సంక్రాంతి పండగ తర్వాత బంగారం కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్

301

బంగారం ధ‌ర‌లు ఒక్క‌సారిగా మార్కెట్లో పెరుగుతున్నాయి ఇక‌పెళ్లిళ్ల సీజ‌న్ కు మ‌రో నెల‌రోజుల స‌మ‌యం ఉండ‌టంతో పెద్ద ఎత్తున కోనుగోళ్లు జ‌రుగుతాయి అని చూస్తున్నారు వ్యాపారులు, ముఖ్యంగా బులియ‌న్ ట్రేడ్ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం సంక్రాంతి త‌ర్వాత వెండిరేటు మ‌రింత పెరుగుతుంది అని చెబుతున్నారు.

Related image

వరుసగా బంగారం ధ‌ర‌లు మూడో రోజు కూడా పెరిగాయి. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.32,800లకు చేరింది. పెళ్లి సీజన్ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెర‌గ‌డం ఇందుకు ప్రధాన కారణం అని చెబుతున్నారు.. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.300 పెరుగుదలతో రూ.40,100కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెర‌గ‌డంతో ధరల పెరుగుదల జ‌రిగింది అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పెళ్లి సీజన్ కారణంగా దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ పెర‌గ‌డం వల్ల బంగారం ధరలు ప్ర‌ధానంగా పెరిగాయని ట్రేడర్లు పేర్కొన్నారు. అయితే ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.38శాతం క్షీణతతో 1,281 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.32,800కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.32,650కు పెరిగింది. గత రెండు సెషన్లలో బంగారం ధర రూ.190 మేర పెరిగింది.మకర సంక్రాంతి తర్వాత పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమౌతుందని, అప్పుడు బంగారం ధర ఇంకా పెర‌గ‌చ్చు అని గ‌త ప‌ది హేను రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి ఇప్పుడు ఇలాగే మార్కెట్లో ధ‌ర‌లు పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర కేజీకి రూ.210 తగ్గుదలతో రూ.39,800కు పడిపోయింది. ఇక బంగారం కొనుక్కోవాలి అంటే సంక్రాంతికి ముందు కొనుక్కోవ‌డం మేలు అంటున్నారు విశ్లేష‌కులు.