అమృత తండ్రిని పోలీసులు ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి..

416

మిర్యాలగూడాలో జరిగిన పరువుహత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రణయ్‌ను దారుణంగా చంపించాడు అమృతవర్షిణి నాన్న మారుతీరావు. అయితే ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసును అతితక్కువ సమయంలోనే చేధించారు.నిన్న మీడియా ముందు వారిని ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ.. తన కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు పరువు పోలేదు కానీ మారుతీరావు పరువు నిజంగా ఇప్పుడు పోయిందని అన్నారు.

ప్రణయ్ హత్య కోసం మూడుసార్లు యత్నించిన నిందితులు చివరి ప్రయత్నంలో అతణ్ని నరికి చంపారని తెలిపారు. కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.పక్కా ప్రణాళికతో ప్రణయ్‌ను చంపించిన మారుతీ రావు హత్య అనంతరం ‘దృశ్యం’ సినిమా తరహా ప్లాన్ వేసినట్లు ఎస్పీ తెలిపారు. వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసి, లేనివి ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేసే విషయం తెలిసిందే.

Image result for pranay and amrutha

వీరికి కఠిన శిక్ష పడే అన్ని ఆధారాలు లభించాయని చెప్పారు.త్వరలోనే వీరిని కోర్ట్ లో ప్రవేశపెడతాం అని చెప్పారు.అయితే ఈ మీడియా సమావేశం తర్వాత మారుతీరావును పోలీసులు లాక్కెళ్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.మారుతీరావును ఎలా ఈడ్చుకెళ్తున్నారో మీరు కూడా చూడండి..