తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం.. బయటికి వెళ్లొద్దు హెచ్చరిస్తున్న సైంటిస్టులు

214

వరుణ దేవుడి కరుణ కోసం రైతన్న ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందనే వాతావారణ శాఖ అంచనాలతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అయితే మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందనే చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ పేర్కొంది. ఒకట్రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది నైరుతి దిశగా కదులుతున్నట్లు వెల్లించింది. ఇది క్రమంగా బలపడి మంగళవారానికి వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణకు, వర్షాలు పెరిగేందుకు తెలుగు రాష్ట్రాల్లో అనుకూల వాతావరణం ఏర్పడిందని, దీని కారణంగా కోస్తా జిల్లాలు, తెలంగాణ ప్రాంతాల్లో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు .

ఈ క్రింది వీడియో చూడండి

అల్పపీడనం ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఛత్తీస్‌గఢ్‌, విదర్భ ప్రాంతాల్లో, జూలై 2న తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కోస్తాలో ఆదివారం నుంచి మంగళవారం వరకు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో ఓ మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని వెల్లడించింది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలుుల వీచే అవకాశం ఉందని .. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దిన వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని విపత్తుల శాఖ హెచ్చరిక జారీచేసింది.

Image result for heavy rains mumbai

మరోవైపు తీరప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాతావరణశాఖ అప్రమత్తతతో ఆయా విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో పడమర దిశగా మధ్యభారతం మీదుగా పయనిస్తున్నదని, దీంతో జూలై 4లోగా రుతుపవనాలు వాయవ్య, ఉత్తర భారతంలో అనేక ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యభారతం దానికి ఆనుకుని మధ్య మహారాష్ట్ర, మరట్వాడా, కొంకణ్‌ వరకు భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాబట్టి తీరం వెంబడి ఉండేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. మరి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఈ అల్పపీడనం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.