ఈ చేపను తింటే ఇక మీ ప్రాణాలు గాలిలో కలిసినట్టే.?

546

సముద్రం ఎన్నో వింతలకు విశేషాలకు పెట్టింది పేరు.సముద్రంలో లక్షల కోట్ల సంపద ఉంది అనడంలో అతిశయోక్తి కాదు.అయితే కేవలం సంపదకేనా చేపలకు కూడా ఫేమస్.కొన్ని వేల జాతుల చేపలు సముద్రంలో ఉన్నాయి.అయితే చేపల సంగతి మన అందరికి తెలిసిందే.చేపలను తింటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు.కానీ దొరికింది కదా అని ఏ చేపను పడితే ఆ చేపను వండుకొని తిన్నారంటే ప్రాణాలు గాల్లోకి కలిసిపోతాయి. అంత డేంజర్ చేపలు కూడా ఉంటాయి.అలంటి ఒక డేంజర్ చేప గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

చేపలలో అన్నిటికన్నా డేంజర్ చేప పప్పర్ ఫిష్.పఫ్ఫర్ ఫిష్ అనే చేపను పట్టుకుని వండుకుని తింటే ఇక మీ ప్రాణాలు గాలిలో కలిసినట్టే.సముద్ర వేటకు వెళ్ళిన ముగ్గురు స్నేహితులకు ఈ చేప దొరికింది.ఇక ఇంకేముంది ఇంటికి వచ్చి వండుకుని తిన్నారు.ఈ చేప తిన్నముగ్గురిలో ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. ఇంకో వ్యక్తి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.ఈ ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది.

నఖోన్ సి తమరాట్ ఒడ్డున చిట్, టాన్ అనే ఇద్దరు వ్యక్తులు పఫ్ఫర్ చేపను పట్టుకున్నారు. అది అత్యంత విషపూరితమైన చేప.. అది తెలిసి కూడా వారిద్దరూ దాన్ని వండాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ఓ పెద్దాయన తినకూడదని చెప్పినా కూడా వాళ్ళు అతని మాటలు వినలేదు. కాసేపు వండేసిన తర్వాత మరో వ్యక్తి కూడా వారితో చేరాడు. ఓ వ్యక్తి చేపను ఎక్కువగా తినేయడంతో అక్కడే చనిపోయాడు. మరో వ్యక్తిని అక్కడి నుండి ఆసుపత్రికి తీసుకొని వెళుతుండగా మరణించాడు.

కేవలం కొన్ని ముక్కలు మాత్రమే తిన్న వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.పఫ్ఫర్ ఫిష్ అత్యంత ప్రమాదకరమైన.. విషపూరితమైన చేప.. చాలామంది దీన్ని తినడానికి భయపడతారు. ఎలా పడితే అలా వండితే చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ చేపను వండడానికి మాత్రమే ప్రత్యేకంగా డిగ్రీ ఉంటుంది. దాన్ని పూర్తీ చేసిన వ్యక్తులు మాత్రమే దీన్ని వండగలరు. వేరే ఎవరైనా వండితే పరిస్థితి ఇలాగే తయారవుతుంది.కాబట్టి మీకు తెలియని విచిత్రమైన చేప దొరికితే వండుకుని తినకండి.మరీ ఈ చేప గురించి అది తిని చనిపోయిన వారి ఘటన గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.