తల్లి హ్యాండ్ బ్యాగ్ లో కండోమ్ చూసిన కొడుకు.. తర్వాత ఏమైంది.. కన్నీళ్లు పెట్టించే యదార్థగాధ

810

అమ్మను మించి దైవం ఉన్నదా..ఆత్మను మించి అర్థం ఉన్నదా అని ఒక మహాకవి అన్నాడు. అది అక్షరాలా నిజం. ఈ ప్రపంచంలో ఎన్నో బంధాలు బాంధవ్యాలు ఉండొచ్చు కానీ అవేమి తల్లి ప్రేమ కన్నా గొప్పవి కాదు. తన ప్రాణం పోయేవరకు తల్లి బిడ్డ గురించే ఆలోచిస్తుంది. దేవుడి కంటే తల్లి ఎక్కువ. కొడుకు కోసం ఏం చేయడానికైనా వెనుకాడదు తల్లి. ఆ ప్రాసెస్ లో ఆమె మంచి చెడుల గురించి ఆలోచించదు. బిడ్డ బాగుండటమే ఆమెకు ముఖ్యం అనుకుంటుంది. బిడ్డలా కోసం ఎంత కష్టానైనా ఎంతటి భాదనైనా పడటానికి సిద్ధపడుతుంది. అచ్చం అలాగే ఆలోచించింది ఒక తల్లి. కొడుకు కోసం వ్యభిచారంలోకి వెళ్ళింది. మరి చివరికి ఏమైంది. ఇప్పుడు తెలుసుకుందాం.

ఢిల్లీకి సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తుంది సుల్తానా. సుల్తానకు అక్బర్ అనే వ్యక్తితో పెళ్లయింది. అయితే పెళ్లి అయినా ఐదేళ్లకే అతను చనిపోయాడు.బంధువుల నుంచి ఎలాంటి సహాయం సుల్తానకు అందలేదు. చుట్టూ అప్పుల వాళ్ళు. భర్త అప్పులు చేసి చనిపోయాడు. ఎలాగైనా అప్పులు కడదామని ఎలాగైనా సంపాదిద్దామని కొడుకును తీసుకొని ఢిల్లీకి వచ్చేసింది.ఆమె కొడుకుకు యుక్తవయసు వచ్చేసరికి నాలుగు ఇళ్లలో పాచిపని చేసుకుంటూ మురికివాడలో ఉంటూ సరిగ్గా తిండి తినక ఎలాగోలా నెట్టుకొచ్చేసింది. అయితే కమల్ పెరిగాకా ఖర్చులు ఎక్కువయ్యాయి. స్కూల్ కు వెళ్లడం స్టార్ట్ చేశాడు. స్కూల్ ఫీజ్ లు పెరిగాయి.అలాంటి సమయంలోనే తనకు తెలియకుండానే అవసరాల కోసం పడుపు వృత్తిలోకి వెళ్ళింది. అప్పటినుంచి ఆమె బాగానే సంపాదించింది. ఒకవైపు తన శరీరం నలిగిపోతున్న కొడుకును బాగానే చేసుకుంటున్నా అన్న ఆనందం ఆమెను అన్ని మర్చిపోయేలా చేసింది.ఒక మంచి ఇంటిని రెంట్ తీసుకుని అందులో సుల్తానా కమల్ ఉంటూ వచ్చారు.

Image result for condom

అయితే తానూ చేసే పని గురించి కొడుకుకు ఎప్పుడు చెప్పలేదు. అయితే ఎన్ని రోజులు అని దాస్తోంది చెప్పండి. తానూ చేసే పని తన కొడుకుకు తెలిసే రోజు రానే వచ్చింది.ఒకరోజు ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోవడం కోసం తల్లి బ్యాగ్ లో డబ్బులు తీసుకుందామని చూశాడు. అందులో డబ్బుతో పాటు కండోమ్ ప్యాకెట్స్ దొరికాయి. వాటిని చూసి కమల్ షాక్ అయ్యాడు. అప్పుడు కమల్ కు పరిస్థితి పూర్తీగా అర్థం అయ్యింది.తల్లిని నిలదీశాడు. అప్పుడు చేసేదేమి లేక నిజాన్ని ఒప్పేసుకుంది.కొడుకు కోసం వెళ్ళింది కానీ ఇప్పుడు కొడుకు ముందే దోషిలా నిలబడింది.అయితే తన తల్లి ఏ పరిస్థితిలో అలా మారాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నాడు. ఇకముందు ఈ పని చెయ్యొద్దు అని తల్లితో ఆపనిని మాన్పించాడు. ఆ తర్వాత స్నేహితుల సహాయంతో ఒక ఆటో కొనుక్కున్నాడు. ఇన్నాళ్లు తల్లి పడ్డ కష్టాన్ని వృధా చెయ్యకుండా ఆటో నడుపుతూ చదువుతూ డిస్టింక్షన్ లో డిగ్రీ పూర్తీ చేశాడు.ఇప్పుడు సుల్తానా ఇంట్లోనే ఉంటుంది. కొడుకు కష్టపడి తల్లిని బాగా చూసుకుంటున్నాడు. చూశారుగా కొడుకు కోసం వ్యభిచార వృత్తిని ఎంచుకుని కొడుకును పెద్ద చేసి చివరికి కొడుకు ముందే దోషిలా నిలబడిన ఒక తల్లి కథ. వింటుంటేనే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి కదా. మరి ఈ తల్లి ఘటన గురించి అలాగే ఇలా ఎన్నో రకాల కారణాల వలన పడుపు వృత్తిలోకి వచ్చే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.