హోటల్ గదుల్లో సీక్రెట్ కెమేరాలు.. పోర్న్ సైట్లలో వీడియోలు ప్రసారం!

360

కొత్త బట్టలు కొనడానికి ఫ్రెండ్స్ తో గాని, ఫ్యామిలీ తో గాని సరదాగా షాపింగ్ కు వెళ్తే… కొత్త కొత్త బట్టలు ట్రై చేసి.. అందులో బాగా నచ్చినవి కొనుగోలు చేస్తాం. ఇంత వరకు బానే ఉంటుంది…. కాని కొన్ని రోజుల తరువాత మీరు ట్రయల్ రూమ్ లో కొత్త బట్టలు ట్రై చేసేటప్పుడు తీసిన వీడియో ఇంటర్నెట్ లో వస్తే దానిని మించిన షాక్ మరొకటి ఉండదు.అలాగే వేరే ఊరికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా హోటల్ లో బస చేస్తాం. అయితే ఒంటరిగా బస చేస్తే పర్లేదు కానీ జంటగా హోటల్‌లో బస చేస్తున్నారా? అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీ పరువు పోయే పనులు ఎన్నో అక్కడ జరుగుతుంటాయి.ఇద్దరు ఏకాంతంగా ఉన్నాం కదా అని రొమాన్స్ లాంటివి చేస్తే ఇక మీ పని అంతే.. మీ శృంగార వీడియో ఏదో ఒక రోజు పోర్న్ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం కావచ్చు.

దక్షిణ కొరియాలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన గురించి తెలిస్తే ఇకపై హోటళ్లలో బస చేయాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ సుమారు 30 పైగా హోటళ్లలోని గదుల్లో సీక్రెట్ కెమేరాలు బయటపడ్డాయి. ఆ కెమేరాలతో 1600 మంది అతిథుల ఏకాంత వీడియోలు రికార్డు చేశారు. ఇటీవల ఓ జంట తాము హోటల్‌ గదిలో ఉన్న వీడియో ఒకటి పోర్న్ వెబ్‌సైట్లో కనిపించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై దక్షిణ కొరియాలో వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు హోటళ్లల్లో తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Image result for romance in bed room

సీక్రెట్ కెమేరాలతో సుమారు 1600 మంది అతిథుల ఏకాంత వీడియోలను రికార్డు చేశామని నిందితులు తెలిపారు. దక్షిణ కొరియాలోని 10 నగరాల్లో 30 హోటళ్లలో ఈ కెమేరాలను ఏర్పాటు చేశామన్నారు. ఎలక్ట్రికల్ సాకెట్లు, హెయిర్‌డ్రయర్ హోల్డర్లు, డిజిటల్ టీవీ బాక్సుల్లో కెమేరాలు పెట్టామని తెలిపారు. అలా రికార్డు చేసిన వీడియోలను వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తున్నామన్నారు. ఆ వెబ్‌సైట్‌కు వేల సంఖ్యలో సభ్యులు ఉన్నారని, వారి నుంచి నెలకు రూ.3,102 వసూలు చేస్తున్నామని తెలిపారు. చూశారుగా ఎంత దారుణ చర్యకు పాల్పడ్డారో. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా హోటల్ లో స్టే చేస్తే జాగ్రత్త. లేకుంటే మీ వీడియోలు కూడా ఎవరో ఒకరు తీసే అవకాశం ఉంది.మరి సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోస్ తీసిన ఈ గ్యాంగ్ గురించి అలాగే ఇలా రహస్య వీడియోస్ తీసి నెట్ లో పెట్టె నీచుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.