యానాం రియల్ స్టోరీ

63

యానాం ఈ పేరు చెబితే ఆహ్లదకరమైన ప్రాంతంగా చెబుతాం, పైగా కేంద్రంపాలిత ప్రాంతం, మద్యం రేటు తక్కువ పెట్రోల్ పన్ను తక్కువ కాబట్టి భారీగా అమ్మకాలు ఉంటాయి.. యానం వెళితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయిస్తారు. అలాగే మద్యం ప్రియులు కూడా యానం వెళ్లి అక్కడే చుక్కేస్తారు.. మరి అలాంటి యానంలో అనేకమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. పర్యాటకులని ఆకర్షిస్తున్న యానం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Image result for యానాం

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం. దాదాపు 30వేల జనాభా ఉంటారు.. యానాంకు రాజధాని పాండిచ్చేరి…రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉంటాయి అందుకే అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి.ఇది త్రిభాషా (తెలుగు, తమిళం, ఫ్రెంచ్‌) సమ్మేళనంగా ఉంటుంది. అలాగే, మూడు దేశాల (బ్రిటిష్‌, ఫ్రాన్స్‌, భారత్‌) పరిపాలనా సామ్రాజ్యంగా చెప్పాలి.

Related image

ఇప్పుడు యానం చరిత్ర చూద్దాం
1723లో భారతదేశంలో యానాం మూడవ కాలనీగా ఫ్రెంచి పాలనలోకి వెళ్ళింది. అయితే ఆర్థికంగా పెద్ద పెద్ద ప్రయోజనాలు కనిపించక పోవటం వలన ఈ కాలనీని ఫ్రెంచివారు 1727లో వదిలేసారు. తరువాత 1742లో దీనిని మరలా ఆక్రమించి మొగలు సామ్రాజ్యాధిపతులు దగ్గర నుండి ఒక ఫర్మానా ద్వారా అధికారాన్ని పొందారు. అయితే వారి అంగీకారమును వారు ఇనాంల రూపంలో తెలిపారు. ఆ ఇనాం కాస్తా ఫ్రెంచివారి చేతులలో యానాంగా మారిపోయింది. ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశాన్ని ముందు విజయనగర రాజు, బొబ్బిలి యుద్ధంలో తనకు సహాయ పడినందుకుగాను, ఫ్రెంచి జెనరల్ అయిన బుస్సీకి కానుకగా ఇచ్చాడని చెబుతారు. ఇక్కడ బుస్సీ పేరుతో ఒక వీధి కూడా ఉంది. అంతే కాదు అదే వీధిలో ఉండే ఒక భవంతిలో బుస్సీ నివసించేవాడని కూడా అంటారు..ఆంగ్లేయులనుండి భారత దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా, యానాం జూన్ 13 1954 వరకు ఫ్రెంచి వారి ఆధీనంలోనే ఉండి పోయింది. యానాంలో 1954లో జరిగిన “భారత సైనిక దాడి” యానాం గతినే మార్చివేసింది… నవంబరు 1 – 1954 న ఫ్రెంచి స్థావరాలను భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా యానం ఏర్పడింది.

పుణ్య క్షేత్రాలు

వైష్ణవాలయం వీధి .. ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంది. ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ఉన్న వేంకటేశ్వర స్వామి విగ్రహం ముఖం మీద మీసాలు ఉన్నాయి. అందువలన ఇక్కడ వేంకటేశ్వర స్వామిని మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ గుడిని 15 వ శతాబ్దంలో రాజమండ్రిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్యులరాజులు సమయంలో కట్టించారు. ఈ దేవాలయం భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి మునుపు బాల్యవివాహాలు నిషేధించడానికి పూర్వం, బాల్యవివాహాలకు వేదికగా ఉండేది. బ్రిటిషు వారి పరిపాలనలో రాజా రామ్మోహన రాయ్ వంటి సంఘసంస్కర్తల వలన శారదా చట్టం అమలులోకి వచ్చాక బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి.యానాం ఫ్రెంచ్ వారి పరిపాలన జరుపుతున్న సమయంలో ఈ దేవాలయం బాల్య వివాహాలకు ఎంత ప్రసిద్ధి చెందినదంటే ఇరుగుపొరుగు రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. ఇక్కడికి మద్రాసు రాష్ట్రం, హైదరాబాదు నుండి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. వందలకొద్ది వివాహాలు జరగడం వల్ల ఈ ఊరిని కళ్యాణపురం అని పిలిచేవారు.

