లింగమార్పిడి చేసుకుని పెళ్లి చేసుకున్నారు..తర్వాత ఏమైందో తెలిస్తే షాక్..

324

దేశంలో సెక్స్ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు ముందుకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. లింగమార్పిడి అనగా జన్మతహ వచ్చిన లింగమును శస్త్ర చికిత్స ద్వారా మార్పు చేసుకోవడము. అనగా జన్మతహ స్త్రీ, పురుషునిగానూ అలాగే పురుషుడు స్త్రీ గానూ మారిపోవడము.కొన్ని జంతువులలో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మానవులకు మాత్రం ప్రకృతి ఈ సౌలభ్యాన్ని ప్రసాదించలేదు.దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గము.అయితే అలా మారిన వారు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల కేరళకు చెందిన ఓ యువతి తాను ప్రేమించిన అమ్మాయి కోసం లింగమార్పిడి చేయించకుని పురుషుడిగా మారిన ఘటన మరచిపోక ముందే, హరియాణాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది.

Image result for indian marriages

హరియాణాకు చెందిన 21 ఏళ్ల యువతి తన పాఠశాల స్నేహితురాలు 19 ఏళ్ల యువతిని ఇష్టపడింది. ఇద్దరూ ప్రేమించుకుని ఒక్కటిగా జీవించాలని భావించారు. దీంతో గతేడాది లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొని పురుషుడిగా మారింది. అనంతరం అక్టోబరులో ఢిల్లీలోని ఓ గుడిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ, కొద్ది రోజుల తర్వాత భార్య తరఫువారు ఆమెను తీసుకెళ్లిపోయారు. దీంతో సదరు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను ఆమె తల్లిదండ్రులు బంధించారని, తమను కలుసుకోనివ్వడం లేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాము పాఠశాల స్థాయి నుంచే ప్రేమలో ఉన్నామని, తమ పెళ్లికి ఇరు కుటుంబాలూ నిరాకరించాయని తెలియజేశాడు. ఇద్దరు అమ్మాయిలు ఎలా కలిసి ఉంటారని అడ్డుచెప్పినట్టు పేర్కొన్నాడు. ఈ అంశంపై లింగిమార్పిడి చేయించుకున్న అమ్మాయి కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇద్దరిలో ఒకరు లింగమార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు.

అందుకే వయసులో పెద్దదైన యువతి ఏడాది కిందట రూ.10 లక్షలు ఖర్చుచేసి ఢిల్లీలో శస్త్ర చికిత్స ద్వారా పురుషుడిగా మారిందని, ఈ మొత్తాన్ని తామే వివిధ మార్గాల ద్వారా సమకూర్చామని ఒకరు వివరించారు. ఫిర్యాదు మేరకు ఇరు కుటుంబాలను పిలిపించిన పోలీసులు, వారికి కౌన్సెలింగ్ ఇప్పించారు. కానీ ప్రియుడితో మాత్రం కలిసి ఉండేందుకు ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేయడంలేదని చార్ఖీ దాద్రీ ఎస్పీ సమిత్ చౌధురి తెలిపారు. లింగమార్పిడి చేయించుకుని భర్తగా మారిన భాగస్వామితో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని స్వయంగా ఆమె స్పష్టం చేసిందని అన్నారు. ఇద్దరూ మేజర్లేనని, తమ వివాహానికి సంబంధించిన ఫోటోలను భర్త చూపించగా, అతడి కలిసుండటానికి భార్య అంగీకరించలేదని ఎస్పీ వెల్లడించారు. మరోవైపు వీరిని కలిపేందుకు న్యాయ పోరాటం చేస్తామని భర్త కుటుంబ సభ్యులు తెలిపారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. లింగమార్పిడి చేసుకుని మరి పెళ్లి చేసుకున్న వీళ్ళ గురించి వీళ్ళను విడదీస్తున్న పెద్దల గురించి అలాగే ఈ లింగమార్పిడి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.