షాజహాన్ జీవిత చరిత్ర…. కన్న కూతుర్ని కూడా అనుభవించాడంట

2313

షాజహాన్ అంటే అందరికీ గొర్తొచ్చేది గొప్ప ప్రేమికుడు.ప్రేమ కోసం తాజ్ మహల్ ను కట్టిన అమర ప్రేమికుడు.భారతీయ, ఇస్లాం, పర్షియన్ వాస్తు సమ్మిశ్రితంగా నిర్మించిన తాజ్ మహల్, 400 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శోభాయమానంగానే ఉంది. తాజ్ మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేలమంది వాస్తు కళాకారులు, శిల్పులు, ఇతర పనివాళ్ళు పాల్గొన్నారు. 1983లో యునెస్కో “ప్రపంచ పూర్వా సంస్కృతి ప్రదేశం”గా తాజ్ మహల్ ను గుర్తించింది.తాజ్ మహాల్ ద్వారా ప్రపంచంలోని ప్రజలందరిలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న షాజహాన్ కు సంబంధించి చాలా విషయాలు ప్రపంచానికి తెలియవు. అసలు ముంతాజ్ పై ప్రేమతో తాజ్ మహాల్ కట్టించలేదని అలాగే ఆయన చాలా మంది అమ్మాయిలతో రాసలీలలు జరపారని కొందరు అంటుంటారు.అలాగే సొంత కూతురుని కూడా వదలలేదని అంటారు.మరి అందులో నిజమెంత. షాజహాన్ కు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.వినండి..

Image result for shajahan
షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్ అని అందరూ అంటుంటారు. కానీ ఆమె అసలు పేరు అంజుమంద్ బాను. తాజ్ మహల్ ను షాజహాన్ కట్టించినట్టు గాని, ముంతాజ్ ను అక్కడ ఖననం చేసినట్టుగానీ, అనంతర కాలంలో షాజహాన్ ను అక్కడ పూడ్చినందుకు దాఖలాగా గానీ తాజ్ మహల్ వద్ద ఒక శాసనమూ లేదు. ఒక శిలాఫలకమూ లేదు. తాజ్ మహాల్ అనేది షాజహాన్ స్వాధీనం చేసుకున్న పురాతన రాజభవనం అట. దానికి నగిశీలు చెక్కి అలా అందంగా మార్చాడంట.షాజహాన్ ను ఖుర్రం అని కూడా అంటారు. రాజకీయ తంత్రంలో భాగంగా తన మేనకోడలు ముంతాజ్ ను నూర్జహాన్ షాజహాన్ కు ఇచ్చి పెళ్లి చేయించింది. నూర్జహాన్ షాజహాన్ కు సవతి తల్లి. నూర్జహాన్ ను రాణిగా నియమించాడు జహంగీర్. షాజహాన్ పెళ్లి చేసుకోకముందే ముంతాజ్ కు పెళ్లి అయ్యింది. అతన్ని షాజహాన్ చంపడంతో ముంతాజ్ ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఒక కథనం కూడా ఉంది. అలాగే ముంతాజ్ చనిపోయాక కూడా ఆమె సోదరిని వివాహం చేసుకున్నాడట షాజహాన్..

Image result for shajahan

అయితే ముంతాజ్ రాచకన్య కాదు కనుక నిశ్చితార్థం చేసుకున్న ఐదేళ్లకు గానీ షాజహాన్ ఆమెను పెళ్ళాడలేదు. ఈలోపు ఓ పారసీక రాకుమారిని వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేశాడు. ముంతాజ్ షాజహాన్ తో కాపురం చేసి వరుసగా పద్నాలుగు సార్లు ప్రసవించింది. పద్నాలుగో సారి బిడ్డను కనే ప్రయత్నంలో పురుటిలోనే ముంతాజ్ బుహాన్ పూర్ లో మరణించింది. తర్వాత ఆమెను అక్కడే ఖననం చేశారు. బులారా మహల్‌లో ముంతాజ్ బేగం కన్నుమూసినప్పుడు ఆమె జ్ఞాపకార్థం షాజహాన్ ఒక అందమైన స్మారకమందిరాన్ని నిర్మించాలని భావించాడ అట. అలా ఆయన మనసులో తాజ్‌మహల్ రూపుదిద్దుకుందని అంటారు. మొదట్లో ఈ మందిరాన్ని బర్హాంపూర్‌లోనే నిర్మించాలని అనుకున్నప్పటికీ ఇతర కారణాల వల్ల దాన్ని ఆగ్రాలో నిర్మించారు అట.తాజ్‌మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాతే ముంతాజ్ దేహాన్ని బులారా మహల్‌ కు తరలించారు. అయితే ముంతాజ్ మృతదేహాన్ని మాత్రమే అక్కడినుంచి తీసుకుపోయారు తప్ప ఆమె ఆత్మ మాత్రం ఇప్పటికీ బులారా మహల్‌లోనే ఉండిపోయిందని స్థానికులు చెబుతారు.బులారా మహల్ నుంచి ఇప్పటికీ పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు, ఏడుపులు వినిపిస్తుంటాయట.

