స్టార్ హీరోతో ప్రభాస్ చెల్లెలి పెళ్లి..ఆనందంలో ప్రభాస్ ఫాన్స్

416

రెబల్ స్టార్ కృష్ణం రాజు మొదట్లో కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో నటించి ఆ తరువాత మెల్లగా హీరోగా మారి పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. అయితే అయన నటించిన సినిమాల్లో ఎక్కువగా మనకు గుర్తుండేవి త్రిశూలం, బొబ్బిలి బ్రమ్మన్న, కటకటాల రుద్రయ్య, తాండ్రపాపారాయుడు, రంగూన్ రౌడీ, అమరదీపం, భక్త కన్నప్ప వంటి సూపర్ హిట్స్ మనకు గుర్తుకువస్తాయి. కృష్ణంరాజు కు ముగ్గురు కూతుళ్లు మరియు ఒక కుమారుడు, ఇక సినిమాల్లోకి తన నటవారసుడిగా అయన తమ్ముడు సూర్యనారాయణ రాజు కుమారుడు ప్రభాస్ ని ఈశ్వర్ మూవీ ద్వారా సినిమాల్లోకి ఆయన తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కృష్ణరాజు పెద్ద కూతురి పెళ్లి ఒక స్టార్ హీరోతో సెట్ అయ్యిందంట.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

టాలీవుడ్ మొత్తం ప్రభాస్ పెళ్లి ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తుంటే ఇప్పుడు ఆయన చెల్లెలి పెళ్లి వార్త గురించి వినాల్సి వచ్చింది. ప్రభాస్ కు ఒక తమ్ముడు, అతని పేరు ప్రమోద్. అయితే కృష్ణంరాజు కూతుళ్లను తన సొంత చెల్లెళ్లుగా భావించే ప్రభాస్, తన ప్రతి సినిమా విజయాన్ని వారితో ఎంతో ఆనందంగా పంచుకుంటాడట.అంతేకాదు వారికి పండుగలు, పుట్టినరోజులు సమయంలో ఎప్పటికపుడు ప్రత్యేకంగా రకరకాల గిఫ్ట్ లు ఇచ్చి వాళ్లని సర్ప్రైజ్ చేసేవాడట. ఇకపోతే పెద్దచెల్లెలు సాయి ప్రసీదకు ఇటీవల పెళ్లి సంబంధం కుదిరిందని కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అయితే పెళ్ళికొడుకు టాలీవుడ్ లోని ఒక ప్రముఖ హీరో అని, అయితే మొదట కృష్ణంరాజు దంపతులు ఆ హీరోతో తమ కూతురి పెళ్లి అనుకున్నారట. ఇక ఆ తరువాత వారి కుటుంబ సభ్యులను ఈ విషయమై వెళ్లి కలిసి మాట్లాడగా, వారు కూడా అందుకు ఒప్పుకోవడంతో కృష్ణం రాజు కుటుంబం అమితానందం వ్యక్తం చేసిందట.

ఇకపోతే ప్రభాస్ కు కూడా ఆ హీరో బాగా పరిచయమని, అలానే తనకు కూడా ఆ హీరో అంటే బాగా ఇష్టమని, అటువంటి వ్యక్తి తన చెల్లికి భర్తగా రావడం నిజంగా తమ అదృష్టమని ప్రభాస్ తన సన్నిహితుల వద్ద చెప్పాడట. కాగా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తోంది.మరి చెల్లెలు పెళ్లి అయితే అవుతుంది మనోడు ఎప్పుడు చేసుకుంటాడా అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.అసలు చేసుకుంటాడా లేదా అని సంకోచంలో కూడా ప్రభాస్ అభిమానులు ఉన్నారు.ఎందుకంటే మనోడికి అప్పుడే 38 ఏళ్ళు నిండిపోయాయి.