ఒక్కో అమ్మాయిని 45 ల‌క్ష‌లకు అమ్మ‌కం త‌ర్వాత ఎంత దారుణం చేస్తారో తెలిస్తే షాక్

537

అమ్మాయిల విక్ర‌యాలు ప‌ల్లెల నుంచి మొద‌లై ప‌ట్ట‌ణాలు కాస్మోపాలిట‌న్ సిటీస్ వ‌ర‌కూ జ‌రుగుతూనే ఉన్నాయి.. ఇప్ప‌టికే ఇలా అమ్మ‌కాల పై స్పెష‌ట్ టాస్క్ ఫోర్స్ అలాగే పోలీసులు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా, వారి ఆగ‌డాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.. ఇలాంటి దారుణాలు ఎక్కువ‌గా ప‌ల్లెప్రాంతాల్లో జ‌రుగుతున్నాయి, ఆర్ధిక ప‌రిస్దితి బాగాలేని వారిని డ‌బ్బులు ఇచ్చి, ప‌ని ఇప్పిస్తామ‌ని కొన‌డం, అక్క‌డ నుంచి వారిని వ్య‌భిచార గృహాల‌కు అమ్మేస్తున్నారు. ఇక తాజాగా ముంబైలో దొరికి న ఓ రాకెట్, అమ్మాయిల‌ను అమెరికా దేశానికి అమ్ముతోంది..ఈ అమ్మాయిల అమ్మ‌కాల రాకెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబై నగరంలో మరో దారుణం జ‌రిగింది అనే అనాలి ఈ విష‌యంలో.. అమెరికా దేశానికి 300 మంది అమ్మాయిలను విక్రయించిన అంతర్జాతీయ పిల్లల అక్రమ రవాణ ముఠా బాగోతం బట్టబయలైంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజుభాయ్ గమ్లేవాలా నేతృత్వంలో ఓ ముఠా 2007 వ సంవత్సరం నుంచి 300 మంది నిరుపేద బాలికలను అమెరికాకు విక్రయించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 11 నుంచి 16 ఏళ్ల వయసుగల అమ్మాయిలను ఒక్కో అమ్మాయి ధర రూ.45 లక్షలకు అమెరికా దేశీయులకు విక్రయించినట్లు వెల్లడైంది.గుజరాత్ రాష్ట్రానికి చెందిన పేద కుటుంబాలకు చెందిన వారు తమ కూతుళ్లను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న వారిని ఎంపిక చేసుకొని వారికి డబ్బులిచ్చి ఇతరుల పాస్ పోర్టులపై వారిని దేశం దాటించారని తేలింది. ఆడపిల్లలకు మేకప్ చేసి వారిని ఇతరుల పాస్ పోర్టుపై అమెరికాకు పంపించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముఠా సభ్యులు ఇద్దరు మైనర్ బాలికలకు మేకప్ చేసేందుకు వారిని వెర్సోవా సెలూన్ కు తీసుకువ‌చ్చారు..

Image result for teenage girls

సినీనటి ప్రీతిసూద్ వారిని అనుమానించి ప్రశ్నించడంతో ఈ ముఠా బాగోతం బట్టబయలైంది. ప్రీతిసూద్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తే అమ్మాయిల విక్రయ ముఠాలో రిటైర్డు సబ్ ఇన్ స్పెక్టరు కుమారుడి పాత్ర కూడా ఉందని తేలింది. పోలీసులు అమీర్ ఖాన్ , తాజుద్దీన్ ఖాన్, రిజ్వాన్ చోటానీ, అప్జల్ షేక్ లను అరెస్టు చేసి విచారించారు. నిందితులతో వాట్సాప్ లో రాజుభాయ్ ఛాటింగ్ చేశాడని తేలడంతో కీలకసూత్రధారి అయిన రాజుభాయ్ ను అరెస్టు చేశామని ముంబై పోలీసులు చెప్పారు. నిందితులపై ఐపీసీ 34, 373 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని విచారించేందుకు పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు..