టాలీవుడ్ టాప్ సింగర్ పై లైంగిక ఆరోపణలు చేసిన టాప్ హీరోయిన్

381

భారత్‌లో ‘మీ టూ’ విప్లవం ఊపందుకుంది. వివిధ రంగాల్లో లైంగిక వేధింపులకు గురైన చాలా మంది మహిళలు ఒక్కరొక్కరిగా బయటికి వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.ఇప్పుడు మరొక ఫెమస్ సింగర్ మీద ఆరోపణలు వస్తున్నాయి.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

విదేశాల్లో ప్రారంభమైన మీటూ ఉద్యమం ఇప్పుడు మనదేశంలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్ద మనుషుల ముసుగులో సాగించిన అకృత్యాలు ఒక్కొక్కటీగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా, సీనియర్‌ నటుడు నానాపటేకర్‌పై చేసిన క్యాస్టింగ్‌కౌచ్‌ ఆరోపణలు సంచలనం రేపాయి. పదేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్‌ నానాపటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తను ఆరోపించింది. దీనిపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. గాయని చిన్మయి కూడా మీటూ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇండస్ట్రీలో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని చెప్పారు. ఇక, తాజాగా ఈ బాధితుల బాదితుల జాబితాలో గాయని సోనా మొహపాత్రా కూడా చేరింది.

మహేష్ ‘భరత్ అనే నేను’ చిత్రంలో ‘వచ్చాడయ్యో సామీ’.. అనే పాట పాడి మెప్పించిన గాయకుడు కైలేష్‌ ఖేర్‌ గురించి గాయని సోనా మొహపాత్రా చెబుతున్న విషయాల గురించి వింటే అతను ఇలాంటి వాడా అనుకుంటారు.. మనసు నిండా విషం పెట్టుకున్న అతను ట్విట్టర్‌లో తనను తాను సింపుల్‌ అని, సంగీతాన్ని ఆరాధిస్తానని చెప్పుకోవడం సిగ్గుచేటని సోనా తెలిపారు.‘‘కైలాష్‌ సిగ్గులేని వాడు. ఓ సారి కాన్సెర్ట్‌ కోసం కాఫీ షాప్‌లో కలిశాను. నా తొడ మీద చేయి వేసి ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని అన్నాడు… అంతే అక్కడి నుంచి నేను పారిపోయాను. ఆ తర్వాత మేం ఢాకాకు వెళ్లాం. ఫ్లైట్‌ దిగినప్పటి నుంచి నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. కానీ నేను తీయలేదు. దాంతో షో నిర్వాహకులకు చెప్పి నాతో ఫోన్‌ చేయించుకున్నాడు. కచేరి వదిలి తన గదికి రావాలని అన్నాడు. అతని నిజ స్వరూపం తెలిశాక అసహ్యమేసింది. ఇప్పటికి అతని గురించి బయటికి వచ్చింది చాలా తక్కువే. ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో..’’ అంటూ చెప్పేసింది.కైలాష్ ఖేర్ తెలుగులో అరుంధతి,జయజానకి నాయక,మిర్చి,భరత్ అను నేను లాంటి సినిమాలలో పాటలు పాడాడు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.