కేరళ వరదల్లో జరిగిన ఈ అధ్బుతం చూడండి

408

కేరళలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ వర్షాలతో రాష్టం అస్తవ్యస్తం అయ్యింది.లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతక ముందు ప్రకృతికి అందం కేరళ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రకృతి విలయతాండవం చేసి అక్కడి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.

కేరళలో ఎక్కడ చుసిన వరదకు కొట్టుకుపోయిన ఇల్లులు నేలకోరిగిపోయిన వృక్షాలు,కుంగిపోయిన రోడ్లు,అన్నిటికి మించి వందల సంఖ్యలో శవాలే కనిపిస్తున్నాయి..ఇప్పటికి కూడా అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.రోజురోజుకు నీటి మట్టం పెరగడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.అయితే ఇంత పెద్ద పెనుముప్పు రావడానికి కారణం ఏమిటి..అయ్యప్ప స్వామీకి ఆగ్రహం వచ్చిందా..వస్తే అసలెందుకు వచ్చింది.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళ రాష్ట్రంలో గత వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కుంభవృష్టి కురవడానికిగల కారణాలను కొందరు ఛాందసవాదులు తమకుతోచిన విధంగా చెబుతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వేదభూమిగా పేరుగాంచిన కేరళ రాష్ట్రం ఇపుడు సంభవించిన వరదల్లో మునిగిపోవడానికి గల కారణాన్ని వారు వివరిస్తున్నారు.ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం అయ్యప్ప స్వామీకు ఆగ్రహం రావడమే అంటున్నారు.ఆగ్రహం ఎందుకు అంటే..ప్రసిద్ధ శబరిమలై పుణ్యక్షేత్రంలోకి మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఇలా అయ్యప్ప ఆలయ వ్యవహారాల్లో దేశ అత్యున్నత జోక్యం చేసుకోవడం వల్లే కేరళ రాష్ట్రం వరదల్లో మునిగిపోతోందంటూన్నారు.ఆ సమయంలో జరిగిన అల్లర్లు గొడవలే కారణమని అంటున్నారు.ఇది ఎంత వరకు నిజం.ఆద్యాత్మిక వేత్తలు ఇలా మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్.ఆలయంలోకి వెళ్లి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు కూడా ప్రార్థించవచ్చు అని కోర్ట్ తీర్పు ఇచ్చింది.ఆ తీర్పే ఇప్పుడు స్వామీకి కోపం వచ్చేలా చేసిందని ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు.ఈ కారణమే ఈ కుండపోత వర్షాలకు వరదలకు కారణమట.