నా భార్య‌ని బిడ్డ‌ని వ‌దిలేసి ప్రేయ‌సితో వెళ్లిపోమంటారా డాక్ట‌ర్ స‌మాధానం వింటే షాక్

370

కొంద‌రు ప్రేమిస్తారు కాని వారి ప్రేమ‌ను సాధించుకోలేరు.. త‌ల్లిదండ్రులు కులాలు మ‌తాలు ఇలా అనేక అడ్డులు వ‌స్తాయి.. అయితే ముఖ్యంగా వీరి పెళ్లి అయిపోయాక సెటిల్ అయ్యాక కూడా వీరు క‌లుసుకుంటే ఆ ప్రేమ‌ని మ‌ర్చిపోలేరు. ఇక ఈ స‌మ‌యంలో ఇలాంటి ఓ ల‌వ‌ర్ త‌న మాజీ ప్రేయ‌సి త‌న జీవితంలోకి వ‌స్తాను అంటోంది అని, త‌న ప్రేయ‌సికి గ‌తంలో పెళ్లి అయింది పిల్ల‌లు ఉన్నారు, నాకు పెళ్లి అయింంది పిల్ల‌లు ఉన్నారు ఇప్పుడు ఏం చేయ‌మంటారు అని డాక్ట‌ర్ని అడిగాడు మ‌రి ఆ స‌మాధానం వినండి.

Image result for loversనాకు పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతుంది. ఒక బాబు కూడా ఉన్నాడు. నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భార్య చాలా మంచిది. నేను ఏం చెప్పినా వింటుంది. చాలా అమాయకురాలు. అలాంటి అమ్మాయి నా భార్యగా రావడం నా అద్రుష్టం. పెళ్లయిన కొత్తలో నేను తనతో అస్సలు మాట్లాడేవాణ్ని కాదు. తనని పురుగుని చూసినట్లు చూసేవాణ్ని. డీప్ గా లవ్ చేశాను నేను అంతకు ముందు ఒక అమ్మాయిని డీప్ గా లవ్ చేశాను. మా ఇంట్లో వాళ్లకు ఆ విషయం తెలిసింది. తను వేరే కులం అమ్మాయి అని మా పెళ్లికి అంగీకరించలేదు. తర్వాత మా బంధువుల అమ్మాయితో నా పెళ్లి నిశ్చయించారు. నేను మా బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా చనిపోతామని మా ఇంట్లో వాళ్లు బెదిరించారు. కరిగిపోయాను దాంతో తప్పని పరిస్థితుల్లో నేను ఆమెను పెళ్లి చేసుకున్నాను.

Image result for lovers

పెళ్లయిన మొదట్లో కొన్ని రోజులు తనతో సరిగ్గా మెలిగేవాణ్ని కాదు మాకు బాబు పుట్టినప్పటి నుంచి తనపై ఇష్టం పెరిగింది. నేను ఎంత కోప్పడినా కూడా తను నాపై చూపించే ప్రేమతో నేను కరిగిపోయాను. ఇలా ప్రశాంతంగా సాగుతున్న మా కాపురంలోకి మళ్లీ నా మాజీ ప్రియురాలు వచ్చింది. తనని చూడగానే చాలా ఏళ్ల తర్వాత తను నాకు కనపడింది. తనకు కూడా పెళ్లయ్యింది. తనకు ఇద్దరు పిల్లలు. అయితే ఆమె, భర్తతో పిల్లలతో కలిసి మా ఇంటికి దగ్గర్లోనే రెంట్ కు ఉంటోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ మధ్య ఒకసారి తను మార్కెట్లో కలిసింది. తనని చూడగానే నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఇళ్లు దగ్గరే కావడంతో వీలు దొరికినప్పుడల్లా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. తన కష్టసుఖాలన్నీ నాతో పంచుకుంటుంది. తనతో మాట్లాడుతుంటే నాకు అస్సలు సమయమే తెలియడం లేదు. అయితే తన భర్తకు అనుమానం ఎక్కువని తనను నిత్యం వేధిస్తుంటాడని నా ప్రియురాలు ఏడ్చింది. తను అతనితో కాపురం చెయ్యలేనని నా దగ్గరకు వచ్చేస్తానంది. తనతోనే ఉండమని కోరుతుంది. నా ప్రియురాలిని కాదనలేకపోతున్నాను రోజూ తను నాతో అదే విషయం చెబుతోంది. తనపై ఉన్న ప్రేమతో నేను ఏమీ చెప్పలేకపోయాను. కానీ నా భార్య కూడా నన్ను ఎంతో ప్రేమిస్తుంది.

Image result for lovers

అలా అని నా ప్రియురాలిని కాదనలేకపోతున్నాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దయజేసి నాకు సలహా ఇవ్వగలరు. ప్రేయసిని కష్టాల నుంచి గట్టెక్కించడానికి సమాధానం : మీకు పెళ్లి కాక ముందు ప్రేయసి ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల ఆమెను పెళ్లి చేసుకోలేకపోయారు. ఇప్పుడు మీకు భార్య, బాబు ఉన్నారు. మొదట మీ ఫ్యామిలీకే ప్రాముఖ్యత ఇవ్వండి. మీ ప్రేయసిని కష్టాల నుంచి గట్టెక్కించడానికి అమాయకురాలైనా నీ భార్యను బలి చేయకండి. ఆమెకి అన్యాయం చేయకండి నిన్ను ఎంతో నమ్ముతున్న నీ భార్య జీవితాన్ని నాశనం చేయకండి. ఆమె భర్తను మార్చే ప్రయత్నం చేయడానికి సూచనలు ఇవ్వండి. అలాగని మీరు పెద్దమనిషిలా మారి డైరెక్ట్ గా మీ ప్రియురాలి జీవితాన్ని మార్చాలని మాత్రం ప్రయత్నించకండి. దానివల్ల అసలుకే మోసం వస్తుంది. మీ ప్రియురాలి కోసం మీ భార్య, బాబుకు అన్యాయం చేయకండి. మ‌రి చూశారుగా డాక్ట‌ర్ చెప్పిన ఈ స‌మాధానం పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.