ప్ర‌పంచంలో ఇలాంటి మ‌హిళను ఎక్క‌డా చూసి ఉండ‌రు నాలుగువేల మందికి ఆమె దిక్కు

794

ఆడ‌పిల్ల‌వి నువ్వు ఏం చేయ‌లేవు అంటారు.. కాని అంత‌రిక్షంలోకి కూడా వెళ్లి త‌మ స‌త్తాచాటారు మ‌హిళ‌లు…నేడు అనేక ప్ర‌ఖ్యాత కంపెనీల‌లో మ‌హిళ‌లు అత్యున్న‌త స్ధానంలో ఉన్నారు.. కాని ఇప్పుడు ఓ మ‌హిళ గురించి తెలుసుకుంటే ఆమె జీవిత ప్ర‌యాణం వింటే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు….అస‌లు కాటికాపరి పదం వినగానే ఒక పురుషుడు కళ్ల ముందు మెదులుతాడు. ఆ స్థానంలో ఒక మహిళను ఊహించుకోగలరా? మహిళలు కాటి కాపరిగా ఉంటేనే కదా ఊహకందడానికి అనకండి. అలాంటి ఓ మహిళను మీకు పరిచయం చేస్తున్నాం.

Image result for jayalaxmi at burial ground

ఆమె పేరు జయలక్ష్మి. అనకాపల్లి శ్మశానవాటికలో కాటికాపరిగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక మహిళా కాటికాపరి ఈమె.ఇప్పటిదాకా 4వేల మృతదేహాలకు ఆమె దహన సంస్కారాలు నిర్వహించారు….మగాళ్లకే కాదు.. ఆడవాళ్లకు కూడా ధైర్యం ఉంటుందని బెబుతున్నారు జ‌య‌ల‌క్ష్మీ….గతంలో జయలక్ష్మి భర్త కాటికాపరిగా పని చేసేవారు. ఆయన చనిపోయాక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పటికింకా పిల్లలు చాలా చిన్నవారు.పిల్లల బాగు కోసం తన భర్త వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకుంది జయలక్ష్మి….కానీ ఈ పని చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. తన భర్త వృత్తిని తానే కొనసాగిస్తానంటూ.. అధికారులను సంప్రదించారు జయలక్ష్మి..నువ్వు ఆడపిల్లవి.. ఈ పని నువ్వెలా చేస్తావు అని అధికారులు ప్రశ్నించారు. అందుకు సమాధానంగా ఆమె ఏమి చెప్పిందో వింటే ఆశ్చ‌ర్య‌పోతారు…. నేను ఈ పని చేయగలను. ఆ పని నాకు ఇప్పించండి. ఒకవేళ సరిగా చేయకపోయినా, నావల్ల ఏ తప్పు జరిగినా ఉద్యోగం నుంచి తీసేయండి అన్నారు ఆమె.. అలా 2002లో జయలక్ష్మి ఈ వృత్తి చేపట్టారు.

Related image

ఆ తర్వాత.. నేను ఈ పని చేయడం చూసి, వాళ్లే నాకు దండం పెట్టారు అని జయలక్ష్మి చెబుతున్నారు…నా మనవడు చనిపోయాక ఏ చిన్నపిల్లాడి శవాన్ని చూసినా ఏడుపొచ్చేదని చెబుతోంది ఆమె… ఇప్ప‌టికీ ఈ పని చేయడానికి జయలక్ష్మి చాలా కష్టపడుతున్నారు . తన పెద్ద మనవడు చనిపోయాక ఈ వృత్తి తనకు కష్టంగా అనిపించినా, పట్టు విడువకుండా కాటికాపరిగానే ఆమె కొనసాగుతున్నారు.

చిన్న పిల్లల శ‌వాలు వ‌స్తే వారిని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూనే వారికి దహన సంస్కారాలు చేస్తాను. పిల్లాడ్ని కోల్పోయిన వారిక్కూడా ధైర్యం చెప్పి పంపుతాను అని జయలక్ష్మి అన్నారు….తన వృత్తి గురించి ఆమె మనుమలు, మనుమరాళ్లు.. అమ్మమ్మా ఈరోజు ఎన్ని బాడీలు వచ్చాయి?” అని ఆరా తీస్తారని జయలక్ష్మి చెప్పుకొచ్చారు. కేవ‌లం మ‌గాళ్ల‌కు మాత్రమే ధైర్యం ఉంటుందని అంటారు. కానీ ఆడవాళ్లకు కూడా ధైర్యం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను కదా అని అన్నారు… చూశారుగా ఈమె దైర్యం మ‌హిళ‌లు అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు అన‌డంలో సందేహాం లేదు.. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

జ‌గ‌న్ కి కాపులు పూల దండ‌లు