450 రోజులు వరుసగా చికెన్ మాత్రమే తిన్నాడు.. తర్వాత ఏమయ్యాడో తెలిస్తే షాక్

272

ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ అంటే ఇష్టం. కొందరు వెజ్ మాత్రమే తింటారు. మరికొందరు నాన్ వెజ్ అంటే ఇష్టం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఇష్టం. అయితే ఫెవరెట్ ఫుడ్ అనేది ఉన్నా కూడా రోజు అయితే దానినే తినలేము కదా. ఒకరోజు తింటాం లేదా ఒక మూడు రోజులు లేదా ఒక వారం రోజులు తింటాం కానీ నెలల తరబడి అయితే దానినే తింటూ ఉండం కదా. కానీ ఒక వ్యక్తి తనకు ఇష్టమైన చికెన్ ను ఏకంగా 450 రోజుల నుంచి తింటున్నాడు. మరి అతనెవరు ఇప్పుడతను ఎలా ఉన్నాడో తెలుసుకుందామా.

Image result for men chicken eating

సింగపూర్‌కు చెందిన ఓ యువకుడికి చికెన్ అంటే ఇష్టం. అయితే ఎంత ఇష్టం ఉన్నా కూడా రోజు అయితే తినలేము కదా కానీ ఈ యువకుడు తనకు ఇష్టమైన చికెన్ రైస్‌ను 450 రోజులుగా తింటూనే ఉన్నాడు. సాధారణంగా ఇష్టమైన ఆహారాన్ని రోజూ తిన్నా ముఖం మొత్తేస్తుంది. కానీ, అతడు మాత్రం అదో యజ్ఞంలా చికెన్ వంటకాలను తింటూనే ఉన్నాడు. ఇతను ఇప్పటివరకు చికెన్ లో ఉండే రకాలన్నీ తినేశాడు. ప్రపంచం మొత్తం మీద చికెన్ తో ఎన్ని రకాల వంటలు చెయ్యవచ్చో అన్ని రకాలను తినేశాడు.ఇన్‌స్టాగ్రామ్‌లో ‘జి ఫాన్ ఫాన్’ అనే వ్యక్తి రోజుకో చికెన్ వంటకాన్ని తింటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సెప్టెంబరు 2017 నుంచి అతను ఓ ఉద్యమంలా చికెన్‌ను ఆరగిస్తున్నాడు. ఈ సందర్భంగా తాను తింటున్న చికెన్ వంటకాన్ని ‘Everyday’ హ్యాష్ ట్యాగ్‌తో రోజుల సంఖ్యను పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు 450 రోజులు అతడు చికెన్ తింటూనే ఉన్నాడు. ప్రతిరోజు ఫోటో పెడుతూనే ఉన్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే, చికెన్ అంటే ఇష్టమా, లేదా అలా తినడానికి ఏదైనా కారణం బలమైన కారణం ఉందా? అనేది అతడు చెప్పలేదు. వీలైనన్ని ఎక్కువ రోజులు చికెన్ తినడానికే ట్రై చేస్తా అని చెప్తున్నాడు. అయితే, ఏదైనా అతిగా తింటే కడుపు చేటు. సుమారు ఏడాదికి పైగా చికెన్ మాత్రమే ఆహారంగా తీసుకుంటున్న అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియరాలేదు. అతని ఆరోగ్యం ఎలా ఉందొ చెప్పలేదు కానీ అతడి ఆహారపు అలవాటు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత జోష్ లో పోస్ట్ లు పెడుతున్నాడంటే ఆరోగ్యం బాగున్నట్టే కదా. ఇతను బాగున్నాడు కదా అని మీరు ట్రై చేసేరు .ఇలా ఒకే రకం పదార్థాన్ని తినడం అందులోను చికెన్ తినడం అంత మంచిది కాదు. మరి చికెన్ మాత్రమే తింటున్న ఈ యువకుడి ఘటన గురించి అలాగే ఇలా ఒకే రకం ఫుడ్ ను ఎక్కువ రోజులు తినే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.