పాత స్కూల్ తవ్వుతుండగా ఏం బయటపడ్డాయో చూసి శాస్త్రవేత్తలు కూడా బిత్తరపోయారు

499

తవ్వకాలు జరిపినప్పుడు అప్పుడప్పుడు వింత వింత వస్తువులు బయటపడతాయి.కొన్నిసార్లు మనుషుల పుర్రెలు లేదా ఎన్నో వందల ఏళ్ల క్రితం నాటి వస్తువులు బయటపడతాయి.అయితే చైనాలో ఒక స్కూల్ బిల్డింగ్ కోసమని తవ్వకాలు జరపగా ఇలాంటిదే జరిగింది.అయితే ఆ బయటపడ్డ వాటిని చూసి పురావస్తు శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు.మరి చైనాలో తవ్వకాలలో అంతలా ఆశ్చర్యపోయేవి ఏం బయటపడ్డాయో తెలుసుకుందామా.భూమిపై కొన్ని కోట్ల సంవత్సరాల కిందట రాక్షస బల్లులు తిరిగేవన్నది ఎన్నాళ్ల నుంచో ఉన్న వాదన. ఇది నిజమే అనడానికి ఇప్పటికే ఎన్నో ఆధారాలు దొరికాయి. ప్రపంచంలో ఏదో ఒక చోట డైనోసార్లకు చెందిన శిలాజాలు బయటపడుతూనే ఉన్నాయి.

Image result for old schools in village

తాజాగా చైనాలోనూ డైనోసార్లకు చెందిన గుడ్లు బయటపడ్డాయి. చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని గువాన్‌గ్జూ లో ఓ స్కూల్ నిర్మాణం కోసం తవ్వకాలు జరపుతుండగా ఇవి బయటపడ్డాయి.ఓ పెద్ద బండరాయిని పగలగొట్టడానికి డిటోనేటర్లు ఏర్పాటుచేశారు. పేలుడు తర్వాత ఆ బండరాళ్ల ముక్కల్లో ఓ దాంట్లో సుమారు 30 గుడ్లు బయటపడ్డాయి.ఈ గుడ్లను స్థానిక నిపుణులు పరిశీలించి.. అవి డైనోసార్లకు చెందినవేనని తేల్చారు. 13 కోట్ల సంవత్సరాల కిందివిగా వాళ్లు తేల్చారు. ఇవి జురాసిక్ పీరియడ్ తర్వాత వచ్చిన క్రెటేషియస్ కాలానికి చెందిన డైనోసార్ల గుడ్లుగా నిపుణులు చెప్పారు.ఈ క్రెటేషియస్ పీరియడ్ 14.5 కోట్ల ఏళ్ల కింద మొదలైంది. 6.6 కోట్ల ఏళ్ల కిందట ముగిసింది. ఈ క్రెటేషియస్ కాలంలోనే డైనోసార్లు భూమిపై తిరిగేవి.ఈ గుడ్లు అప్పటికాలానివే అని పరిశోధకులు చెబుతున్నారు.దొరికిన మొత్తం 30 గుడ్లలో 19 గుడ్లు చెక్కు చదరలేదని, వీటన్నింటినీ మ్యూజియంకు తరలించి భద్రపరుస్తామని అధికారులు తెలిపారు. ఈ గుడ్లలో ఒకటి 13 సెంటీమీటర్ల పొడవుందని అధికారులు తెలిపారు.అయితే ఇన్ని కోట్ల సంవత్సరాలు అయినా ఇవి ఎందుకు చెడిపోకుండా ఉన్నాయనే అనుమానం శాస్త్రవేత్తలకు వచ్చింది.వారు చెప్పినదాని ప్రకారం..

Image result for old schools in village

ఆ రోజుల్లో వేల కిలోలు ఉండే డైనోసార్స్ ఇంత చిన్న చిన్న గుడ్లను కాపాడుకోడానికి ఇబ్బందిగా ఉండేదంట.అందుకే ఆ డైనోసార్స్ ఇక్కడ పెట్టి వాటిని పెద్దగా పట్టించుకోకపోయి ఉంటాయి.వాతావరణ మార్పుల కారణంగా ఆ పిండం వృద్ధి చెందలేదని, ఆ తర్వాత అవి మట్టిలో కలిసిపోయి రాళ్ళలాగా మారిపోయాయని ఈ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పారు. చైనాలో డైనోసార్ గుడ్లు బయటపడటం ఇది కొత్త ఏమికాదు. గతంలో అనేక గుడ్లు స్వాధీనం చేసుకున్నారు.డైనోసార్ ల స్వస్థలం అని హెయివాన్ నగరానికి పేరు ఉంది. ఈ నగరం గిన్నీస్ బుక్ రికార్డులకు ఎక్కింది ఇంతకముందు కూడా ఒకసారి తవ్వకాలు జరపగా 231 డైనోసార్ గుడ్లతో పాటు అస్తిపంజరం బయటపడింది.అయితే ఇంటి యజమాని వాటిని ప్రభుత్వానికి అప్పగించకుండ ఇంటిలో దాచిపెట్టుకున్నాడు.ఎవరో సమాచారం ఇవ్వగా వెళ్లి వెతికితే ఆ డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

చైనా లోని మ్యూజియంలో 10 వేలకు పైగా డైనోసార్ గుండ్లు ఉన్నాయి. అయితే తవ్వకాలలో పురాతన వస్తువులు ఏవైనా చిక్కితే అది ప్రభుత్వానిదే అని చైనాలో ఒక చట్టం ఉంది. తవ్వకాలలో లభించిన పురాతన వస్తువులు ప్రభుత్వానికి అప్పగించకుంటే వారి మీద అక్కడి పోలీసు అధికారులు కేసులు నమోదు చేస్తారు. స్వాధీనం చేసుకున్న డైనోసార్ గుడ్లు శిథిలావస్థ స్థితిలో ఉన్నాయని చైనా మీడియా తెలిపింది.విన్నారుగా చైనాలో బయటపడ్డ డైనోసార్స్ గుడ్ల గురించి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.బయటపడ్డ డైనోసార్స్ గుడ్ల గురించి అలాగే డైనోసార్స్ గురించి అలాగే ఇలా తవ్వకాల్లో అప్పుడప్పుడు బయటపడే పురాతన వస్తువుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.