విద్యార్థినిని లైంగికంగా వేధించిన స్కూల్ ప్రిన్సిపాల్.. చివరికి విద్యార్థిని ఏం చేసిందో తెలిస్తే శభాష్ అంటారు

258

స్కూల్.. ఇల్లు.. రోడ్డు.. ఇలా ఆడవాళ్ల భద్రతకు ప్రతీ చోట పరీక్షే ఎదురవుతోంది. ఎప్పుడు ఎవరి రూపంలో వారి మీద లైంగిక దాడి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆఖరికి చదువు చెప్పే ఉపాధ్యాయులు సైతం కామంతో కాటేస్తూ విద్యార్థినుల జీవితాలను బలిగొంటున్నారు.కన్నకూతురిలా చూసుకోవాల్సిన టీచర్స్ వారి మీద పడి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి నీచ టీచర్స్ గురించి అనేక ఘటనలు చూశాం. ఇప్పుడు మరొక ఘటన జరిగింది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for class teacher and student

తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం రాచూరిపల్లికి చెందిన ఓ విద్యార్థిని స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ పాఠశాలలో స్లీవర్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఈ కామాంధుడు ఆ బాలికపై కొన్నాళ్లుగా కన్నేశాడు. అప్పటి నుంచి ఆమెను లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు.ఈ వేధింపులు భరించలేని విద్యార్థిని తన తల్లిదండ్రులకు బోరున విలపిస్తూ చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు అక్కడికి చేరకుని తల్లిదండ్రులకు సర్దిచెప్పారు.ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సదరు ప్రిన్సిపాల్ విధుల్లో ఉండటానికి వీళ్లేదని, అతన్ని వెంటనే తొలగించాలని పాఠశాల యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ క్రింది వీడియో చూడండి 

చూశారుగా ఈ ప్రిన్సిపాల్ ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో. అయితే ఇలాంటి ఘటనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకముందు బీహార్ లో ఒక టీచర్ స్టూడెంట్ ను గర్భవతి చేశాడు. మరొక చోట అత్యాచారం చేశాడు. కొందరు అయితే ఏకంగా పెళ్లిళ్లే చేసుకుంటున్నారు. ఈ ఘటనలను చూస్తే పవిత్రమైన స్టూడెంట్ టీచర్ రిలేషన్ షిప్ ఏమైపోతుందో అని అనిపిస్తుంది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. పైన చెప్పిన ప్రిన్సిపాల్ ఘటన గురించి అలాగే ఈ మధ్య ఎక్కువగా బయటపడుతున్న కామ టీచర్స్ ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.