పెళ్లి రోజే దారుణం.. నవవధువుపై భర్తతో సహా ఏడుగురు అత్యాచారం.. ఎక్కడో తెలిస్తే షాక్

178

సమాజం ఎంత డెవలప్ అవుతున్నా కూడా ఇంకా మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు కొంతమంది.వాళ్ళను బలిస్తే అది కలుగుతుంది వీళ్ళను బలిస్తే ఇది కలుగుతుందని తాంత్రికులు చెప్పే మూఢనమ్మకాలను నమ్మి అవతలి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు.ఇలాంటి ఘటనల గురించి మనం ఎన్నో విన్నాం.ఇప్పుడు మరొకటి జరిగింది.పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా జీవిద్దాం అనుకుని అత్తారింట్లో అడుగుపెట్టిన ఒక యువతీ జీవితాన్ని నాశనము చేశారు.నాశనం చేసింది ఎవరో కాదు ఆమె భర్తనే.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for girls depression

హర్యానాలోని కురుక్షేత్రలోని బాబెయిన్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల అమ్మాయికి సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి వివాహం జరిగింది. సెప్టెంబర్ 13న నవ దంపతులకు శోభనం ఏర్పాటుచేశారు. అయితే అప్పటికే ఆ అమ్మాయి భర్త తాంత్రిక పూజలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.సెప్టెంబర్ 14న తాంత్రిక పూజలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుని, నలుగురు తాంత్రికులను పిలిపించాడు. ఈ పూజలో తన తల్లిదండ్రులు, సోదరి, బావ, సోదరుడు కూడా పాల్గొనాలని సూచించాడు. ఈ పూజలో భాగంగానే సెప్టెంబర్ 13న శోభనం రోజు తన భార్యకు పాలలో మత్తుమందు కలిపి తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరవాత గదిలోకి తీసుకెళ్లి ఒకరి తరవాత ఒకరు భర్త, అతని సోదరుడు, బావ, నలుగురు తాంత్రికులు అత్యాచారం చేశారు. ఆ తరవాత రోజు తాంత్రిక పూజల అనంతరం నవవధువును బలి ఇవ్వాలన్నది వారి ప్లాన్. అయితే ఈ నరకం నుంచి బయటపడిన నవవధువు విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీంతో ఆయన కురుక్షేత్ర పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కురుక్షేత్ర పోలీసులు ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ శీలావతి స్పష్టం చేశారు. అమ్మాయి వద్ద నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామని చెప్పారు. రిపోర్టు వచ్చిన తరవాత యాక్షన్ తీసుకుంటామని అన్నారు. అయితే ఈ కేసులో అమ్మాయి భర్త, అతని సోదరుడు, సోదరి, బావ, తల్లి, తండ్రి, నలుగురు తాంత్రికులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంత వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.మారేందుకు అరెస్ట్ చెయ్యడం లేదో ఆ పోలీసులకే తెలియాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సైన్స్ ఇంత డెవలప్ అవుతున్నా ఇంకా క్షుద్రపూజలు అంటూ నమ్మేవాళ్ళ గురించి అలాగే భార్య అని కూడా చూడకుండా దారుణానికి ఒడిగట్టిన ఈ భర్త ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.