ఐఫోన్ కోసం గర్భాశయంలోని అండాలను అమ్ముకుంది.. చివరికి ఏమైందో తెలిస్తే షాక్

207

త‌మ‌కు న‌చ్చిన దాని కోసం ఎంత‌కైనా తెగించేందుకు వెనుకాడ‌ని వారు ఈ మ‌ధ్య‌న క‌నిపిస్తున్నారు. అవ‌స‌రం లేకున్నా.. వ్యామోహంతో చేస్తున్న ఈ తీరు ఎంత ప్ర‌మాద‌క‌ర‌మ‌న్న విష‌యాన్ని ఇప్ప‌టి తరానికి చెందిన కొంద‌రు అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేదు. ఆ త‌ర‌హా అమ్మాయి గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఐఫోన్ కొనడం కోసం కిడ్నీలను అమ్ముకున్న వారిని ఇదివరకే మనం చూశాం. ఆఖరికి వస్తువులను అమ్మడం దగ్గర నుండి దొంగతనాలు చేసైనా అనుకున్నది దక్కించుకోవాలన్న మనస్తత్వాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక అమ్మాయి ఐఫోన్ కోసం ఏకంగా అండాలనే అమ్మేసింది. ఆ ఘటన గురించి ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

Image result for iphone

చైనాలోని ఒక విశ్వవిద్యాలయ విద్యార్ధిని ఐఫోన్ కొనడం కోసం డబ్బును ఆదా చేయడానికి ఒక సులభమైన మార్గం ఎంచుకుంది. ఐఫోన్ కొనుగోలు చేయడానికి ఆమె తన అండాలను బ్లాక్ మార్కెట్లో అమ్మడానికి నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం ప్రాణాలనే ఇరకాటంలో పెట్టే పరిస్థితులకు దారితీసింది. ఈ 20 ఏళ్ల విద్యార్థినికి శస్త్రచికిత్సకు ముందు 10 కన్నా అధికంగా ఇంజెక్షన్లను ఇవ్వడం జరిగింది. ఈ ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలో భాగంగా అండాలను సేకరించేందుకు ఆమె అండాశయాన్ని ఉద్దీపనగావించడం కోసంగా ఇవ్వడం జరిగింది. ఆమెకు శస్త్ర చికిత్స చేసి అందాలను సేకరించిన మూడు రోజులలోనే ఆమె ఆరోగ్యం త్వరితగతిన క్షీణించడం మొదలుపెట్టింది. ఆమె తీవ్రమైన ఉబ్బరం మరియు శ్వాసకోశ సంబంధిత పరిస్థితులను ఎదుర్కొంటూ ఆసుపత్రికి వెళ్లింది. అండాలను అమ్మడం వలన కలిగే దుష్ప్రభావాల గురించి ఆమెకు తెలీదు. అండాలను అమ్మడం వల్ల శరీరానికి ఎటువంటి హాని జరగదని ఆ బ్లాక్ మార్కెట్ సభ్యుడు ఆమెకు స్పష్టంగా చెప్పారనీ, అందుకే నేను ఆ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించింది.

ఈ క్రింది వీడియో చూడండి 

అంతేకాకుండా శస్త్రచికిత్సకు ముందు 15 రోజుల పాటు, రోజుకొక ఇంజెక్షన్ చొప్పున తీసుకున్నట్లు తెలిపింది. క్రమంగా జరిపిన పరీక్షలలో భాగంగా ఆ మహిళకు ‘ ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేటింగ్ సిండ్రోమ్ తలెత్తినట్లు గుర్తించారు. అండం ఎదుగుదలకు అండాశయం ఎక్కువ స్థాయిలో ఉద్దీపన చెందినప్పుడు, అండాల చుట్టూ ద్రవం నిర్మితమవుతున్నప్పుడు ఈ పరిస్థితి కలుగుతుంది. ఆమె పొత్తికడుపులో సుమారు ఐదు లీటర్ల కన్నా ఎక్కువ ద్రవం పేరుకుని ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె అండాశయం 7-8 నెలల గర్భవతిగా ఉన్నట్లుగా విస్తరించింది. ముందుగానే కాస్త పరిస్థితిని గమనించి ఆసుపత్రికి వచ్చిన కారణాన ఆమె బ్రతికింది కానీ, ఆలస్యం చేసి ఉంటే ప్రాణాలే పోయి ఉండేవని వైద్యులు తెలిపారు. క్రమంగా ఆమెకు 3 రోజుల పాటు చికిత్స చేసి, ఆమె కోలుకొన్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలియజేశారు. డబ్బు సంపాదన కోసం సులువైన మార్గాలను అన్వేషిస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందో ఆమెకి అర్ధమయ్యే ఉంటుంది. ఆర్భాటాలు, ఉనికి కోసం పాకులాట వంటివి జీవితాన్ని చివరికి ఎటువంటి దుర్భర పరిస్తితుల్లోకి తీసుకెళ్తాయో తెలియజేయడానికి ఇటువంటి వ్యక్తులు ఉదాహరణలుగా మిగుల్తారు అనడంలో ఏమాత్రం తప్పులేదు.మరి ఐఫోన్ కోసం అండాలను అమ్మిన ఈ అమ్మాయి ఘటన గురించి అలాగే ఇలా డబ్బు కోసం శరీర భాగాలను అమ్ముకుంటున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.