దేవునికే శాపం పెట్టి పంతం నెగ్గించుకున్న భ‌క్తుడు

631

మ‌నం ఎక్క‌డ విన్నా పురాణాలు విన్నా కొన్ని కొన్నిక్షేత్రాలు చాల మ‌హిమ‌గ‌ల‌విగా వింటాం.. ఇక దేవుడు శపిస్తాడు కాని భ‌క్తుడు శ‌పిస్తాడు అనే మాట ఎక్క‌డా విని ఉండం …కాని పురాణాల్లో ఇలాంటి వృత్తాంతం కూడా జ‌రిగింది.. మ‌రి ఆ భ‌క్తుడు ఎవ‌రు ఆ దేవుడు ఎవ‌రు అనేది ఈరోజు తెలుసుకుందాం.

మ‌హారాష్ట్రాలోని పుండ‌రీ పుర క్షేత్రం సాక్షాత్తు ఆ కృష్ణుడే కొలువైన క్షేత్రం ఇది.. దీని గురించి ముందుగా కొన్ని విష‌యాలు తెలుసుకోవాలి.. మ‌హారాష్ట్రాలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం పుండ‌రీ పుర‌క్షేత్రం… ఈ దేవాల‌యం భీమా న‌ది ఒడ్డున ఉంది.. పాండురంగ విట‌లుడిగా కృష్ణుడు రుక్మీణీ దేవీ స‌మేతంగా ఇక్క‌డ కొలువై ఉన్నాడు.. దీనిని విట‌లాల‌యం పుండ‌రీక్షేత్రం అంటారు… ఇక్క‌డ పాండురంగ‌డి విగ్ర‌హం ఒక ఇటుక‌పై ఉంటుంది..అలాగే విట‌లుడు రెండు చేతులు నడుము పై పెట్టుకుని భంగిమ‌లో క‌నిపిస్తాడు….పాండురంగ‌డు ఇలా ఉండ‌టం పై ఓ క‌థ ప్రాచుర్యంలో ఉంది.

పూర్వం దేవ‌దానులు యుద్దం చేస్తున్న స‌మ‌యంలో ముచ్కుందుడు అనే వ్య‌క్తి ఆ దేవ‌త‌ల‌కు సాయం చేస్తాడు… దేవ‌త‌లు రాక్ష‌సుల‌పై యుద్దంలో గెలుస్తారు.. ఈ యుద్దం ఎన్నో నెల‌ల పాటు కొన‌సాగుతుంది ఈ స‌మ‌యంలో ముచ్కుందుడు చాలా నీర‌సించి పోతాడు.. ఇక ఈ స‌మ‌యంలో ముచుకుందుడు దేవ‌త‌ల‌ను ఓ వ‌రం అడుగుతాడు.. తాను నిద్ర‌కు ఉప‌క్ర‌మిస్తాను అని నా నిద్ర‌కు ఎవ‌రు భంగం క‌లిగించినా వారు భ‌స్మం అయ్యేలా వ‌రం దేవ‌త‌ల‌ను కోర‌తాడు

కొన్నాళ్ల‌కు శ్రీకృష్ణుడు కాల‌య‌మునుడు అనే రాక్ష‌సుడితో యుద్దం చేస్తున్న స‌మ‌యంలో ఓ గుహ‌లోకి వెళ్లి దాక్కుంటాడు.. అది ముచ్కుందుడి గుహ‌.. ఇక కాల‌య‌మునుడు శ్రీకృష్ణుడ్ని వెతుకుతూ ఆ గుహ‌లోకి వ‌స్తాడు.. అక్క‌డ ముచ్కుందుడ్ని చూసి త‌న నుంచి త‌ప్పించుకోవాలి అని శ్రీకృష్ణుడు ఇలా మారు వేషంలో ఉన్నాడు అని భావించి కాల‌య‌మునుడు ముచుకుందుడుని నిద్ర‌లేపుతాడు… ఈ స‌మ‌యంలో అత‌ని చూపుల‌కు కాల‌య‌మునుడు భ‌స్మం అవుతాడు. ముచుకుందుడు త‌న‌కు సాయం చేశాడ‌ని భావించి శ్రీకృష్ణుడు ఓ వ‌రం కోరుకోమంటాడు దీంతో ముచుకుందుడు .. త‌న‌కు బాల‌కృష్ణుడి రూపంలో క‌నిపించి ఇక్క‌డే కొలువై ఉండాల‌ని కోర‌తాడు…. దీనికి శ్రీకృష్ణుడు కూడా ఒప్పుకుని వరం ప్రసాదిస్తాడు వ‌చ్చే జ‌న్మ‌లో నీ కోరిక నెర‌వేరుతుంది అని చెబుతాడు.


