ప్రాణాలకు తెగించి వారి ప్రాణాలను కాపాడిన సైన్యానికి థాంక్స్ చెప్పకుండా ఈ మహిళ ఏం చెప్పిందో తెలిస్తే ఎవరైనా గర్వపడాల్సిందే..

364

కేరళ పరిస్థితి ఇప్పుడిప్పుడే ఒక కోలుక్కి వస్తుంది.కొన్ని లక్షల మంది ఆసరా లేక దీన స్థితిలో ఉన్నారు.ఎవరు సహాయం చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.అందుకే దేశ నలుమూలల నుంచి వారికి సహాయం చెయ్యడానికి సిద్దపడుతున్నారు.చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వారికి తోచినంత సహాయం అందిస్తున్నారు.అయితే అక్కడి ప్రజలకు సహాయం చెయ్యడానికి అందరు ముందుకు వస్తున్నారు. తమవంతు ఎంత సహాయం అయితే అంత చేస్తున్నారు.అయితే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది.కానీ రెండు రోజుల క్రితం కేరళ పరిస్థితి ఎలా ఉండేది.ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కదా.వారిని కాపాడటానికి నేవీ సిబ్బంది ఎంత కష్టపడ్డారో మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా.అయితే ఒక మహిళను కాపాడిన నేవీ అధికారులకు ఆ మహిళా థాంక్స్ కూడా చెప్పలేదు.

Image result for kerala flood

కానీ ఆ మహిళా చెప్పిన మాట విని ఆర్మీ అధికారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.అంత మంచి మాట ఏం చెప్పిందా అని అనుకుంటున్నారా..చెబుతా వినండి.కేరళలో వరదలు అని తెలిసిన వెంటనే వారిని కాపాడటానికి ఆర్మీ అధికారులు హుటాహుటిన కేరళ బయల్దేరారు.అక్కడికి వెళ్లి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వారిని రక్షించారు.పగలు రాత్రి అన్న తేడా లేకుండా,పుట్ట గుట్ట అని కూడా ఆలోచించకుండా బాదితులు ఏ మూలాన ఉన్నా సరే వారిని కాపాడారు.ఒకరోజు రాత్రి వరదల్లో చిక్కుకున్న ఒక కుటుంబం ఈ ఆర్మీ అధికారులకు కనిపించింది.ఆ కుటుంబంలో అప్పుడే పుట్టిన శిశువుతో పాటు మొత్తం ఐదు మంది ఉన్నారు.

Image result for kerala flood

వాళ్ళు నాలుగు రోజుల నుంచి తిండిలేక తాగడానికి నీళ్ళు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.వారి పరిస్థితి చూసి ఇంత దయనీయ పరిస్థితి ఎవరికీ రాకుడదని కంట నీరు పెట్టుకున్నారంటే వాళ్ళు ఎంత దీన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి.ఇక వారిని చూసి ఆ సైన్యం కాపాడింది.అయితే తల్లిబిడ్డ రక్షణ గురించి ఆలోచించి ఆ సైన్యం వారిని సూర్యోదయం తర్వాతే బయటకు తీసుకురావాలని అనుకున్నారు.ఇక తెల్లారిన తర్వాత వారికి ఒక పడవలో సహాయక స్థావరానికి తీసుకెళ్ళారు.తినడానికి తిండి ఇచ్చి వాటర్ ఇచ్చి ఆ తల్లిబిడ్డను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు.అయితే ఇంత సహాయం చేసిన కూడా ఆ కుటుంబం కానీ ఆ తల్లి కానీ వారికి ఒక్క థాంక్స్ కూడా చెప్పలేదు.కానీ ఒకేఒక్క మాట చెప్పింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ మాటకు ఆ సైనికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఆ మాటకు వాళ్ళు పడుతున్న కష్టం మొత్తాన్ని మర్చిపోయారు.ఇంతకు ఆ మాట ఏమిటో తెలుసా..నా బిడ్డ పెద్దయ్యాకా నా బిడ్డను సైనికుడిని చేస్తా అని అన్నది.అంతేకాకుండా ఆ సైనికులందరికి ఫ్యామిలీ మొత్తం సలాం చేసింది.ఈ ఒక్క మాటతో ఆ సైనికులందరికి పూనకం వచ్చినట్టు అయ్యింది.ఈ ఒక్క మాట చాలు ఈ జీవితానికి అనుకున్నారు.ఇక ఆలస్యం చెయ్యకుండా వారిని వదిలేసి మరొక ప్రాంతానికి సహాయం చెయ్యడానికి వెళ్ళారు.వింటుంటే మనకు కూడా సైన్యం మీద గౌరవం పెరుగుతుంది కదా..మరి ఈ విషయం గురించి మీరేమంటారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన సైన్యం గురించి అలాగే వారికి థాంక్స్ చెప్పకుండా తలెత్తుకునే మాట చెప్పిన ఆ మహిళా గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.