స్కూల్ పక్కనే బార్ షాప్ ఓపెన్ చేశారు.. స్కూల్ అమ్మాయిలు ఏం చేశారో తెలిస్తే సెల్యూట్ చేస్తారు

139

స్కూళ్లు, ఆల‌యాలు, హాస్పిట‌ల్స్… త‌దిత‌ర ప్ర‌దేశాల‌కు 150 మీట‌ర్ల లోప‌ల మ‌ద్యం దుకాణాలు ఉండ‌రాదు. ఇది మ‌న దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా వ‌ర్తిస్తుంది. అయితే ఎంత మంది దీన్ని పాటిస్తున్నారు..? ఆ సంఖ్య‌ను వేళ్ల మీద లెక్క‌పెట్ట‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో అలా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కేర‌ళ తిరువ‌నంత‌పురంలోనూ ఓ ప్రాంతంలో ఓ స్కూల్ ఉంది. అయితే అది బాలిక‌ల పాఠ‌శాల‌. దీంతో ఆ పాఠ‌శాల‌కు వెళ్లాలంటే ఆ బాలిక‌లంద‌రూ అక్క‌డికి ద‌గ్గ‌ర్లో ఉన్న మ‌ద్యం షాపును దాటుతూ వెళ్లాల్సిందే. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో అయితే వారు ఆ షాపు మీదుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. దీంతో ఎలాగైనా త‌మ గోడును బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌జేయాలని ఆ పాఠ‌శాల బాలిక‌లు అనుకున్నారు. అందుకు వారు ఏం చేశారో తెలుసా..?

Image result for wine shop in villages

ఆ స్కూల్ పేరు హోలీ ఏంజెల్స్‌. కేర‌ళ తిరువ‌నంత‌పురంలో ఉంది. ముందే చెప్పాం క‌దా, ఆ స్కూల్‌కు ద‌గ్గర్లో మ‌ద్యం షాపు ఉంద‌ని, దానికి వెళ్లాలంటే ఆ షాపు మీదుగా వెళ్లాల‌ని. అయితే అలా నిత్యం బిక్కు బిక్కుమంటూ ఆ మ‌ద్యం షాపు మీదుగా వెళ్లాల్సి వ‌స్తుంద‌ని తెలుసుక‌న్న ఆ పాఠ‌శాల బాలిక‌లు ఈ మ‌ధ్యే ఓ నిర్ణ‌యం తీసుకున్నారు. వెంట‌నే దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టేశారు. అందులో భాగంగానే వారు 100 మంది దాకా గుంపుగా త‌యారై స‌ద‌రు మ‌ద్యం షాపు ఎదుట నిర‌స‌న చేప‌ట్టారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

అలా ఆ బాలిక‌లు నిర‌స‌న చేప‌ట్ట‌గా అందుకు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టీపీ రామ‌కృష్ణ‌న్ స్వ‌యంగా స్పందించారు. వెంట‌నే ఆ మ‌ద్యం షాపును తొల‌గిస్తామ‌ని ఆ బాలిక‌ల‌కు హామీ ఇచ్చారు. దీంతో ఆ బాలిక‌లు ఇప్ప‌టికైతే నిర‌స‌న విర‌మించారు. కానీ ఆ షాపును తీసివేయ‌క‌పోతే మాత్రం మ‌ళ్లీ ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయితే తిరువ‌నంత‌పురంలో హోలీ ఏంజిల్స్ స్కూల్ ఒక్క‌టే కాదు. ఇంకా అలాంటి పాఠ‌శాల‌లు చాలానే ఉన్నాయి. ద‌గ్గ‌ర్లో మ‌ద్యం షాపు ఉన్న‌వి. వాటికి చెందిన విద్యార్థులు కూడా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఇది ఆ రాష్ట్రానికే ప‌రిమితం కాదు. ఇంకా అలాంటి మ‌ద్యం షాపులు లెక్క‌కు మించిన‌వి మ‌న దేశంలో ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆల‌యాల పక్క‌న ఉంటే, కొన్ని హాస్పిటల్స్ ప‌క్క‌న‌, కొన్ని హైవేల పక్క‌న ఉన్నాయి. వాట‌న్నింటినీ తొలగిస్తే ఇంకా ఎంతో మందికి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.