నన్ను బహిష్కరించకండి రాజ‌కీయ నాయ‌కుల లిస్ట్ నాద‌గ్గ‌ర ఉంది కేసీఆర్ కు శ్రీరెడ్డి ట్వీట్ ఆ నాయ‌కులు ఎవ‌రంటే

588

ఇప్పుడు హైద‌రాబాద్ లో ఎవ‌రైనా ఘ‌ర్ష‌ణ‌ల‌కు పాల్ప‌డేలా మాట్లాడినా, ఎటువంటి అనుచిత వ్యాఖ్య‌లు చేసినా వారిని న‌గ‌రం నుంచి బ‌హిష్క‌రిస్తున్నారు పోలీసులు.. దీంతో పోలీసులు ఎటువంటి చ‌ర్య‌లు ఎప్పుడు ఎవ‌రిపై తీసుకుంటారా అని అంద‌రూ ఆలోచ‌న‌లో ఉన్నారు.. ఇక ప‌లు మీడియాల‌కు కూడా షోకాజ్ నోటీసులు అందించారు తెలంగాణ పోలీసులు… రాజ‌కీయ పార్టీలు, కులాల కుమ్ములాటలు, మ‌తాల విద్వేషాల‌కు సంబంధించి ఎటువంటి డిబేట్లు ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు అని తెలియ‌చేశారు. అయితే ఇప్పుడు ఇది సినీ ఇండ‌స్ట్రీకి కూడా పాకేసింది.

Image result for sri reddy actress

క్యాస్టింగ్ కౌచ్ అంశంతో మ‌రింత చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చిన న‌టి శ్రీరెడ్డి ఇప్పుడు తాజాగా త‌న‌ని న‌గ‌రం నుంచి బ‌హిష్క‌రించకండి అని ఓ రిక్వెస్ట్ చేస్తోంది.. అయితే ఆ రిక్వెస్ట్ ఎవ‌రికి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ రాష్ట్రం నుండి తనను బహిష్కరించవద్దని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరుతోంది నటి శ్రీరెడ్డి… కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సెలబ్రిటీల మీద ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి, తాజాగా పోస్టు తో మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది.. కోలివుడ్ నటులపై కూడా కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది… సినిమా ఇండస్ట్రీలోని అమ్మాయిలను వాడుకున్న వారిలో నటులే కాదు.. రాజకీయనాయకులు కూడా ఉన్నారని. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో రాసుకొచ్చింది.

 

Image result for kcr

గత కొన్నాళ్లుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన ఫేస్ బుక్ ద్వారా కాస్టింగ్ కౌచ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతోన్న శ్రీరెడ్డి మరొకసారి ఆయనను ఉద్దేశిస్తూ ఓ లేఖ రాసింది. !! గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి.. సార్ ఇకనైనా స్పందించండి. ఎన్నిరోజులు మేము ఈ బాధలు పడాలి. డ్రగ్స్ తీసుకుంటూ.. హీరోయిన్స్ ను వాడుకునే వాళ్లలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ వారి గురించి నేను మాట్లాడ‌ద‌ల‌చుకోలేదు.

ఒకవేళ మాట్లాడినా న్యాయం జరగదని నాకు తెలుసు. నన్ను చంపినా చంపేయొచ్చు. డ్రగ్స్, సెక్స్ రాకెట్ లో మీ సన్నిహితులు కూడా ఉన్నారు కాబట్టి నేను పొలిటికల్ సైడ్ రాదలచుకోలేదు. మా అసోసియేషన్ లో కొందరు సినీ పెద్దలు నన్ను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. మీరు ఈ రాష్ట్రానికి కింగ్. మీరు అర్ధం చేసుకొని సమస్యని పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ నుండి నన్ను బహిష్కరించకండి. నేను చెప్పేవన్నీ నిజాలే అని వెల్లడించింది. మ‌రి ఇప్ప‌డు ఈ అంశంలోకి రాజకీయ నాయ‌కుల‌ను తీసుకువ‌చ్చిన శ్రీరెడ్డి విష‌యంలో ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. శ్రీరెడ్డి లిస్టులో ఇంకెవ‌రు ఉంటారు అనుకుంటున్నారో , మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.