కేరళ లో భీభత్సం..ఈ కొండచరియలు ఎలా మునిగిపోతున్నాయో చూస్తే మీరు భయపడిపోవడం ఖాయం..

491

కేరళలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ వర్షాలతో రాష్టం అస్తవ్యస్తం అయ్యింది.లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతక ముందు ప్రకృతికి అందం కేరళ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రకృతి విలయతాండవం చేసి అక్కడి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.కేరళలో ఎక్కడ చుసిన వరదకు కొట్టుకుపోయిన ఇల్లులు నేలకోరిగిపోయిన వృక్షాలు, కుంగిపోయిన రోడ్లు, అన్నిటికి మించి వందల సంఖ్యలో శవాలే కనిపిస్తున్నాయి..ఇప్పటికి కూడా అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Image result for kerala flood in hills

రోజురోజుకు నీటి మట్టం పెరగడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.అక్కడ కొండ చరియలు ఎలా విరిగిపడుతున్నాయో చూస్తే అస్సలు మనం నమ్మలేము.అంతలా వరద భీభత్సం స్ప్రుస్తిస్తుంది.ఒక కొండ చరియ విరిగిపడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.ఆ వీడియోలో కొండ చరియ ఎలా పడిపోతుందో చూస్తే ఎవ్వరికైనా భయం వెయ్యాల్సిందే.ఎనిమిది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 87 మంది మృతి చెందారు. రెండు రోజుల్లోనే 40 మందికి పైగా మృత్యువాతపడ్డారు. వీరిలో కొండ చరియలు విరిగి పడటం వల్లే ఎక్కువ మంది మరణించారు. ఒక్క పాలక్కడ్‌ జిల్లాలోనే కొండచరియలు విరిగిపడి 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.కన్నూర్ ప్రాంతంలోనూ కొండచరియలు భయం గొలుపుతున్నాయి.

Image result for kerala flood in hills

భారీ వరదలకు ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగెత్తుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలోని 12 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి వరద నీరు భారీగా చేరడతో వారం రోజుల వరకూ మూసేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మెట్రో, రైళ్ల సేవలను కూడా నిలిపేశారు. పలు నగరాలు, గ్రామాలను వరదనీరు ముంచెత్తడంతో జనావాసాలు ముంపులో చిక్కుకున్నాయి.చూశారుగా వరద దాటికి ఈ కొండ చరియ ఎలా విరిగిపడుతుందో.ఇలాంటి ఎన్నో కొండ చర్యలు విరిగిపోతున్నాయి.అక్కడి ప్రజలకు ఎలాంటి ఆపయం కలగకూడదు అని కోరుకుందాం.మరి కేరళను భయపెడుతున్న వరదల గురించి అలాగే అక్కడ విరిగిపడుతున్న కొండచరియలను చూస్తే మీకేమనిపిస్తుందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.