తల్లికి బిడ్డను దగ్గర చేసిన పాము… ఎలానో తెలిస్తే షాక్ అవుతారు

81

పాము అంతే భ‌య‌ప‌డని వారంటూ దాదాపుగా ఉండ‌రు. అయితే మనం ఎంత భ‌య‌ప‌డ‌తామో అంతకంటే వంద‌రెట్లు మ‌న‌ల‌ను చూసి పాములు భ‌య‌ప‌డ‌తాయి. పాములు ప‌గ‌బ‌డ‌తాయా అని గ్రామాల్లో ఉండే పెద్ద‌వారికి అడిగితే అవునంటారు. ఇక గ్రామాల్లో పాములు ప‌గ‌బ‌డాయంటే న‌మ్మడ‌మే కాదు. చాలా మంది ఇలాంటి ప‌రిస్థితి ఎదుర్కున్నామ‌ని చెబుతుంటారు. పామును చంపితే దోషం అని అంటారు. పామును పూజిస్తే ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని అంటారు. అవన్నీ నిజాలో అబద్ధాల్లో తెలియదు కానీ ఇప్పుడు ఒక మహిళా జీవితంలో జరిగిన దానిని చూస్తే అది నిజమేమో అని అనిపిస్తుంది. మరి ఆ మహిళా జీవితంలో ఏం జరిగిందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for snake

బీహార్ కు చెందిన రణవీర్ సిన్హా మైథిలి భార్యాభర్తలు. రణవీర్ పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అయితే పక్క ఊరిలో జరిగే ఉత్సవాన్ని చూడాలని వెళ్లినప్పుడు కొడుకు తప్పిపోయాడు. కొడుకు తప్పిపోయాడని తెలిసి మైథిలి చాలా బాధపడింది. కొడుకు కోసం ఎక్కని పోలీస్ స్టేషన్ లేదు వెతకని చోటు లేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కోసం మైథిలి తల్లడిల్లిపోయింది. అలా నెలలు గడిచిపోయాయి. బీహార్ లో మంత్రగాళ్లను ఎక్కువగా నమ్ముతారన్న విషయం మనకు తెలిసిందే.. మైథిలి కూడా తన కొడుకు గురించి ఏమైనా తెలుస్తుందో ఏమో అని ఒక మంత్రగాన్ని కలిసింది. ఆ మంత్రగాడు మైథిలికి గుండెపగిలి వార్త చెప్పాడు. బాబుకు నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు రణవీర్ పొలంలో ఒక నాగుపామును చంపాడు. ఆ పాపం వలనే కొడుకు దూరమయ్యాడని నాగదోషం చాలా బలీయమైందని దానిని అనుభవించాల్సిందే అని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో మైథిలి గుండె అదిరిపోయింది. తన బిడ్దదా తనకు దక్కే పాపనివారణ మార్గం చెప్పమని వేడుకుంది. అయితే సర్పదోషం పోవాలంటే ఉన్న ఒకేఒక్క మార్గం నాగదేవత అనుగ్రహం పొందటం. ప్రతిరోజు నాగదేవతను పూజిస్తూ నాగమంత్రాన్ని జపిస్తే బిడ్డ దొరికే అవకాశం ఉందని చెప్పడంతో మైథిలిలో ఒక నమ్మకం కలిగింది. ఇంటికి వెళ్లి పామును చంపినా విషయం నిజమా కాదా అని భర్తను నిలదీసింది. అతను నిజమే అని చెప్పాడు. దీంతో మంత్రగాడి మాటల మీద మైథిలికి మరింత విశ్వాసం కలిగింది.

Image result for నాగదేవత అనుగ్రహం

అంతే ఆరోజు నుంచి మైథిలి నాగదేవత ఆరాధన తప్ప మరే పని పెట్టుకోలేదు. రోజు నాగదేవతను పూజిస్తూ నాగదేవత నామం జపిస్తూ ఆ ద్యాసలోనే గడిపింది. కొడుకు కోసం కన్నీళ్లు కారుస్తూ పూజలు చేసింది. ఐతే ఈ నాగుల చవితి రోజున మైథిలి కడుపుకోతను పులుస్టాప్ పడింది. నాగులచవితి రోజు పుట్ట దగ్గరకు వెళ్లి పాలు పోసి ఉపవాస దీక్షను చేపట్టింది. తిండి తినకుండా నాగదేవత పేరును స్మరిస్తూనే ఉంది. అలాగే స్మరిస్తూ కళ్ళుతిరిగి నిద్రలోకి జారుకుంది. అయితే అర్ధరాత్రి కలలో మైథిలికి ఒక నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. మైథిలి తనకు తెలియకుండానే ఆ పాము వెనుక పరుగులు తీసింది. ఆ పాము కొండలు దాటుకుంటూ చాలా వేగంగా వెళ్ళిపోతుంది. కలలో మైథిలి కూడా ఆ పాము వెనుక అంతేవేగంతో పరుగులు తీసింది. అయితే పాము బీహార్ లోని గయా జిల్లాలోని మాన్పూర్ లోని ఒక హోటల్ లోకి వెళ్ళింది. మైథిలి కూడా హోటల్ లోకి వెళ్ళింది. అంతలోనే పాము మాయమైంది. మైథిలి ఆ హోటల్ లో ఎవరు కనిపించడం లేదు. చుట్టూ చూసింది. దూరంగా ఒక చిన్న పిల్లాడి ఆకారం. టిఫిన్ ప్లేట్స్ కడుగుతూ కనిపించాడు. ఇంకాస్త దగ్గరకు వెళ్ళగానే ఆ పిల్లడు ఎవరో కాదు తన కొడుకే అని గ్రహించింది. వెంటనే ఆబాలుడిని పట్టుకుని గట్టిగా అరుస్తూ ఏడ్చింది.

ఈ క్రింద వీడియో చూడండి

ఇదంతా కలలో జరిగింది. నిద్రమత్తులో ఉన్న మైథిలి కూడా కొడుకు కలవరిస్తూ ఏడుస్తుంది. అది చుసిన భర్త ఆమెను నిద్రలేపాడు. నిద్రలేచిన తర్వాత భర్తకు తనకు వచ్చిన కల గురించి చెప్పింది. వెంటనే మనం అక్కడికి వెళ్ళాలి అని భర్తను తీసుకెళ్లి కలలో కనిపించిన హోటల్ దగ్గరకు వెళ్ళింది. అద్భుతం చోటుచేసుకుంది అక్కడ. ఆ హోటల్ లో పని చేస్తూ తన కొడుకు కనిపించాడు. కొడుకును చూసి ఆ భార్యాభర్తలు మురిసిపోయారు. ఇలా నాగుపాము కలలో కనిపించి తన కొడుకు ఆచూకీ తనకు తెలిపింది అని మైథిలి తెగమురిసిపోతుంది.