అరకు మావోయిస్టుల ఘటన ప్రత్యక్ష సాక్షి మాజీ ఎమ్మెల్యే సోమ గన్‌మెన్‌ చెప్పిన షాకింగ్ విషయాలు

405

అడవిలో అంతా ప్రశాంతం అనుకుంటున్న వేళ హఠాత్తుగా అలజడి చెలరేగింది.మావోయిస్టు తుపాకుల శబ్దం సద్దుమణిగిందని భావిస్తున్న సమయంలో… తూటా పేలింది.ప్రస్తుతం ఒడిసా, ఛత్తీస్ గఢ్‌లకే పరిమితమనుకుంటున్న వామపక్ష తీవ్రవాద హింస… నవ్యాంధ్రలో, విశాఖ మన్యంలో బుసలు కొట్టింది.ఏకంగా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపైనే నక్సలైట్ల తుపాకీ గర్జించింది.అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను ఆదివారం మావోయిస్టులు కాల్చి చంపారు.అయితే వాళ్ళను చంపడానికి ముందు ఏం జరిగింది.ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయినా సోమ గన్‌మెన్‌ స్వామి చెప్పిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మావోయిస్టులు ముందు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఉదయం 11 గంటల వరకూ అరకులోనే ఉన్నారు. అనంతరం తన అనుచరుడు సివేరు సోమతో కలిసి నిమిటిపుట్టిలో గ్రామదర్శిని పర్యటనకు వెళ్లారు. గ్రామస్థులతో చర్చించి వెళ్తుండగా సుమారు 60 మంది వరకు మావోయిస్టులు వారిని చుట్టుముట్టారు.ఆ తర్వాత వీరిని తీసుకెళ్లి చంపేశారు.అయితే చనిపోయేముందు అసలేం జరిగింది.ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి అయినా మాజీ ఎమ్మెల్యే సోమా గన్ మెన్ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను ముగ్గురేసి చొప్పున చుట్టుముట్టారు. వెనుకనున్న రెండు వాహనాలకు ఐదారుగురు చొప్పున అటూ ఇటూ నిల్చున్నారు. ‘మాతో రండి. మాట్లాడాలి’ అని కిడారి, సోమలను ఆదేశించారు. ఈలోపే గన్‌మన్‌ అప్రమత్తమయ్యారు! ప్రతిఘటించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే వారిని ఎమ్మెల్యే నిలువరించారు.మావోయిస్టులు మా అందరిని రౌండప్‌ చేసి ఆయుధాలను లాక్కున్నారు. అనంతరం కొంచెం దూరంగా వెళ్లి 20 నిమిషాలు పాటు మీటీంగ్‌పెట్టారు.

ప్రభుత్వానికి తొత్తులుగా మారారని కిడారి, సివేరిలపై మావోయిస్టులు మండిపడ్డారు. ఏజెన్సీ భూముల్లో బాక్సైట్‌ తవ్వకాలకు ప్లాన్‌ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతుతో మూడు క్వారీలు నడుపుతున్నారు, వేల కోట్లు దోచుకుంటున్నారు ప్రజాధనం తినడం తప్పు. అరకు ఎంపీపీ అవిశ్వాసం వివాదంలో వ్యహరించిన తీరు మాకు నచ్చలేదుఅందుకే మీకు శిక్ష వేస్తున్నాం అని మావోయిస్టులు అన్నట్టు చెప్పాడు. ఎంత మంది వద్దని చెప్పినా వినరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై ఒకేసారి కాల్పులు జరిపారని స్వామి పేర్కొన్నారు.