యానాం మసీదు.. 1848 సంవత్సరంలో ఈ మసీదు నిర్మాణానికి ఫ్రెంచ్ ప్రభుత్వం స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. అప్పుడు చిన్న మసీదుగా నిర్మితమైనది. తరువాత కాలంలో 1956 సంవత్సరంలో మసీదుకి పునరుద్ధరణ పనులు జరిగాయి. 1978 సంవత్సరంలో మసీదుని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి నిర్మించారు.1999-2000 సంవత్సరానికి ఈ మసీదు చాలా ఉన్నత మసీదుగా తీర్చిదిద్దారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉంది. రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగలు చాలా జరుపబడతాయి. తల్లరేవు, కొలంక, శుంకరపాలెం నుండి కూడా భక్తులు వచ్చి ప్రార్థన జరుపుకొంటారు.

Related image

కాథలిక్ చర్చియానాం చర్చి… ఈ ఫ్రెంచి కతోలిక చర్చి ఫ్రెంచి పరిపాలనను గుర్తు చేస్తూ గుర్తింపుగా ఉంటుంది. దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి అని పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండపు నిర్మాణశైలిలో నిర్మితమైనది. ఈ చర్చి నిర్మాణానికి కావలసిన సరంజామ, లోపలి సామాన్లు, అలంకరణ వస్తువులు ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకొనబడినవి.ఈ చర్చి ఆకర్షణ ఏమిటి అంటే.. ఈ చర్చికి దగ్గరలో మరో చిన్న కొండపై గుడి ఉంది, దీనిని కూడా ఫ్రెంచి పరిపాలకులు నిర్మించారు. ఈ కొండ పై నున్న గుడి ప్రక్కన మరో కొండ పై చర్చిని బ్రిటీష్ ఇంజినీర్లు నిర్మించారు. 1943 సంవత్సరంలో విలియమ్ అగస్టస్ అనే ఓడ తుఫాను వల్ల ఒక ఇసుక ద్వీపంలోకి చిక్కుకొని పోయింది. ఎంత ప్రయత్నం జరిపినా వెయ్యి టన్నులు ఉన్న ఈ ఓడని ఒడ్డుకి చేర్చలేక పోయారు. ఈ ఓడ అదే ప్రదేశంలో ఒక సంవత్సరం పాటు ఉంది. అప్పుడు అమెరికా నుండి ఇక్కడకి ఎంపికైన స్వైనీ అనే ఇంజనీరు మేరీమాతని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహంతో ఆ ఓడ ఒడ్డుకి చేర్చబడింది అందుకే మేరిమాత గుర్తింపుగా ఈ చర్చిని కొండ మీద కట్టించారు. ఈ చరిత్ర అంతా కొండ మీద ఉన్న చర్చి గోడల మీద వ్రాసి ఉంది.పర్యాటకంగా ఎంతో బాగా డవలప్ చేస్తోంది ప్రభుత్వం..ఇటీవల 25కోట్ల రూపాయలతో ఐఫిల్‌ టవర్‌ ఆకృతిలో ఓ కట్టడాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న 18ఎకరాల స్థలంలో బొటానికల్‌ గార్డెన్‌, చిల్డ్రన్‌ పార్క్‌, మ్యూజికల్‌ ఫౌంటెన్‌లను సుమారు రూ.15కోట్ల వ్యయంతో నిర్మించారు, మరి చూశారుగా యానం స్టోరీ, ఓసారి మీరు కూడా ఈ ప్రాంతాన్ని చూడండి, మంచి అనుభూతి పొందుతారు. మరి స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.