ఈ బాలిక‌కు 3వ క‌న్ను.. ఈమెకు ఉన్న శక్తులు చూస్తే షాకవ్వాల్సిందే

600

శివుడికి మూడో కన్ను ఉంటుంది అని మన అందరికి తెలిసిందే.ఆయన మూడో కన్నుతోనే విశ్వం మొత్తాన్ని చూసి అందరిని సంరక్షిస్తుంటాడని భక్తుల నమ్మకం.అయితే కేవలం శివుడికే మూడో కన్ను ఉంటుందా.మనుషులకు మూడో కన్ను ఉండదా అంటే ఉండదు అనేగా మీ సమాధానం.కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మాయికి మూడో కన్ను ఉంది.ఆ అమ్మాయి దైవాంశ సంభుతురాలు ఏమి కాదు కానీ ఆమెకు మూడో కన్ను ఉంది.తన కాళ్ళను మూసేసిన కూడా తన చుట్టూ ఏం జరుగుతుందో మూడో కన్నుతో చెప్పేస్తుంది.నమ్మడం లేదా అయితే ఇప్పుడు నేను ఆ అమ్మాయి గురించి మీకు చెప్తాను వినండి.

Image result for yogamaatha

ఈ ఫోటోలో కనిపించే అమ్మాయి పేరు యోగమాత.ఆమెకు అందరు మూడో కన్ను ఉంది అని అంటున్నారు.ఆమెను చుసిన ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు.అయితే అలా అందరు చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా.యోగమాత క‌ళ్ల‌కు గంత‌లు కట్టిన తన చుట్టూ ఏమి జరుగుతుందో చాలా ఈజీగా చెప్తుంది.నమ్మడం లేదా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనల గురించి విన్నాకా మీకే అర్థం అవుతుంది వినండి.యోగామతను చుట్టూ ఉన్న జ‌నంలో ఓ వ్య‌క్తి వ‌ద్ద‌కు ఆమెను తీసుకెళ్లారు.

Image result for yogamaatha

అనంత‌రం ఆ బాలిక‌ను ప్ర‌శ్న‌లు అడిగారు. త‌న ఎదురుగా ఉన్న వ్యక్తి వేసుకున్న దుస్తులు ఏమిటి ? వాటి రంగు ఏది ? అత‌ని మెడ‌లో ఏముంది ? అత‌ని శ‌రీరంలో ఉన్న వ్యాధులు ఏమిటి ? అని అడిగారు. అందుకు ఆ బాలిక ఠ‌కీ ఠ‌కీమ‌ని స‌మాధానాలు చెప్పేసింది. దీంతో చుట్టూ ఉన్న‌వారు అది చూసి షాక్ అయ్యారు.అనంత‌రం డోన‌ట్స్ ఆకారంలో ఉండే ప‌లు రింగుల‌ను ఆమెకు ఇచ్చారు. వాటిని ఒక దానిపై ఒక‌టి పేరుస్తూ వాటి రంగు చెప్ప‌మ‌న్నారు. అంతే ఆ బాలిక ఒక్కో రింగును పేర్చుతూ వాటి రంగును చెప్పేసింది. ఆ త‌రువాత ఆ బాలిక క‌ళ్ల‌కు గంత‌లు ఉండ‌గానే ఓ వ్య‌క్తి పేప‌ర్‌పై ఆంగ్లంలో ల‌వ్ (LOVE) అనే అక్ష‌రాల‌ను రాశాడు. అది ఏ ప‌ద‌మో చెప్పాల‌ని ఆ బాలిక‌ను అడ‌గ్గా ఆమె ల‌వ్ అని ట‌క్కున చెప్పేసింది.దీంతో మ‌ళ్లీ షాక్‌.

ఇంత‌కీ ఎలా సాధ్య‌మ‌వుతుంది అనేగా మీ డౌట్‌. ఏమీ లేదండీ ఆ ఫోటోలో ఉన్న బాలిక‌ బెంగుళూరులో ఉన్న ప‌ర‌మ‌హంస నిత్యానంద గురుకుల పాఠ‌శాల విద్యార్థిని. ఆమె పేరు ‘మా యోగ‌మాత‌’.ఆమెకు అక్క‌డ ‘సూప‌ర్ నాచుర‌ల్ ప‌వ‌ర్స్’ అనే అంశంలో శిక్ష‌ణిస్తార‌ట‌.ఆ శిక్షణ వలన ఆమె క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకున్నా ఎదుటి వ్య‌క్తిని స్కాన్ చేస్తుంద‌ట‌.దీంతో అత‌ని గురించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ట‌. స‌ద‌రు వ్య‌క్తి ఏ దుస్తులు వేసుకున్నాడు, వాటి రంగు ఏమిటి, అత‌ను వేసుకున్న ఆభ‌ర‌ణాలు ఏమిటి, అత‌ని శ‌ర‌రీంలో ఉన్న వ్యాధులు.. తదిత‌ర వివ‌రాల‌ను ఆమె చెబుతుంది. అందుకు ఆమెకు త‌న‌ శ‌రీరంలో ఉన్న 3వ క‌న్ను స‌హాయం చేస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆ బాలిక‌ వీడియో ఇప్పుడు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తూ వైర‌ల్‌గా మారింది. అయితే కేవ‌లం మా యోగ‌మాత మాత్ర‌మే కాదు, ఆ వీడియోలో చూపించే ఇత‌ర బాలిక‌లు, బాలురికి కూడా ఈమెలాగే శ‌క్తులు ఉన్నాయట‌. ఏది ఏమైనా వీరు ఇలా చేస్తున్నారంటే ఇంకా మ‌న‌కు న‌మ్మశ‌క్యంగా లేదు క‌దా.మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే ఈ విద్యార్థులకు ఇలాంటి శక్తి ఎలా వచ్చింది.అలా చెప్పడం ఎలా సాద్యమైంది.మనిషికి మూడో కన్ను అనేది ఉంటుందా.మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.