Image result for shajahan

తాజ్ మహల్ సముదాయంలో తర్వాత ముంతాజ్ ను ఖననం చేసి గొప్ప సమాధి సౌధంగా మార్చారు. అయితే అందులో ఖననం చేసింది కేవలం ముంతాజ్ ను మాత్రమే కాదు షాజహాన్ ఇంకో భార్య సిర్హింద్ బేగంను కూడా అక్కడే ఖననం చేశారు.ముంతాజ్ బేగం రాణికి ఇష్టమైన పరిచారిక సతీఉన్నీసా చనిపోవడంతో ఆమెను కూడా తాజ్ మహాల్ లోనే ఖననం చేశారు. షాజహాన్ తాజ్ మహల్ ను తనకు సంబంధించిన చాలా మందిని ఖననం చేసేందుకు ఉపయోగించాలనుకున్నాడు. కేవలం ముంతాజ్ దివ్యస్మృతికే తాజ్ మహాల్ ను నిర్మించాలని ఆయన అనుకోలేదంట. రాణికి, పరిచారికకు ఒకే విధమైన సమాధులు కట్టించాడు షాజహాన్. దీన్ని బట్టీ ముంతాజ్ పై ఆయనకు ఎంతమేర ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది.

Related image

షాజహాన్ చాలా క్రూరుడు. గుడ్డివాడయిన అన్నను తన రక్షణలో ఉంచమని తండ్రికి చెప్పి, రాత్రివేళ రహస్యంగా ఖూనీ చేయించాడు. జహంగీర్ మరణాంతరం లైన్ క్లియరయింది నీవు రావొచ్చునని మామ ఆసఫ్ఖాన్ కబురంపాక డక్కన్ నుంచి తాను తిరిగి వచ్చి గద్దెనెక్కేలోపే తన సోదరులను, దాయాదులను అందరినీ సఫా చేసెయ్యమని చెప్పిన వైనమే షాజహాన్ క్రూర స్వభావాన్ని వెల్లడిస్తుంది. షాజహాన్ అంటే అతని ఎనలేని ప్రేమనే మనకు గుర్తొస్తుంది. అయితే ఆయనకు భార్య ముంతాజ్ తో పాటు చాలామంది అమ్మాయిలతో సంబంధాలుండేవి. షాజహాన్ కు మొత్తం ఏడుగురు భార్యలు. ముంతాజ్ నాలుగో భార్య. అలాగే వందలాది మంది స్త్రీలతో షాజహాన్ కు సంబంధాలుండేవి. ఆఖరికి సొంత కూతురిని కూడా షాజహాన్ అనుభవించాడు అట.మొఘల్ చక్రవర్తి షాజహాన్ ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ ఎదురుగా మెహ్‌తాబ్ బాగ్ ఉద్యానవనంలో ఆయనకు ఇష్టమైన వేసవి బంగ్లా కూడా ఉండేదట. భారత పురావస్తు సంస్థ(ఏఎస్‌ఐ) జరిపిన తవ్వకాల్లో శతాబ్దాల నాటి బారాదరి లాంటి మండపం గోడలు, శిథిలాలు ఇటీవల వెలుగుచూశాయి. మెహ్‌తాబ్ బాగ్‌లోని ఆ మండపంలో రాత్రిపూట సేదతీరుతూ షాజహాన్ తాజ్‌మహల్‌ను చూస్తూ గడుపుతుండేవాడట.

తాజాగా తాజ్‌మహల్‌కు సూటిగా మెహ్‌తాబ్ బాగ్‌లో దక్షిణం వైపు జరుపుతున్న తవ్వకాల్లో వేసవి బంగ్లా అవశేషాలు బయటపడ్డాయి. కాగా, ఇప్పుడున్న పాలరాతి తాజ్‌మహల్ ఎదురుగా ఓ నల్లరాతి తాజ్‌మహల్‌ను కూడా నిర్మించాలని, ఆ రెండింటినీ ఓ వారధితో అనుసంధానం చేయాలనీ అప్పట్లో షాజహాన్ భావించారన్న ప్రచారమూ ఉంది.షాజహాన్ కు ఆభరణాలపై విపరీతమైన పిచ్చి ఉండేది. ఆయన సొంత నగల ఖరీదు అప్పట్లోనే ఐదు కోట్ల రూపాయలు ఉండేది. రాజకుమారులకు ఇచ్చిన ఆభరణాల ఖరీదు మరో రెండు కోట్ల రూపాయలు. ఐదుకోట్ల రూపాయల విలువైన సొంత నగల్లో నిత్యం ధరించే నగల విలువ రెండుకోట్ల రూపాయలుగా ఉండేది.నగలు నిత్యం అంత:పురంలో పరిచారికల వశంలో చక్రవర్తి ఎప్పుడంటే అప్పుడు ధరించేందుకు తయారుగా ఉండేవి. మిగిలిన మూడుకోట్ల రూపాలయల ఖరీదైన నగలు కూడా కావాల్సినప్పుడు ధరించడానికి గాను ఇతర గదుల్లో ఉండేవి.వ్యాధిగ్రస్తుడైన తండ్రి షాజహాన్‌ను కుమారుడు ఔరంగజేబు ఖైదు చేశాడు. ముగ్గురు సోదరులనూ- అగ్ర వారసుడు దారా షుకో, షా షుజా, మురాద్‌- హత్య చేశాడు. కుమారుడి పెట్టిన నరకయాతన షాజహాన్ తట్టుకోలేకపోయాడు. షాజహాన్ తీవ్రమైన జబ్బుతో బాధపడుతు చనిపోయాడు. అయితే ఔరంగజేబు షాజహాన్ ను చనిపోయేంత వరకు ఆగ్రాకోటలోనే బందీగా ఉంచాడు.