రోజూకు 50 సిగరెట్లు కాల్చే మహిళ తన చివరి రోజుల్లో చెప్పిని మాటలు వింటే కన్నీరు పెట్టుకుంటారు

577

మ‌ధ్య‌పానం ఆరోగ్యానికి హానికారం అని చెప్పినా చేస్తాం… ఇక ధూమ‌పానం గురించి రోజూ ప్ర‌తీ చోట ఎక్క‌డో ఓచోట బోర్డుల్లో అలాగే సినిమా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో ఇక వ్యాపార ప‌త్రికా ప్ర‌ట‌క‌న‌ల్లో క‌నిపించినా చైన్ స్మోక‌ర్లు పెరుగుతున్నారు… కాని త‌ర‌గ‌డం లేదు.. అయితే నిర్ల‌క్ష్యం ఎంత దురాగ‌తానికి అయినా గురిచేస్తుంది.. చివ‌ర‌కు అదే వారి ప్రాణాల‌ను హ‌రిస్తోంది..ధూమ‌పానం చేయ‌ద్దు అని చెబుతున్నా చాలా మంది చేస్తూ ఉంటారు.. చివ‌రకు క్యాన్స‌ర్ వ‌చ్చి లంగ్స్ చెడిపోయి కిడ్నీల‌లో ప్రాబ్లం, ఊపిరితిత్తుల వ్యాధులు వ‌చ్చి వారి ప్రాణాలు కోల్పోతుంటారు.. ఇక ఓ చైన్ స్మోక‌ర్ త‌న జీవితంలో జ‌రిగిన విషాదాన్ని తాను కోల్పోయిన ప్ర‌పంచాన్ని చెబుతుంటే, ఎవ‌రికైనా క‌న్నీరు రాక మాన‌దు.. ఆమె విషాద గాద చైన్ స్మొకింగ్.. ఇలా దూమ‌పానం చేయ‌డం వ‌ల్ల ఆమె ఏమి కోల్పోయిందో ఓసారి తెలుసుకుందాం.

అమెరికాకు చెందిన టెర్రీ హాలీ అనే ఆమె 10 ర‌కాల క్యాన్స‌ర్ల‌తో పోరాడింది.. నార్త్ కెరోలినాలో ఆమె జీవించేది.. ఆమెకు క్యాన్స‌ర్ సోక‌డంతో ఆమె గొంతుకు బొంగురు పోయింది ..పెద్ద చిల్లు కూడా గొంతు మార్గంలో ప‌డి స‌ర్జీరీ చేయించుకుంది.. అలాగే సిగ‌రెట్లు కాల్చ‌డం వ‌ల్ల త‌న ప‌ళ్లుఅన్ని ఒక్కొక్క‌టిగా ఊడిపోయాయి.. క్యాన్స‌ర్ రావ‌డంతో జుట్టు అంతా ఊడిపోయింది… ఇక ఆమె మాట్లాడ‌టానికి గొంతు ద‌గ్గ‌ర ఆమె భావాలు చెప్పేలా ఓ డివైస్ ను పెట్టుకుని… రోజూ త‌యారు అయ్యేది.ఆమె చెప్పిన‌ కొన్ని విష‌యాలు తెలుసుకుంటే జీవితంలో మార్పు క‌చ్చితంగా వ‌స్తుంది.

పిల్ల‌లు ఉన్న తల్లిదండ్రులు స్మోకింగ్ మానెయ్యండి.. లేక‌పోతే మీ జీవితాలు నాశ‌నం అవుతాయి.. ఇక నాకు 14 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న‌ప్ప‌టి నుంచి సిగ‌రెట్లు కాల్చ‌డం మొద‌లుపెట్టాను.. అది క్ర‌మంగా 17 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చేస‌రికి రెండు బాక్సుల సిగ‌రెట్లు కాల్చేదాన్ని…2000 సంవ‌త్స‌రంలో నా ఆరోగ్యంలో కాస్త మార్పులు వ‌చ్చాయి.. గొంతులో పుండ్లుఏర్ప‌డ్డాయి.. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కూ మాన‌కుండా సిగ‌రెట్టు కాలుస్తూ ఉండేదాన్ని.. ఫోన్ మాట్లాడే స‌మ‌యంలో భోజనం తినే స‌మ‌యంలో కూడా సిగ‌రెట్లు కాల్చేదాన్ని.. ఏ కార‌ణం లేక‌పోయినా సిగ‌రెట్లు ఒకేసారి ఐదు నుంచి ప‌దికాల్చేదాన్ని. ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాను.

నా గొంతు వినిచిన్న పిల్ల‌లు న‌న్ను అడుగుతున్నారు.. వారికి నేను చెబుతున్నాను.. నేను సిగ‌రెట్లు కాల్చ‌డం వ‌ల్ల నా ఆరోగ్యం ఇలా అయిపోయింది అని, నా గొంతు ఇలా పోయింది అని చెప్పాను.. అందుకే సిగ‌రెట్లు కాల్చ‌డం అల‌వాటు చేసుకోకండి.. కాల్చేవారు కూడా దానిని మానివేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు.. చివ‌ర‌కు ఆమె ఇలా బాధ‌ప‌డుతూ 1960 లోపుట్టిన ఆమె 2013లో ప్రాణాలు విడిచింది.. ఆమెకు53 ఏళ్ల వ‌య‌సు ఉన్న స‌మ‌యంలో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది… కేవ‌లం సిగ‌రెట్ కాల్చే అల‌వాటుతో.. చూశారుగా సిగ‌రెట్ వల్ల ఎన్ని అన‌ర్దాలు ఉన్నాయో… అందుకే ఇంట్లో ఇటువంటి అల‌వాట్లు ఉన్న‌వారిచేత ఎలాగైనా మానిపించండి.. ఇక మీ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ధూమ‌పానంకు దూరంగా ఉండండి..