అక్క వ్యభిచారం చేసి చెల్లిని ఇరికించింది.. చివరికి చెల్లి ఏం చేసిందో చూడండి

421

తప్పు ఒకరు చేసి మరొకరి మీద నెట్టేయడం మనకు ఉన్న అలవాటే. అయితే ఆ తప్పు చిన్నది అయితే పర్లేదు కానీ పెద్దది అయితే. సమాజంలో మనల్ని చెడ్డవాళ్లలాగా చూపే తప్పు అయితే. చాలా కష్టము కదా. కానీ ఇప్పుడు చెప్పబోయే ఘటనలో అదే జరిగింది. అక్క వ్యభిచారం చేసి చెల్లిని ఇరికించింది. ఇలా ఇరికిస్తున్న ఆ చెల్లికి కూడా తెలీదు. ఇరికించిన తరువాత తెలిసింది. మరి తెలిసిన తరువాత ఆ చెల్లి ఏం చేసింది. ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for prostitute

ఆమె పేరు జాక్లీన్ హ్యుమినీ. ఫ్లోరిడాలో టీచర్ అవడం కోసం చదువుకుంటోంది. తల కల నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడి చదువుతున్న ఆమెకు ఓ రోజు షాక్ తగిలింది. ఎందుకంటే పాటర్సన్ మున్సిపల్ కార్యాలయంనుంచి 33డాలర్ల (రూ.38వేలకుపైగా) జరిమానా విధిస్తూ తనకు నోటీసులు వచ్చాయి. తను ఏ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఎందుకు జరిమానా విధించారో అర్థం కాలేదు. కానీ ఆ నోటీసుల్లో వ్యభిచారం చేసినందుకు జరిమానా విధించినట్లు ఉండటం ఆమెను మరింత భయాందోళనలకు గురిచేసింది. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసింది. ఏదో పొరబాటు జరిగిందని తనకు వ్యభిచారంతో సంబంధం లేదని తెలిపింది. కానీ ఇప్పుడు తాము ఏమీ చేయలేమని, జరిమానా కట్టాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు.

దాంతో ఏమి చేయాలో తెలియక జరిమానా కట్టేసింది. కథ అక్కడితో ముగిస్తే సరే. కానీ ముగియలేదు. కొన్ని నెలల తర్వాత మళ్లీ తాను వ్యభిచారం చేసినట్లు పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి.దాంతో వ్యభిచారంలో పాల్గొన్నట్లు నోటీసుల్లో పేర్కొన్న సమయంలో తాను ఫ్లోరిడాలో ఉన్నట్లు, తాను పనిచేస్తున్న సంస్థ నుంచి రికార్డులు తెచ్చి వారికి అందజేసింది. అయితే అవి చాలవన్న పోలీసులు.. జాక్లీన్ వ్యభిచారి కాదని నిరూపించుకోవాలని సూచించారు. టీచర్ అవ్వాలనే తన కలకు వ్యభిచారం కేసు పెద్ద అడ్డంకిగా మారుతుందని అనుకున్న జాక్లీన్ ప్రైవేటు డిటెక్టివ్ సంస్థను ఆశ్రయించింది.ఇదంతా తన సోదరి పనేనని, మొదటిసారి నోటీసులు వచ్చినపుడే జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని జాక్లీన్ వాపోయారు. ఎలాగైనా తనను ఈ కేసు నుంచి బయటపడేయాలని కోరారు. దీంతో ఆ సంస్థ పోలీసులను సంప్రదించింది. ఈ విషయంపై స్పందించిన వారు..తమకు పరిస్థితి అర్థం అయ్యిందని, కానీ తామేమీ చేయలేమని చెప్పారు. ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి అవసరయ్యే సాయం చేస్తామని మాత్రం హామీ ఇచ్చారు.చూశారుగా ఈ అక్క ఎంత పని చేసిందో. మరి ఈ అక్కచెల్లెళ్ల ఘటన గురించి అలాగే ఇలా తప్పు చేసి ఇతరుల మీద నెట్టేసే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.