జాన్సన్ బేబీ పౌడర్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

55

వాతావరణంలో కాలుష్యం పెరగడంతో పాటు.. మనం ఉపయోగించే వస్తువులు, తినే తిండిలో కూడా మందులు కలిపి అమ్మేస్తున్నారు. నెయ్యిలో నూనెను కలపడం, పాలలో నీరు, పౌడర్ వంటివి కలిపి అమ్మేయడం వంటివి రోజూ చూస్తూనే ఉన్నాం. చర్మ సౌందర్యం కోసం ఉపయోగించే వాటిలో కూడా రసాయన పదార్థాలు కలిపేస్తున్నారు. దీంతో ఏ క్రీమ్ ఉపయోగించాలన్నా అనుమానపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చిన్నపిల్లల చర్మ రక్షణ కోసం ఉపయోగించే జాన్సన్ బేబీ పౌడర్‌లో ప్రమాదకర రసాయనం ఉన్నట్లు తేలింది.

Image result for జాన్సన్ బేబీ పౌడర్

జాన్సన్ బేబీ పౌడర్ గురించి అందరూ వినే ఉంటారు. చిన్న పిల్లల చర్మ రక్షణ కోసం చాలామంది జాన్సన్ కిట్‌ను ఎంపిక చేసుకుంటారు. కాని ఇప్పుడు మీ బేబీకి జాన్సన్ బేబీ పౌడర్ యూస్ చేస్తున్నారా అయితే ప్రమాదమే. ఏంటి షాకింగ్ ఉందా..? అవును అసలు విషయం ఏంటంటే.. జాన్సన్ బేబీ పౌడర్‌లో ఆస్ బెస్టాస్ ఉన్నట్లు అమెరికా హెల్త్ రెగ్యులేటరీ కమిటీ గుర్తించింది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ ఫార్మా సూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 130 ఏళ్ల అనుభవం ఉన్న ఈ కంపెనీకి మార్కెట్‌లో మంచి పేరుంది. ఈ కంపెనీ 2003 నుంచి ఉత్పత్తులను చైనాలో తయారు చేసి అమెరికాకు సరఫరా చేస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన హెల్త్ రెగ్యులేటరీ కమిటీ.. జాన్సన్ పౌడర్‌లో ఆస్ బెస్టాస్ ఉన్నట్లు వెలుగులోకి తెచ్చిన ఘటనతో ఈ సంస్థ బ్రాండ్ ఒక్కసారిగా పడిపోయినట్లైంది. అమెరికా మార్కెట్ నుంచి 33 వేల బేబీ పౌడర్ బాటిళ్లను జాన్సన్ అండ్ జాన్సన్ రీకాల్ చేస్తోంది. ఆన్‌‌లైన్‌‌లో కొన్న బాటిళ్ల శాంపుల్స్‌‌లో ఆస్‌‌బెస్టాస్ అవశేషాలు ఉన్నట్టు హెల్త్ రెగ్యులేటరీ గుర్తించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వార్తల నేపథ్యంలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ షేర్లు అంతర్జాతీయ మార్కెట్‌‌లో 6 శాతానికి పైగా పడిపోయి 127.70 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. అమెరికా రెగ్యులేటర్స్ తొలిసారి ఈ ప్రొడక్ట్‌‌లో ఆస్‌‌బెస్టాస్ ఉన్నట్టు ప్రకటించాయి.

ఈ క్రింద వీడియో చూడండి

కంపెనీ కూడా తొలిసారి తన ఐకానిక్ బేబీ పౌడర్​ను రీకాల్ చేస్తోంది. ఇప్పటికే జాన్సన్ అండ్ జాన్సన్‌‌పై పలు ప్రొడక్ట్‌‌ ల విషయంలో అనేక వివాదాలు ఉన్నాయి. దీని మెడికల్ డివైజ్‌‌లు, బేబీ పౌడర్ వంటివి ఆరోగ్యానికి మంచివి కావంటూ ఆరోపణలున్నాయి. జాన్సన్ బేబీ పౌడర్ లాంటి ఉత్పత్తులను వాడటం వల్ల క్యాన్సర్ వస్తోందని కన్జూమర్లు 15వేలకు పైగా ఫిర్యాదులు దాఖలు చేశారు. గతంలో కొందరికి ఈ పౌడర్ వలనే క్యాన్సర్ సోకిందని వార్తలు వచ్చాయి. దీనిపై ఫిర్యాదుల విషయంలో కోర్టు కంపెనీకి జరిమానాలు కూడా విధించింది. ఇదిలా వుండగా, ఈ సంస్థ ప్రతినిధి నికోల్సన్ మాట్లాడుతూ ఎఫ్‌డిఎ నమూనాల పరీక్షలో 0.00002 శాతం కంటే క్రిసోటైల్ అస్బెస్టాస్ ఎక్కువ ఉండదని కనుగొందని చెప్పారు.

Image result for జాన్సన్ బేబీ పౌడర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర సంస్థలు ఎంత మొత్తం ఉండాలనే అంశంపై ఇప్పటివరకూ ఎటువంటి నిర్ధారణ చేయలేదని తెలిపారు. ఈ కంపెనీ బేబీ పౌడర్‌, ఒపియాడ్స్‌, వైద్య పరికరాలు, యాంటీ సైకోటిక్‌ రిస్పెర్డాల్‌తో సహా వివిధ ఉత్పత్తులపై ఇప్పటికే వేలాది కేసులను ఎదుర్కొంటున్నది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణలో కూడా వాటి శాంపిల్స్ సేకరిస్తున్నారు. శాంపిల్స్ సేకరించాల్సిందిగా తెలంగాణలో డ్రగ్ శాఖ అధికారి సురేంద్రనాథ్ సాయి డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ‘జాన్సన్ బేబీ పౌడర్ మీద జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని శాంపిల్స్ సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించాం’ అని సాయి తెలిపారు. మరి జాన్సన్ బేబీ పౌడర్ మీద జరుగుతున్న ఈ ప్రచారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి