స్టార్ హీరో విజయ్ అరెస్ట్..రోడెక్కిన ఇద్దరు భార్యలు..ఆందోళనలో సినీ ప్రముఖులు

454

కొంతమంది సెలెబ్రిటీల జీవితం చెప్పుకునేంతలా ఏమి ఉండదు.తెరమీద మాత్రం హీరోల వేషాలు వేస్తారు బయటమాత్రం వాళ్ళు వేసే వేషాలు అన్నీఇన్నీ కావు.సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు నిజజీవితంలో చేసే కొన్ని పనులు వారి పరువుకు భంగం కలిగిస్తుంటాయి.ఇప్పుడు ఒక ప్రముఖ నటుడు అరెస్ట్ అయ్యాడు.అంతేకాకుండా ఆయన ఇద్దరు భార్యలు రోడ్డుకెక్కారు.మరి ఆ నటుడు ఎవరు ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారు.అసలు అతని జీవితంలో ఏం జరుగుతుంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కన్నడ నటుడు దునియా విజయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.బెంగుళూరులోని వసంత నగర్‍‌లోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం సాంయత్రం జరిగిన ‘మిస్టర్ బెంగుళూరు బాడీ బిల్డర్’ కాంపిటీషన్లో మారుతి గౌడ పాల్గొనాల్సి ఉండగా దునియా విజయ్, అతడి గ్యాంగ్ మారుతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ చేసి కారులో తీసుకెళుతూ అతడిపై దాడి చేసినట్లు సైతం కన్నడ మీడియాలో వార్తలొచ్చాయి.విజయ్, అతడి గ్యాంగ్ వేధింపుల వలన మారుతి గౌడ తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ప్రస్తుతం వికాస్ గౌడ బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.తన మేనల్లుడి మీద దాడి జరిగిందనే విషయం తెలిసిన వెంటనే పాని పూరి కిట్టి అలియాస్ కృష్ణ మూర్తి….. హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విజయ్‌కు వ్యతిరేకంగా శనివారం రాత్రి 11.30 గంటలకు ఫిర్యాదు చేశారు.పోలీసులు విజయ్ ను తీసుకొచ్చారు.ఈ సందర్భంగా పోలీసుల ముందే విజయ్, పాని పూరి కిట్టి గొడవపడినట్లు తెలుస్తోంది. విజయ్ అతడి మీద చేయిచేసుకోవడానికి ప్రయత్నించగా మధ్యలో కల్పించుకున్న ఏసీపీ అతడిని తీవ్రంగా హెచ్చరించనట్లు తెలుస్తోంది.

పోలీసులు వార్నింగుతో విజయ్ తగ్గాడని తెలుస్తోంది. అనంతరం విజయ్‌పై ఐపీసి సెక్షన్ 365(కిడ్నాపింగ్), 342, 325, 506 సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం.అరెస్ట్ అనంతరం విజయ్‌ను 14 రోజుల జుడీషియల్ కస్టడీకి పంపించారు.ఇదే సమయంలో ఆయన పెద్ద భార్య నాగరత్న, చిన్న భార్య కీర్తి గౌడలు గొడవ పడ్డారు. నాగరత్నకు ముగ్గురు పిల్లలుండగా, ప్రస్తుతం విజయ్‌ చిన్నభార్య కీర్తిగౌడతో ఉంటున్నాడు. మారుతి గౌడతో గొడవ జరిగిన వేళ, నాగరత్న కుమారుడు సామ్రాట్‌, తన తండ్రితోనే ఉన్నాడు.తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆగ్రహానికి లోనైన నాగరత్న, కీర్తిగౌడ ఇంటికి వెళ్లి నిలదీయగా, ఆమె దగ్గరుండే బౌన్సర్లు అనుచితంగా ప్రవర్తించారట. ‘నాకు సంసారం లేకుండా చేశావు, పిల్లలను దూరం చేయాలనుకుంటున్నావా..’ అంటూ నాగరత్న ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈమేరకు బౌన్సర్‌ల ద్వారా దాడి చేయించారని గిరినగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం కీర్తిగౌడ కూడా పోలీ‌స్‌స్టేషన్‌లకు వెళ్ళి ప్రతిఫిర్యాదు చేశారు. ఇలా పోలీస్‌ స్టేషన్‌తోపాటు కోర్టు, జైలు చుట్టూ దునియా విజయ్‌ తిరుగుతుండగా ఇటువైపు భార్యలు పోలీ‌స్‌స్టేషన్‌లకు వెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశమైంది.