తహశీల్దార్‌ విజయారెడ్డి ఇంటిదగ్గర సురేష్ మర్డర్ ప్లాన్ – వెలుగులోకి కీలక విషయాలు

351

తహశీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. హత్యకు రెండు రోజుల ముందు నిందితుడు సురేశ్‌ ఒక మధ్యవర్తితో విజయారెడ్డి ఇంటికి వెళ్లి ఆమె భర్త సుభాష్‌ రెడ్డిని కలిసినట్టు సమాచారం. వారు ఎందుకు కలిశారు? ఏం మాట్లాడుకున్నారనే అంశంపై పోలీసులు సుభా‌ష్ రెడ్డిని కూడా ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

Image result for tahsildar vijaya reddy

సురేశ్‌ భార్య ఇచ్చిన సమాచారం కూడా పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తోంది. విజయారెడ్డి ఇంటికి వెళ్లేముందు సురేశ్‌ తన సన్నిహితులకు ఫోన్‌ చేసి.. ఆమెతో తాడోపేడో తేల్చుకుంటానని అన్నట్లు తెలిసింది. దీన్ని బట్టి నిందితుడు ఆమెను కలిసి, ఆమె తన మాట వినకుంటే ఇంటి వద్దనే హత్య చేసేందుకు ప్లాన్‌ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక.. కార్యాలయంలో విజయారెడ్డిని సజీవదహనం చేసిన తర్వాత తీవ్ర గాయాలతో రోడ్డుపైకి పరుగులు తీసిన సురేశ్‌.. అక్కడ రోడ్డుపక్కన నిలిచి ఉన్న కారులోని వ్యక్తులతో మాట్లాడినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. ఆ కారులో ఉన్నది ఎవరు, వారితో సురేశ్‌ ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అనే విషయంపై సిట్‌ దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు సురేశ్‌ తండ్రిని, అతని పెదనాన్న, సోదరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, సురేశ్‌ కాల్‌ డేటా ఆధారంగా.. బుధవారం గౌరెల్లికి చెందిన నర్సింహ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Image result for tahsildar vijaya reddy

అతడు సురేశ్‌కు సన్నిహితుడని, డీసీఎం డ్రైవర్‌ అని తెలుస్తోంది. అలాగే, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్‌ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. దర్యాప్తులో భాగంగా తహసీల్‌లోనూ పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. సురేశ్‌ భూవివాదానికి సంబంధించిన వివరాలను, అతడి ఫిర్యాదు వంటి వాటిని సేకరిస్తున్నారు. దర్యాప్తు వేగంగా సాగుతోందని.. 1-2 రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. సురేశ్‌ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశముంది.

ఈ క్రింద వీడియో చూడండి

గౌరెల్లి గ్రామానికి చెందిన కొర్ర సురేశ్‌ కుటుంబీకులకు బాచారం గ్రామ శివారులో తొమ్మిదెకరాల వ్యవసాయ భూమి ఉంది. సురేశ్‌ తండ్రి కృష్ణకు, పెదనాన్న దుర్గయ్యకు నాలుగున్నర ఎకరాల చొప్పున వాటా ఉంది. ఔటర్‌రింగ్‌ రోడ్డులో సురేష్‌ కుటుంబానికి ఉన్న నాలుగున్నర ఏకరాల్లో రెండు ఎకరాల 20 గుంటల స్థలం పోయింది. విలువైన స్థలం ఔటర్‌లో పోవడం, నష్టపరిహారం అనుకున్నస్థాయిలో రాకపోవడం, ఉన్న భూమి కాస్తా రికార్డుల్లో లేకుండా పోవడంతో సురేశ్‌ కొంతకాలంగా కుంగుబాటుకు గురైనట్టు సమాచారం. అలాగే.. వివాదంలో ఉన్న భూమికి సంబంధించి రెండు నెలలుగా సురేశ్‌, అతడి కుటుంబసభ్యులకు నడుమ తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు, సురేశ్‌ తన వాటా భూమిలో 9 గుంటలు ఒకవ్యక్తికి విక్రయించినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆ భూమిని అతడు ఎంతకు అమ్మాడు? ఎవరికి అమ్మాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక.. విజయారెడ్డి హత్య జరిగిన రోజే కాకుండా అంతకు కొన్ని రోజుల ముందు నుంచీ ఈ భూమి విషయంలో జరిగిన పరిణామాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామసభల్లో విజయారెడ్డితోపాటు ఆర్డీవో, వీఆర్వో ఇతర అధికారులతో పలుమార్లు గొడవ పడ్డ వీడియో రికార్డింగ్‌లు పోలీసులకు లభ్యమయ్యాయి.

ఈ క్రింద వీడియో చూడండి