నీ కూతురే ఉరిశిక్ష వేయమంటుందని దీనికి మీరేమంటారని అడగ్గా మారుతి రావు ఏం చెప్పాడో చూడండి

770

మిర్యాలగూడాలో జరిగిన పరువుహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ను దారుణంగా చంపించాడు అమృతవర్షిణి నాన్న మారుతీరావు. అయితే ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.ప్రణయ్ హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళారం మీడియా ఎదుట ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురిని మీడియా ముందుకు తీసుకు వచ్చారు. అమృత తండ్రి మారుతీరావు మినహా అందరు తలలు దించుకున్నారు.అయితే ఈ సమావేశం తర్వాత మీడియా వాళ్ళు మారుతీరావు దగ్గర నీ కూతురే నిన్ను ఉరి తీయమంటుంది.దానికి మీరేమంటారంటే ఆయన చెప్పిన సమాధానం విని అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.మరి మారుతీరావు ఏమన్నాడో చూద్దామా.

Image result for pranay and amrutha

పోలీసుల మీడియా సమావేశంలో మారుతీ రావులో మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు.పోలీసుల మీడియా సమావేశం సందర్భంగా తన ప్యాంట్ జేబులో రెండు చేతులు పెట్టుకొని మనసు దృఢంగా ఉన్నట్లుగా కనిపించాడు. ఆయన తీరు చూస్తుంటే జైలు శిక్షకు ముందే సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ప్రతి రోజు మనం ఎలా సాదాసీదాగా ఉంటామో, దర్జాగా ఉంటామో అలాగే ఉన్నాడు.పోలీసులు కేసును విచారిస్తున్న సమయంలోనూ అతను అదే విధమైన హావభావాలతో ఉన్నట్టు చెబుతున్నారు. తన లక్ష్యం నెరవేరిందన్న భావన అతని ముఖంలో కనిపించిందని అంటున్నారు. ప్రణయ్ హత్యకు కుట్ర చేసిన మారుతీరావు, అతని సోదరుడు శ్రవణ్‌లు ఈ నాలుగు రోజుల్లో పక్కపక్కనే ఉన్నా ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదని, ఇది తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పోలీసులు చెప్పారు.

Image result for pranay and amrutha

ఇదిలా ఉండగా, పోలీసులు మారుతీరావును తీసుకు వెళ్తున్న సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ‘ఎందుకు చంపినవ్ చెప్పు.. ఎందుకు చంపినవ్ చెప్పు.. అల్లుడిని ఎందుకు చంపావ్.. చంపడానికి కారణం ఏమిటి.. మీ కూతురే నిన్ను ఉరి తీయాలని చెబుతుంది కదా… మీ కూతురు గురించి ఏమంటావ్… ‘ అని పదేపదే ప్రశ్నించారు.దీనికి సమాధానం ఇస్తూ తన కూతురు అమృత ప్రణయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వెడ్డింగ్ రిసెప్షన్ చేసుకొని వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో తన పరువు పోయిందని అందుకే చంపించా అని చెప్పాడు.నన్ను ఉరి తీయమంటుందా..అయితే చిన్నప్పటినుంచి కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులను వదిలి నిన్న కాకా మొన్న పరిచయం అయినా వాడి కోసం వెళ్లిపోవడం కరెక్టేనా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

జీవితాంతం మంచిగా ఉండేలా చూసుకోవాలనుకోవడం తప్పా.తన కోసం తన భవిష్యత్ కోసం ఎన్నో ప్రయత్నాలలో ఉండగా నన్ను మోసం చేసి వాడిని పెళ్లి చేసుకుంది.నా ఆశలన్నీ నశించాయి.మరి నాకెంత కోపం రావాలి.తప్పు చెయ్యడమే కాకుండా మళ్ళి నాతో మాట్లాడాలని చూసి నన్ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది.అందుకే చంపించా అని మారుతీరావు చెప్పాడు.వాడిని చంపినందుకు నేనేమి పశ్చాత్తాపపడడం లేదు.నేను చేసింది కరెక్ట్.ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదని మారుతీరావు చెప్పాడు.విన్నారుగా చంపించడమే కాకుండా కూతురి జీవితం నాశనం అయ్యిందని బాధపడకుండా మారుతీరావు ఎంత దర్జాగా మాట్లాడాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. మారుతీరావు చేసిన వ్యాఖ్యల గురించి అతను పోలీసుల దగ్గర దర్జాగా ఉన్న విషయం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.