భార‌త్ పై దాడికి దిగిన పాక్ యుద్ద విమానాలు ఆర్మీ ఎలా తిప్పికొట్టిందో చూడండి దెబ్బ‌కి పారిపోయారు

213

స‌ర్జికల్స్ స్ట్రైక్‌తో బుద్ధి చెప్పినా పాకిస్థాన్ వక్రబుద్ధి మారలేదు. దాయాది దేశం కుక్కతోక వంకరన్నట్లు కవ్వింపులకు దిగుతూనే ఉంది. మంగళవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దు గ్రామాలపై కాల్పులకు తెగబడిన పాక్ ఆర్మీ.. బుధవారం మరింత రెచ్చిపోయింది. యుద్ధ విమానాలను భారత గగనతలంలోకి పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు ప్రారంభించింది.

Image result for surgical strike

బుధవారం పాక్ యుద్ధ విమానాలు నిబంధనల్ని ఉల్లంఘించి.. రాజోరి,నౌషారా సెక్టార్లలోని భారత గగనతలంలోకి వచ్చాయి. పలు ప్రాంతాల్లో బాంబుల్ని జారవిడచాయి.. వెంటనే అప్రమత్తమైన భారత వాయుసేన విమానాలను రంగంలోకి దించింది. దీంతో పాక్ విమానాలు తోక ముడిచి అక్కడి నుంచి జారుకున్నాయి. పాక్ బాంబు దాడుల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ఏదో పెద్ద యుద్దానికి సిద్దం అయిన‌ట్టు వార్ కు రెడీగా మేము ఉన్నాం అని చెప్పే దైర్యం లేని పాక్ వెంట‌నే మూడు నిమిషాల్లో వెనుదిరిగి వెల్లిపోయాయి ఈ స‌మ‌యంలో పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి రావడంతో వాయుసేన అప్రమత్తమయ్యింది.

Image result for surgical strike

లేహ్, జమ్మూ, శ్రీనగర్, పఠాన్ కోట్ ఎయిర్‌పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది. భద్రతా కారణాల దృష్ట్యా పౌర విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత తిరిగి విమాన సర్వీసుల్ని ప్రారంభిస్తాము అని తెలియ‌చేశారు.. ఇక ఇలా యుద్ద విమానాలు మ‌న భూభాగంలోకి చొచ్చుకురావ‌డంతో పాక్ మ‌రోసారి ఇలాంటి దుందుడుకు చ‌ర్య‌ల‌కు దిగితే పాక్ కు కోలుకోలేని దెబ్బ త‌గులుతుంది అని తెలియ‌చేసింది భార‌త ఆర్మీ, …పైగా భార‌తీయ యుద్ద‌విమానాలు రెండు ధ్వంసం చేశాము అని పాక్ చెప్పుకోవ‌డం పై అంద‌రూ విమర్శ‌లు చేస్తున్నారు.. వారిని తిప్పికొడితే పారిపొయిన పాక్ మ‌ళ్లీ భార‌త్ యుద్ద‌విమానాలు పేల్చాము అని ట్వీట్ చేసింది ..కేవ‌లం భార‌త్ ని మిగిలిన దేశాల ముందు చిన్న‌దిగా చేయాలి అని చూసినా ఎక్క‌డా మా బేస్ కోల్పోలేదు అని తెలియ‌చేసింది భార‌త్ ఆర్మీ.

ఈ క్రింది వీడియో చూడండి 

పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన మర్నాడే మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. షోపియాన్ జిల్లా మీమండార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం సైన్యం గాలిస్తోన్న సమయంలో ఒక్కసారిగా ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది… ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీ 23 పారా దళాలు, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.