ముచుకుందుడు త‌ర్వాతి జ‌న్మ‌లో పుండ‌రీకుడిగా జ‌న్మిస్తాడు.. కాని ముందు అత‌ను చెడు అల‌వాట్లు అల‌వ‌ర్చుకుంటాడు.. ఇక పుండ‌రీకుడు మారాలి అని అత‌ని త‌ల్లిదండ్రులు కూడా శ్రీకృష్ణున్ని వేడుకుంటారు…తర్వాత కొద్ది రోజుల‌కు పుండ‌రీకుడు మార‌తాడు త‌ల్లితండ్రుల‌ను బాగా చూసుకుంటాడు అమిత‌మైన భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ఉంటాడు.. ఈ స‌మ‌యంలో విష్ణువు పుండ‌రీకునికి నాపై భ‌క్తి ఉందా త‌ల్లిదండ్రుల‌పై ప్రేమ ఉందా తెలుసుకోవాలి అని చిన్న‌పిల్ల‌వాడి రూపంలో పుండ‌రీకుడి ఇంటికి వ‌స్తాడు.. నీకు వ‌రం ఇవ్వ‌డానికి వ‌చ్చానా బ‌య‌ట‌కు ర‌మ్మ‌ని పిలుస్తాడు. కాని ఆ స‌మ‌యంలో త‌ల్లిదండ్రుల పాద సేవ‌లో ఉన్న పుండ‌రీకుడు బ‌య‌ట‌కు రాడు.. ఇక ప‌దే ప‌దే పిల‌వ‌డంతో ఓ ఇటుక‌ను బ‌య‌ట‌కు విసిరి అక్క‌డే ఇటుక‌పై నిల‌బ‌డాలి అని చెబుతాడు. దీంతో విష్ణువు ఆ ఇటుక‌పై నిల‌బ‌డి విగ్ర‌హ‌మూర్తిగా మార‌తారు.త‌ల్లి దండ్రుల పాద‌సేవ పూర్తి అయిన త‌ర్వాత పుండ‌రీకుడు బ‌య‌ట‌కు వ‌చ్చి చూడ‌గా ఇటుక‌పై స్వామిశిల‌గా ఉంటారు.. దీంతో ఎంతో ఆనందించి చేసిన పాపానికి చింతిస్తాడు.. ఆ స‌మ‌యంలో విష్ణువు గ‌త జ‌న్మ‌లో జ‌రిగిన విష‌యాన్ని అంతా తెలియ‌చేస్తాడు గ‌త జ‌న్మ‌లో ఇచ్చిన మాట ప్ర‌కారం కృష్ణుడు ఇప్పుడు ఇక్క‌డే కొలువై ఉంటాడు అని చెబుతాడు.. ఇక్క‌డే పాండురంగ‌డుగా కొలువై భ‌క్తుల కోరిక‌లు తీరుస్తారు అని చెబుతారు. ఈ ప్రాంతంలో లోహ‌తండ తీర్దం ఉంది ఈ న‌దిలో మునిగితే ఎటువంటి పాపాలు అయినా పోతాయి అని అంటారు… శివుని క‌న్నీటి ధార‌తో వ‌చ్చిన న‌దిగా దీనిని పిలుస్తారు.. చూశారుగా భ‌క్తుని శాపం దేవుని వ‌రం ఎలా మారాయో.. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.