సినిమా హాల్ వాళ్ళు మీకు తెలియకుండా దాచిపెట్టే రహస్యాలు

120

సినిమా అంటే అందరికి ఇష్టమే. ప్రతి వారం ఏ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసేవాళ్ళు ఉన్నారు. సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం థియేటర్ లో వాలిపోతుంటారు. అయితే సినిమా థియేటర్ కు వెళ్ళేవాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి. థియేటర్ లలో మనకు తెలియకుండా అనేక విషయాలు జరుగుతాయి. వాటి గురించి అందరు తెలుసుకోవాలి. మరి ఆ విషయాలు ఏంటో చూద్దామా.

Image result for cinema halls inside lovers in india
  • మీరు కూర్చునే సీట్ నీట్ గా ఉందని మీరు పొరబాటున కూడా అనుకోవద్దు. మీరు కూర్చునే ముందు పైన కింద ఒకసారి చూసి కూర్చోండి. ఎందుకంటే కొందరు ఆకతాయిలు మీకు కూర్చునే సీట్ మీద ఏమైనా చూయింగ్ గమ్ లు అంటించి ఉంటారు. సినిమా థియేటర్ లో పనిచేసేవాళ్లకు క్లీన్ చేసేంత టైమ్ ఉండదు కాబట్టి వారు అంతలా క్లీన్ చెయ్యరు.
  • చాలామంది లవర్స్ సినిమా చూడటం కోసం కార్నర్ సీట్స్ ను సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇలాంటివారు సినిమా మీద కన్నా వేరే ఇతర కార్యాల మీదనే దృష్టి పెడతారు. అలాంటి పనులు చెయ్యడానికి ఇంతకన్నా చీకటి ప్రదేశం ఉండదని వారనుకుంటారు. కానీ ఇలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య సినిమా థియేటర్స్ లలో నైట్ విజన్ కెమెరాలను ఫిక్స్ చేస్తున్నారు. అంటే మీరు చేసే ప్రతి మూమెంట్ ను ఎవరో ఒకరు అబ్సర్వ్ చేస్తుంటారు. అయితే వీటిని ఎందుకు అమర్చారు అంటే పైరసీని నిర్ములించడానికి. కానీ వారి కంటే ఎక్కువగా లవర్స్ దొరుకుతున్నారు. కాబట్టి ఇకనుంచి సినిమా థియేటర్ లో ఇలాంటి పనులు చేసేవారు మానుకోండి.

ఈ క్రింద వీడియో చూడండి

  • సెంటర్ ఫర్ హియరింగ్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం సినిమా హాల్స్ లో వచ్చే హై ఫ్రీక్వెన్సీ ల కారణంగా మీ వినికిడి శక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందులో ప్రధానంగా యాక్షన్ సినిమాలు చూసేటప్పుడు.
  • సినిమాల థియేటర్ లో ఎక్కువ జనాలను చూసి లేదా హౌస్ ఫుల్ బోర్డు చూసి సినిమా థియేటర్ వాళ్ళు బాగా లాభాలు సంపాదిస్తున్నారని అనుకుంటారు. కానీ మీరు ఉహించినంతగా సినిమా థియేటర్స్ వాళ్లకు లాభాలు ఉండవు. ఒక సినిమాను వాళ్ళ థియేటర్ లో రిలీజ్ చేసేందుకు వారు పెట్టె ఖర్చు కారణంగా సినిమా రిలీజ్ అయినా మొదటి రెండు వారాల వరకు చాలా తక్కువ మార్జిన్ ఉంటుంది. టికెట్స్ అమ్మిన డబ్బులో కేవలం 10 నుంచి 25 శాతం మాత్రమే లాభాలు ఉంటాయి. అందులో మళ్ళి స్టాఫ్ కు జీతాలు ఏసీ ఖర్చులు ఉంటాయి. అయితే రోజులు మారేకొద్దీ వారి మార్జిన్ పెరుగుతుంది. కానీ ఈలోపు మరొక సినిమా వస్తుంది. మళ్ళి యధావిధిగా ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. మరి వీరికి లాభాలు ఎలా వస్తాయో తెలుసా.. థియేటర్స్ లలో అమ్మే కూల్ డ్రింక్స్ ఫుడ్ వలన వీరు లాభపడతారు. థియేటర్స్ లలో అమ్మే కూల్ డ్రింక్స్ పాప్ కార్న్ ల ధరలు టికెట్ ధరకంటే ఎక్కువ ఉంటుంది.
Image result for cinema halls
  • ఈ మధ్య 3D మూవీల హవా నడుస్తుంది. అయితే మీకు తెలుసా ప్రపంచంలో చాలామంది 3d మూవీ చూడాలంటే భయపడతారు.ఎందుకంటే మనం 3D కళ్ళజోడు పెట్టుకోగానే మన కళ్ళు మన మెదడుకు ఊగుతున్నట్టు సంకేతాలు ఇస్తాయి.అలాగే మన చెవులు ఏమో మనం ఊగడం లేదని మెదడుకు సంకేతం ఇస్తుంది. దీంతో మీ మెదడు ఎక్కువగా ఆలోచిస్తుంది. తలనొప్పి మొదలవుతుంది. ఒకవేళ మీరు 3D గ్లాసులు పెట్టుకొని సినిమా చూడాల్సి వస్తే వాటిని బాగా క్లీన్ చేసుకోండి.ఎందుకంటే మీ కన్న ముందు పెట్టుకున్నవారి కళ్ళకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటె మీకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది.
  • సినిమా హాల్ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మీ మైండ్ తో ఆడుకుంటారు. ఎలా అంటారా..మీరు థియేటర్ లోపలికి వెళ్ళగానే రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ ను అమర్చిపెడతారు. వాటి కమ్మని వాసన మనలోని ఆకలిని పెంచుతుంది. కొనొద్దు అనుకుంటూనే మనం వాటిని కొంటాం. అంతేకాదు సినిమా స్టార్ట్ అయ్యేముందు మరియు ఇంటర్వెల్ సమయాన యాడ్స్ వేస్తారు. అవి మనల్ని మెంటల్ గా డిస్టర్బ్ చేస్తుంది. దీంతో బోర్ కొట్టి ఏదో ఒకటి కొనుక్కుందాం అని బయటకు వెళ్తాము. అలాగే యాడ్స్ ద్వారా కూడా వాళ్లకు బాగానే డబ్బులు వస్తాయి.
  • అడల్ట్ సినిమాల గురించి మీరు వైన్ ఉంటారు. వాటికి A సర్టిఫికెట్ ఉంటుంది. అంటే 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే ఈ సినిమాని చూడాలి. కానీ ఈ నియమాన్ని కొన్ని థియేటర్స్ లలో మాత్రమే స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. అంతేకాకుండా మల్టి ప్లెక్స్ లో ఒకేసారి చాలా సినిమాలు నడుస్తాయి. అందుకే చెకింగ్స్ వద్ద ఏ సినిమాను వెళ్తున్నామో పెద్దగా పట్టించుకోరు. దాంతో పిల్లలు కూడా A సర్టిఫికెట్ సినిమాలకు వెళ్తున్నారు.