిర్మాణ సంస్ద‌తో ఎంతో పేరు సంపాదించుకున్నాడు రాజ్ క‌పూర్ ఇక ఆయ‌న భార్య కృష్ణాక‌పూర్ కూడా బాలీవుడ్ లో అంద‌రికి సుప‌రిచితులు. రాజ్‌కపూర్‌ సతీమణి కృష్ణా రాజ్‌కపూర్ ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.

ఈ విషయాన్ని రాజ్‌కపూర్‌ మనవరాలు రిధిమా కపూర్‌ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘మిమ్మల్ని ఎప్పుడూ మిస్సవుతూనే ఉంటాం నానమ్మా. ఐలవ్యూ’ అని క్యాప్షన్‌ ఇస్తూ ఆమెతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. ఇటీవలే తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లొచ్చిన కృష్ణా రాజ్‌కపూర్‌ ఇంతలోనే ఆమె అనంతలోకాలకు వెళ్లిపోవడంతో కపూర్ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరోవైపు రాజ్‌కపూర్‌ కుమారుడు రిషికపూర్‌ ఆరోగ్య పరీక్షల కోసం శనివారమే అమెరికాకు వెళ్లారు. తల్లి మరణవార్త తెలుసుకున్న రిషి ఈరోజు సాయంత్రం ముంబయికి చేరుకునే అవకాశం ఉంది… రిషికపూర్ భారత్ చేరుకున్న తర్వాతే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. చెంబూరు శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తనయుడు రణధీర్ కపూర్ వెల్లడించారు. రాజ్‌కపూర్‌‌ను 1946 మేలో వివాహం చేసుకున్నకృష్ణా రాజ్‌కపూర్‌ దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో ముగ్గురు అబ్బాయిలు, కాగా ఇద్దరు అమ్మాయిలు. రణధీర్ కపూర్, రిషి కపూర్, రాజీవ్ కపూర్, ఇద్దరు కుమార్తెలు రీతు, రీమా కపూర్‌లు. కృష్ణా రాజ్‌కపూర్‌ మృతిపట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, రవీనా టాండన్, సోహా అలీఖాన్, సోఫీ చౌదరి, దర్శకుడు మధుర్ భండార్కర్ తదితరులు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు. ఇక మరికొంద‌రు ఆమె ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీలో ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌మాదాల‌తో శొక‌సంద్రంలో ఉన్న కుటుంబం ఇప్పుడు మ‌రో వార్త‌తో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. క‌పూర్ ఫ్యామిలీకి ఇది చేదు వార్త అనే చెప్పాలి.