బిడ్డకు పాలు ఇస్తూ నిద్రపోతున్న తల్లిని పాము కరిచింది.. పాలు తాగుతున్న బిడ్డకీ ఏమైందో తెలిస్తే షాక్ !

420

మృత్యువు ఎటువైపు నుంచి తరముకొస్తుందో ఎలా వస్తుందో చెప్పలేం. ఎక్కడున్నా అది మనల్ని ఏదొక వెంటాడుతూనే ఉంటుంది. అలాగే పాము రూపంలో తల్లి, బిడ్డను మృత్యువు వెంటాడింది. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చనిపోతున్నామని వారికి తెలియదు. నిద్రిస్తున్న ఓ మహిళను పాము కరిచింది. నిద్రలోనే ఆ మహిళ మరణించగా.. ఆమె పాలు తాగిన బిడ్డ కూడా మరణించింది.మరి ఆ విషాద ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for snake bite

యూపీలోని ముజఫర్‌నగర్ జిల్లా మాండ్లకు చెందిన మహిళ నిద్రపోతున్న సమయంలో ఓ పాము ఇంట్లో చొరబడింది. మంచంపైకి ఎక్కి నిద్రపోతున్న ఆమెను కరిచింది. నిద్రమత్తులో ఉన్న ఆమె పాము కాటును గుర్తించలేకపోయింది. ఇంట్లో కూడా ఆ సమయంలో ఎవరు లేరు. అలా పాము కరిచేసి వెళ్ళిపోయింది.ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె రెండున్నరేళ్ల పాప పాల కోసం ఏడ్చింది. నిద్రమత్తులో ఉన్న ఆమె నిద్రలేచి పాప ఏడుస్తుందని పాపకు పాలు ఇచ్చింది. ఆ తర్వాత పాపను పడుకోబెట్టి ఆమె తన పనులు తాను చేసుకుంది. అలా కొద్దిసేపటికి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆమెను ఎవరు గుర్తించలేకపోయారు. విషం ఉన్న పాలు తాగడంతో ఆ పాప కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే చాలా సమయం తరువాత పక్కింటి ఆంటీ ఏదో అవసరం ఉండి ఆమె ఇంటికి వెళ్తే ఆమె అపస్మారక స్థితిలో ఉండటం గమనించింది.వెంటనే చుట్టుపక్కల వాళ్లకు చెప్పి తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాగా ఆలస్యం అవ్వడంతో చికిత్సపొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కొద్దిసేపటికి తల్లి కూడా చనిపోయింది. తల్లీ, బిడ్డ చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటి వరకు తమ కళ్ల ముందు కనిపించిన చిన్నారి, తల్లి చనిపోవడాన్ని బాధిత కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. ఇంట్లో ఇద్దరినీ వదిలేసి బయటకు వెళ్లడం వలనే ఇలా జరిగిందని ఆమె భర్త కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. వీరి రోదన చుసిన అక్కడి వారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాబట్టి నిద్రపోయేటప్పుడు ఇంటి తలుపులను దగ్గరకు వేసుకుని పడుకోండి. ఎప్పుడు ఎలాంటి విషజీవులు లోపలికి వచ్చేది తెలీదు. మరి పాము కాటు వలన చనిపోయిన ఈ తల్లీబిడ్డల ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.