స్కూటీ లో పాముల పుట్ట.. చూస్తే ప్యాంట్ తడిసిపోవడం ఖాయం

402

పాము..ఈ పేరు వింటే చాలు చాలా మంది ప్యాంట్ తడిసిపోతుంది.ఎందుకంటే అది చాలా డేంజరస్ జీవి కాబట్టి.అక్కడ పాము ఉందని తెలిస్తే చాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మనం అస్సలు వెళ్ళం.అయినా గానీ అవే మనం ఉన్నచోటుకు అప్పుడప్పుడు వస్తు ఉంటాయి. అయితే వీధిలోకి వచ్చినా లేదా ఇంట్లోకి వచ్చినా కూడా కనపడితే దానిని చంపేసో లేదా తరిమో పంపించేస్తాం. కానీ మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు తిరిగే మన బైక్ లోనే స్థావరం ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది. బైక్ మీద కూర్చోవాలంటేనే భయం వేస్తుంది కదా. అలంటి ఘటనే ఇప్పుడు చోటు చేసుకుంది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for స్కూటీ లో పాము

స్కూటీలో అనుకోని అతిథి మకాం వేసింది. దీంతో బెంబేలెత్తిన యజమాని జనం సహకారంతో దానిని తొలగించుకోవడానికి నానా పాట్లు పడ్డాడు. బెంగళూరు సమీపంలో హొసకోటె పట్టణంలోని వీవీ లేఔట్‌లో ఈ విడ్డూరం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం వీవీ లేఅవుట్‌లో తెలిసిన వ్యక్తుల ఇంటికి స్కూటీపై వచ్చాడు. ఇంటి ముందులా ఖాళీ స్థలం ఉండడంతో స్కూటీని ఆపి వెళ్ళిపోయాడు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఒక పాము వచ్చి స్కూటీ ఎక్కేసింది. ఎవరు లేరు అనుకుందేమో సరిగ్గా స్కూటికి ముందులా ఉండే ఒక బాక్స్ లాంటి ప్లేస్ లో సెటిల్ అయిపోయింది. ఇక ఆ ఇంట్లో పని పూర్తీ చేసుకుని బయటకు వచ్చాడు ఆ వ్యక్తి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

స్కూటీపై కూర్చుని స్టార్ట్‌ చేయబోతుంటే దాని లోపల దాక్కున్న చిన్న నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. పామును చూసిన ఆ వ్యక్తి ఉలిక్కిపడి పరుగందుకున్నాడు.ఒక్క క్షణం ప్రాణాలు పోయి వచ్చినట్టు అతనికి అనిపించింది. తరువాత స్కూటిలో పాము ఉందని స్థానికులకు చెప్పాడు. వెంటనే స్థానికులు మెకానిక్‌ సహాయంతో వాహన భాగాలు ఊడదీశారు. స్థానికంగా పాములు పట్టే నిపుణుడు ఉండడంతో అతనిని పిలిపించారు. అతను ఆ పామును బయటకు తీసి పట్టణ శివార్లలో పొదల్లో సురక్షితంగా వదిలేశారు. అది చిన్నపామే అయినా కాటేసి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదన్నారు. ఎందుకంటే అది మామూలు పాము కాదు నాగుపాము. దేవుడి దయవల్ల ఆ పాము అతనిని కాటెయ్యలేదు.చూశారుగా స్కూటిలో పాము ఎలా చేరిందో. కాబట్టి మీరు కూడా బైక్ స్కూటీ మీద వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకోండి. ఏ విష జీవి వచ్చి ఎప్పుడు ఎక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుంటుందో తెలీదు. మరి ఈ స్కూటీ పాము ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.