ఆమె నర్స్.. తొడలు చూపించి ఆ పని చేసింది.. తర్వాత ఏం జరిగిందో చూడండి

430

కొన్ని వృత్తుల్లో పనిచేసేవారు వస్త్రాలంకరణ తగినట్లుగా వుండాలి. అలాగే వారు చేసే వృత్తిని బట్టి పనులు కూడా వుండాలి.నర్స్ అనే పేరు చెప్పగానే ధవళ వస్త్రాలతో తెల్లటి దుస్తులను వేసుకుని రోగులకు సేవలు చేస్తూ వుండటం మనకు తెలిసిన విషయం.ఆస్పత్రుల్లో నర్సులు సాధారణంగా క్రమశిక్షణగా ఉంటారు. అలాగే వారు ధరించే దుస్తులు కూడా విధులకు తగినట్లుగా ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం ఓ నర్సు వేసిన డ్రెస్ ఆమె ఉద్యోగానికి ఎసరుపెట్టింది.మరి ఏమైందో తెలుసుకుందామా.

సినిమాల్లో నర్సు పాత్రలు చూపించేటపుడు పొట్టి పొట్టి డ్రస్సులతో వయ్యారంగా వస్తున్నట్లు చూపిస్తారు. వాస్తవానికి ఆస్పత్రులలో నర్సులెవరూ అలా మరీ పొట్టి దుస్తులు వేసుకుని తిరగరు. కానీ థాయ్‌లాండ్‌లో మాత్రం ఒక నర్సు ఇలా బాగా కురచగా కుండే దుస్తులు వేసుకుని రావడమే కాక, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. పరిచత్ పాంగ్ చత్‌స్రి (26) అనే ఈ నర్సు ఫొటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఫలితంగా ఆమె ఉద్యోగం కోల్పోయింది. థాయ్‌లాండ్‌లోని ఇసాన్ నగరంలోగల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె పనిచేస్తోంది. బాగా టైట్ ఫిట్ ఉండి, తొడలు కూడా కనిపించేలా ఆమె పొట్టి స్కర్టుతో కూడిన లిలాక్ యూనిఫాం ధరించింది.

Image result for nurse

పాశ్చాత్య ప్రమాణాల ప్రకారం అయితే పర్వాలేదు గానీ, థాయ్‌లాండ్‌లో మాత్రం దాన్ని రెచ్చగొట్టే డ్రస్సుగానే భావిస్తారు. పరిచత్ సరిగా డ్రస్సు వేసుకోకపోవడమే కాక నర్సింగ్ వృత్తిని కూడా అవమానించిందని విమర్శకులు మండిపడ్డారు. ‘థాయ్ నర్స్ లవర్స్ అసోసియేషన్’ అనే పేజిలో ఈ ఫొటో విపరీతంగా షేర్ అయింది. దాంతో ఆమెను బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. జరిగిన విషయాన్ని తాను ఆస్పత్రి వర్గాలకు వివరించానని, అయితే వాళ్లకు ఆస్పత్రి పరువు మర్యాదలే బాగా ముఖ్యమని ఆమె చెప్పింది. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకుని తాను రాజీనామా చేసినట్లు తెలిపింది. తాను కావాలంటే థాయ్‌లాండ్ నర్సింగ్‌ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్‌కు, ఆస్పత్రికి క్షమాపణలు చెబుతాను గానీ, తన పేరు చెప్పి నర్సులందరినీ ప్రజలు అవమానిస్తామంటే మాత్రం ఒప్పుకొనేది లేదని స్పష్టం చేసింది.మొత్తానికి ఒక సెల్ఫీ ఈమె ఉద్యోగాన్ని తీసేసింది. కాబట్టి నర్స్ లు ఇలా మోడ్రన్ గా తయారయ్యే ముందు ఒకసారి ఆలోచించండి. మన దగ్గర కూడా ఇలాంటి రూల్స్ ఉన్నాయేమో. మరి పొట్టి డ్రెస్ వేసుకుని ఉద్యోగాన్ని ఊడగొట్టుకున్న ఈ నర్స్ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.