ప్రేమ సాక్షిగా చనిపోయింది.. 5 రోజుల తర్వాత బ్రతికి షాకిచ్చింది..!

574

చనిపోయిన వ్యక్తి బతికిరావడం గురించి ఎప్పుడైనా విన్నారా.చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగొస్తారు అని అంటారా.కానీ ఇది జరిగింది.చనిపోయిందనుకున్న అమ్మాయి మళ్ళి తిరిగొచ్చింది.దెయ్యమేమో అని అనుకునేరు.నిజంగానే మనిషి రూపంలో వచ్చింది.చనిపోయిన అమ్మాయి బతికిరావడం చూసి ఒక ఊరి ప్రజలందరూ షాక్ అయ్యారు.ఉత్తరప్రదేశ్ రాష్టంలో ఇప్పుడు ఇదే హాట్ న్యూస్ అయ్యింది.అలా ఎలా వచ్చింది అనుకుంటున్నారా..అయితే మీరు పూర్తీగా తెలుసుకోవాల్సిందే. మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఉత్తరప్రదేశ్ రాష్టం నోయిడా ప్రాంతానికి చెందిన నీతూ రామ్ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు.నీతూ తల్లిదండ్రులు కిరాణం షాప్ నడుపుతుంటారు.అప్పుడప్పుడు షాప్ లో కూర్చుంటుంది నీతూ.షాప్ కు వచ్చే రామ్ తో స్నేహం ఏర్పడింది.ఆ స్నేహం కాస్త చివరికి ప్రేమగా మారింది.ఈ విషయం తెలిసి నీతూ తల్లిదండ్రులు ఆమెను మందలించారు.ఆరోజు నుంచి ఆమెను ఇంటికే పరిమితం చేశారు.దాంతో చేసేదేమిలేక ఇంటి నుంచి వెళ్ళిపోయి రామ్ ను పెళ్లి చేసుకుంది.నీతూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.నీతూ రామ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయినా ఫలితం లేకుండా పోయింది.వాళ్లిద్దరూ దొరకలేదు.అయితే కొన్ని రోజుల తరువాత ఒక అమ్మాయి శవాన్ని గుర్తించారు పోలీసులు.ఆ అమ్మాయి ముఖం మొత్తం చిట్లిపోయింది.ఆ అమ్మాయి నీతూలాగే ఉండడంతో పోలీసులు నీతూ తల్లిదండ్రులను పిలిపించారు.అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఆ డెడ్ బాడీ తమ కుమార్తెదే అని నిర్దారించారు.ఆ శవం మీద ఉన్న డ్రెస్ అమ్మాయి చెయ్యిపై ఉన్న పుట్టుమచ్చ అచ్చం వాళ్ళ అమ్మాయివే.దాంతో తమ కూతురు చనిపోయిందని భోరున ఏడ్చారు.ఆ శవాన్ని ఇంటికి తీసుకొచ్చి ఊరి ప్రజలందరి సమక్షంలో ఖననం చేశారు.రామ్ మీద హత్య కేసు పెట్టారు ఆమె తల్లిదండ్రులు.దాంతో నీ కొడుకు ఎక్కడ అని రామ్ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు పోలీసులు.మాకేమి తెలీదని అంటున్నారు తప్ప ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.ఇలా ఆ ఊరిలో వారం రోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

అలాంటి సమయంలో నీతూ ఒక్కతే బస్సు దిగి ఇంటికి వస్తుంది.అది చూసి ఊరి జనం అంతా షాక్ అయ్యారు.చనిపోయిన అమ్మాయి తిరిగిరావడం ఏమిటి..దెయ్యమా అని ఊరి ప్రజలు పరుగు తీశారు.ఏం జరిగిందో తెలియని నీతూ భయం భయంగా ఇంటికి వెళ్ళింది.ఆమె కుటుంబ సభ్యులు కూడా ముందు ఆమెను చూసి భయపడ్డారు.నేను నీతూను నేను చనిపోలేదు.నేను రామ్ దూరంగా వెళ్లి పెళ్లి చేసుకున్నాం.మీరు మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని దూరంగా వెళ్లిపోయాం అని చెప్పింది.ఇప్పుడు కూడా మీరేమైనా చేస్తారేమో అని భయపడి నేనొక్కదాన్నే వచ్చాను.మీ ఇష్టం ఏం చేస్తారో చెయ్యండి అంటూ గుమ్మం ముందు కూర్చుంది.నీతూను తల్లిదండ్రులు ఏమి అనకుండా జరిగిందంతా చెప్పారు.నీలాంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి నీలాగే చేతి మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి చనిపోయింది.నువ్వేమో అనుకుని ఖననం చేశాం అని నీతూకు చెప్పారు.ఈ విషయం గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.అందరు కలిసి స్మశానానికి వెళ్లారు.ఆ విషయం తెలిసి ఊరి ప్రజలందరూ షాక్ అయ్యారు.దాంతో తాము చేసిన తప్పు తెలుసుకుని శవాన్ని బయటకు తీసి మళ్ళి పోస్ట్ మార్టం కు పంపించారు.ఆ కేసు మీద పోలీసులు విచారిస్తున్నారు.ఇద్దరి పెళ్ళికి పెద్దలు ఒప్పుకోవడంతో నీతూ చాలా సంతోషముగా ఉంది.చనిపోయిన కూతురు తిరిగొచ్చింది.దీనికంటే ఇంకా ఏమి కావలి అని రామ్ ను పిలిపించి ఊరి ప్రజలందరి సమక్షంలో మళ్ళి పెళ్లి చేశారు.ఈ న్యూస్ దేశమంతటా హాట్ టాపిక్ అయ్యింది.