భూమిని తాకితే కొన్ని కోట్ల మంది ప్రాణాలు పోతాయట.. ఇదే భూమిపై పడితే ఒక మహానగరమే తుడిచిపెట్టుకుపోతుందట అదేంటో తెలుసా..

445

సాంకేతికంగా మనిషి ఎంతగా వృద్ధి చెందినా.. ఇప్పటికి అర్థం కానివికి మన చుట్టూ చాలానే ఉన్నాయి. అనంత విశ్వంలో తరచూ ఏదో ఒక సవాలు ఎదురవుతూనే ఉంటుంది. అయితే.. ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాని పరిస్థితి. విశ్వంలో సంచరించే భారీ గ్రహ శకలాలు భూమికి దగ్గరగా వచ్చి వెళ్లే పరిస్థితి.తాజాగా అలాంటి పరిణామమే మరొకటి చోటు చేసుకోనుంది. రెండు బోయింగ్ విమానాల సైజులో మరింత స్పష్టంగా చెప్పాలంటే ఒక పిరమిడ్ కంటే పెద్దదిగా ఉండేంత గ్రహ శకలం ఒకటి భూమికి అత్యంత చేరువగా వెళ్లనుంది.ఈ గ్రహ శకలం ఈ నెల 29న భూమికి చేరువగా రానున్నట్లు నాసా పేర్కొంది.మరి దాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for earth images

విశ్వం నుంచి నిత్యం అనేకానేక ఆస్టరాయిడ్స్ దూసుకొస్తూంటాయని అందులో కొన్ని భూమికి దగ్గరగా వస్తాయి.అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో ఓ ఆస్టరాయిడ్ భూమికి అతిదగ్గరగా రాబోతోంది.ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం లేనప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మాత్రం దీని గురించి హెచ్చరిస్తుంది. పిరమిడ్‌ కంటే పెద్దది, రెండు బోయింగ్‌ విమానాలంత పరిమాణంలో ఉన్న గ్రహశకలం భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. 2016 ఎన్‌ఎఫ్‌23 పేరుతో పిలిచే ఈ గ్రహశకలం 29న భూమికి చేరువగా రానుందని నాసా తెలిపింది.గంటకు 32400 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ గ్రహశకలం భూమిని తాకితే నష్టం దారుణంగా ఉంటుందని చెబుతున్నారు.

Image result for earth images

ఈ గ్రహశకలం 70 నుంచి 160 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రహశకలం ఈ నెల 29న భూమికి అత్యంత చేరువగా అంటే 48 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనున్నట్లు చెబుతున్నారు.భూమికి చంద్రుడికి మధ్యన ఉన్న దూరానికి 13 రెట్లు ఎక్కువగా ఉండే ఈ గ్రహశకలం భూమిని తాకితే నష్టం ఊహించలేనంత ఎక్కువగా ఉంటుందని ఆ నష్టాన్ని లెక్కించటం సాధ్యం కాదన్న మాటను నిపుణులుచెబుతున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం భూమికి ఎలాంటి నష్టం లేకున్నా ఏదైనా అనూహ్య పరిణామం తలెత్తితే? అన్న సందేహం ఒళ్లు జలదరించేలా చేస్తుందని చెప్పక తప్పదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒకవేళ తాకితే ఒక మహానగరాన్ని నామరూపాల్లేకుండా చేసే శక్తితో పాటు కోట్లాది మంది ప్రాణాలు తుడిచిపెట్టుకుపోయే వీలుందని చెబుతున్నారు.కాబట్టి ఎలాంటి పరిస్థితిలో రాకూడదనే కోరుకుందాం. విన్నారుగా భూమికి దగ్గరగా వస్తున్న గ్రహ శకలం గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. భూమికి దగ్గరగా వస్తున్న గ్రహ శకలం గురించి అలాగే ఒకవేళ ఏదైనా పరిస్థితిలో అది భూమిని తాకితే పరిస్థితి ఎలా ఉంటుందనుకుంటూన్నారు.మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.