తల్లిదండ్రులకు హెచ్చరిక :6 నెలల చిన్నారి గొంతులో వెంట్రుక ఇరుక్కుంది..ఏమైందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

281

చిన్నపిల్లలు ఏమి తెలియని అమాయకులు.వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదు.అది చేస్తే ప్రమాదం వస్తుందని దానివలన ప్రాణాలు పోతాయని కూడా వాళ్లకు తెలియదు.అందుకే పిల్లలకు ఏమి అవసరం ఉన్నా తల్లిదండ్రులే చూసుకోవాలి.వారి తిండి నుంచి ఆడుకునే ఆటల వరకు ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకుంటే వాళ్లకు ఏమైనా అవ్వొచ్చు.ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఘటన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు హెచ్చరిక.ఈ ఘటన విన్నాక అయినా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని ఆశిస్తూన్నాం.మరి ఏం జరిగిందో తెలుసుకుందామా.

హర్యానాలోని పానిపట్‌లోగల పూరేవాలా కాలనీలో తాత, మనవరాలు ఒకేసారి మృతిచెందిన ఉదంతం స్థానికులను విషాదంలో ముంచెత్తింది. 6 నెలల మోహిత్ అనే చిన్నారి ఆడుకుంటూ వెంట్రుకను మింగేసింది. అది గొంతుకు అడ్డుపడింది.అయితే ఆ విషయం తెలియని తల్లిదండ్రులు సాధారణంగానే ఉన్నారు.ఆ చిన్నారి వెంట్రుక అడ్డు పడడంతో కింద పడి గిలగిలమని కొట్టుకున్నాడు.అయితే ఆ సమయంలో కూడా ఆ చిన్నారి నవ్వుతునే ఉన్నాడు.అయితే ఇదంతా కావాలనే చేస్తున్నాడని వాడికి ఫన్నీగా చేస్తున్నాడని తల్లిదండ్రులు మురిసిపోయారు.కానీ ఆ పిల్లవాడు లోపల పడుతున్న బాధ వారికి తెలీదు.అయితే కొద్దీ సేపు అయినా అనుమానం వచ్చింది.చిన్నారి కావాలని చెయ్యడం లేదని ఏదో అయ్యిందని అనుమానం వచ్చింది. దీంతో ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.అయితే అక్కడి వైద్యులు ఆ చిన్నారిని పరిశీలించి గొంతులో వెంట్రుక ఇరుక్కుందని చెప్పారు.అది విన్న ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

చిన్నారి స్పృహ లేకుండా కింద పడిపోయింది.వెంటనే వేరే ఆసుపత్రి తీసుకు వెళ్లాలని ఆ హోస్పిటల్ డాక్టర్స్ సూచించారు.ఆలస్యం చెయ్యకుండా పెద్ద హాస్పిటల్ కు తీసుకెళ్లారు.కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.గొంతులో మంట తట్టుకోలేని ఆ చిన్నారి అప్పటికే కన్నుమూసింది.తల్లిదండ్రుల రోదన చూసి హాస్పిటల్ లో అందరూ కంటతడి పెట్టుకున్నారు.బరువెక్కిన గుండెలతో ఆ చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఆ పసివాడి మృతదేహాన్ని చూసిన ఆమె తాత జోగేంద్ర (45) షాక్‌కు గురై మృతి చెందాడు. అయితే వైద్యులు చిన్నారికి చికిత్స అందించివుంటే ఇలా జరిగేదికాదని కుటుంబ సభ్యులు అంటున్నారు.తప్పు వీళ్ళు చేసి డాక్టర్స్ ను అంటే ఏమొస్తుంది చెప్పండి.అందుకే ప్రతి తల్లిదండ్రి జాగ్రత్తగా ఉండండి.మీ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండండి.లేకుంటే మీ ఇంట్లో కూడా ఇలాగే జరగొచ్చు.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.