నన్ను పెళ్లి చేసుకోరా.. పెళ్లి కావడం లేదని ఫేస్ బుక్ లో ఎలాంటి ఫోటోలు పెట్టిందో చూస్తే షాక్

284

ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకోవడం అనేది యువతీ యువకులకు ఎంత కష్టంగా మారిందో అందరికి తెలిసిందే. కెరీర్ సెటిల్ అయ్యి మంచి సంపాదన వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని అందరు అనుకుంటూ పెళ్లి చేసుకోడానికి టైమ్ తీసుకుంటున్నారు. అయితే సెటిల్ అయ్యి మంచి సంపాదన సంపాదిస్తున్న కూడా తమకు నచ్చిన వరుడు దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో అనేకమంది పెళ్లి కాకుండా అలాగే ఉండిపోతున్నారు. మాట్రిమోనిలో చూద్దాం అంటే వాళ్ళు ఫీజ్ వసూల్ చేస్తారు కానీ మనకు సరిపోయే వదువువరుడులను చూపించరు. అయితే ఈ ఇబ్బందులు అన్ని పడటం ఎందుకు అని అనుకుంది ఒక యువతీ. అందుకే పెళ్లి కోసం ఒక వినూత్న ప్రయోగం చేసింది. మరి ఏం చేసిందో చూద్దామా.

ఈ క్రింది వీడియో చూడండి

కేరళ కు చెందిన 28 ఏళ్ళ జ్యోతి తనకు వరుడు కావాలని పేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం పెద్ద వైరల్ గా మారింది. నేను బిఎస్సి లో ఫాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసాను. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాను. నా తల్లితండ్రులు మరణించారు. ఒక అన్నయ్య వున్నాడు, అతను ముంబై లో సీనియర్ యాడ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు, నాకు కులం, జాతి, వర్గం పట్టింపులేదు.మీకు తెలిసిన వారిలో ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ అంటూ మలయాళంలో ఒక పోస్ట్ చేసింది. అయితే ఆమె పేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ కు కూడా ఒక పోస్ట్ చేసింది. మాట్రిమోనియాల్ వెబ్ సైట్ ల వల్ల డబ్బు నష్టపోవడమే కాక, అందులో మధ్యవర్తుల వల్ల యువతీ యువకులు సరైన భాగస్వాములను ఎంచుకోలేకపోతున్నారు. కావున మీరు పేస్ బుక్ లో మాట్రిమోనీ ఫీచర్ లాంటిది ఒకటి ఏర్పాటు చేయమని కోరింది. కాగా ఆమె చేసిన ఆ పోస్ట్ ను ఇప్పటివరకు దాదాపు ఆరువేల మందికి పైగా షేర్ చేశారు.

Image result for fb posting

కాగా ఈమె లానే ఇదివరకు ఇదే కేరళకు చెందిన రంజిష్ మంజేరి అనే ఫోటోగ్రాఫర్ కూడా తనకు వధువు కావాలని పేస్ బుక్ లో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఏది ఏమైనప్పటికి జ్యోతి చేసిన ఈ ప్రయత్నం మంచిదేనని, ఒకవేళ ఫేస్బుక్ లో మాట్రిమోనీకి సంబందించిన ఫీచర్ ఉంటే బాగుంటుందని పలువురు యువతీ యువకులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఎక్కువ కావడంతో కొందరు దానిని దుర్వినియోగం చేస్తుంటే, మరికొందరు మాత్రం దానిని ఇలా ఉపయోగించుకుంటున్నారు. ఆమెకు తగిన వరుడు దొరకాలని కోరుకుందాం. మరి వరుడి కోసం ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన ఈ యువతీ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.