షాక్ లో సినిమా ఇండ‌స్ట్రీ సీనియర్‌ నటి కన్నుమూత.!

327

ఇటీవల సినీమా ఇండ‌స్ట్రీకి వ‌రుస మ‌ర‌ణాలు వేధిస్తున్నాయి.. సీనియ‌ర్లు ఈ లోకం విడిచి వెళ్ల‌డంతో బాధాతృప్త హృద‌యాలు క‌నిపిస్తున్నాయి.. ముఖ్యంగా సినిమా ఇండ‌స్ట్రీ నుంచి ఇప్ప‌టికే అనేక మంది సీనియ‌ర్లు ఈ లోకం విడిచివెళుతున్నారు.. అలాగే యంగ్ స్ట‌ర్స్ కూడా ఏదో ఓ ఆరోగ్య స‌మ‌స్య‌తో బాధ‌పడుతు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సీనియర్‌ నటి రీటా భాదురి ఇక లేరు అనే విష‌యం బాలీవుడ్ జీర్ణించుకోలేక‌పోతోంది… బాలీవుడ్‌లో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో నటించిన రీటా ఎంతో పేరు తెచ్చుకున్నారు.. ఆమె ప‌లు హిట్ సినిమాలు సీరియ‌ళ్ల‌లో న‌టించారు..

కాని సినిమాల‌కు సీరియ‌ళ్ల‌కు కొంత కాలంగా ఆమె విరామం ఇచ్చారు…. కొద్ది నెల‌లుగా ఆమె వయసు రిత్యా ప‌లు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు… ఈ ప‌రిస్దితుల్లో ఆమె తుదిశ్వాస విడిచారు…ఈ విషయాన్ని రాజీ ఫేమ్ నటుడు శిశిర్‌ శర్మ తన ఫేస్‌బుక్‌లో తెలియజేశారు… ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు. అమ్మ, అమ్మమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరు.. దీంతో చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆమెకు అనేక మంది అభిమానులు ఉన్నారు… కో ఆర్టిస్టుగా సీనియ‌ర్ గా ప‌లువురు ప్ర‌ముఖుల‌తో ఆమె న‌టించింది.

కబీ హాన్‌ కబీ నా, క్యా కహెనా, దిల్‌ విల్‌ ప్యార్‌ వ్యార్‌, మై మాధురిదీక్షిత్‌ బన్‌నా చాహితీ హూ.. తదితర చిత్రాలతో రీటా మంచి గుర్తింపు పొందారు. హిందీతోపాటు పలు గుజరాతీ చిత్రాల్లోనూ ఆమె నటించారు… సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవటంతో.. బుల్లితెర వైపు ఆమె తన దృష్టిసారించారు.

హస్రాతేన్‌, సారాభాయ్‌ వర్సెస్‌ సారాభాయ్‌, కిచిడీ, ఏక్‌ నయీ పెహ్‌చాన్‌, అమనత్‌, కుమ్‌కమ్‌ తదితర సీరియళ్లలో ఆమె నటించారు… నిమ్కీ ముఖియా సీరియల్‌లో ఇమ్రాతి దేవి పాత్ర.. రీటా బుల్లితెరపై వెలిగిపోయేలా చేసింది… ఆమె మృతికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు…. పలువురు ప్ర‌ముఖులు వ‌స్తున్న కార‌ణంగా సంద‌ర్శ‌న అనంతరం అంధేరీలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు ఆమె కుటుంబ స‌భ్యులు.. ఇలా ప‌లువురు ఇండ‌స్ట్రీ నుంచి విడిచి వెళ్ల‌డంతో బాలీవుడ్ లో కూడా కాస్త నిశ్శ‌బ్దం అల‌ముకుంది. ఆమె మృతికి మీ కామెంట్ల ద్వారా సంతాపం తెలియ‌చేయండి.