సౌదీ యువరాణి జీవితం ఎలా ఉంటుందో తెలుసా..

231

సౌదీ అరేబియా..చాలా చిన్న దేశం. కానీ అభివృద్ధిలో చాలా పెద్ద దేశం. సౌదీ దేశాన్ని పాలించేవారు ప్రపంచంలోనే అత్యంత్య ధనికవంతులు. ఈ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు అందరు రాజులూ రాణులే. అందులో ఒకరు సౌదీ యువరాణి అమీరా. పోరాటం ఎవరైనా చేస్తారు.. కానీ ఏకంగా ఆ దేశ యువరాణే పాలకులపై పోరాటం చేస్తే.. హక్కుల కోసం గళం ఎత్తితే.. ఏం జరుగుతుంది? ఎలాంటి సంచలనాలు తలెత్తుతాయి? ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానం సౌదీ యువరాణి అమీరా. సౌదీ యువరాణి అయినా అమీరా యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for ప్రిన్సెస్ అమీరా

ప్రిన్సెస్ అమీరా 1983 నవంబర్ 6 న సౌదీ అరేబియా రాజధాని అయినా రియాజ్ లో జన్మించింది. ఇస్లాం దేశంలో ఆడవాళ్లకు కట్టుబాట్లు ఎక్కువ. బయటకు వచ్చారంటే హిజాబ్, బురఖాలు లేకుండా అడుగు బయటపెట్టరు. తప్పక ధరించాలనే నియమాలన్నాయి. కానీ ఆ దేశంలో ఒక యువరాణి ఈ కట్టుబాట్లకు గుడ్ బై చెప్పేసింది. ఈమె సౌదీకి యువరాణిగా ఎప్పుడు మారింది అంటే ఈమె 2008 లో సౌదీ యువరాజు అయినా అల్విద్ బిన్ తలాల్ ను పెళ్లి చేసుకున్నప్పుడే సౌదీ అరేబియాకు ప్రిన్సెస్ గా మారింది. సౌదీ అరేబియాలోని అత్యంత్య ధనికుడిగా ఇతనిని చెప్పుకుంటారు. కానీ 2013 లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఆమెను ప్రిన్సెస్ అమీరా అల్ తవిల్ అని పిలుస్తారు. ఆమెను సౌదీ అరేబియాలోని పవర్ ఫుల్ మహిళగా చెప్పుకుంటారు. అయితే మొదటి భర్తతో విడాకులు తర్వాత ఈమె 2018 లో యూఏఈ లో బిలినియర్ అయినా ఖలీఫ్ అల్ బుద్ధి అల్ మోహరితాను పెళ్లి చేసుకుంది. ఈ పెళ్ళిలో ఒక ఘటన జరిగింది. ఈ పెళ్లి ప్యారిస్ లో జరిగింది. ఈ పెళ్ళిలో ప్రిన్సెస్ యొక్క 1 మిలియన్ విలువ గల జ్యువెలరీ దొంగలించబడింది. ఆ దొంగతనం ఎవరో చేశారో ఇప్పటికి కూడా తెలీదు. ప్రిన్సెస్ అమీరా ఒక సోషల్ వర్కర్.

Image result for ప్రిన్సెస్ అమీరా

అందుకే ఆమె ప్రపంచం మొత్తం తెలుసు. మొదటిసారి పెళ్లి అయినప్పుడు భర్తతో కలిసి సమాజసేవలో చురుకుగా పాల్గొనేది. విడాకులు అయినా తర్వాత కూడా సోషల్ సర్వీస్ ను చేస్తూనే ఉంది. సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చెయ్యడానికి ఇప్పటివరకు 71 దేశాలు తిరిగింది. ఆమె ఎక్కువగా ఉమెన్ కోసం పోరాడుతుంది. ‘మతం పేరుతో హక్కులను కాలరాస్తారా’ అంటూ సొంత దేశాధినేతలనే ఆమె ప్రశ్నిస్తున్నారు. ప్రపంచాన్ని ఆకర్షించిన తువీల్ పోరాటం తీరు అల్వీద్ సోదరుడికి నచ్చలేదు. దీంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు దూరంగా ఉండకపోతే శిక్షతప్పదని ఆమెను హెచ్చరించారు. సోదరుడితో తెగదెంపులు చేసుకుని మహిళల సమస్యలపై ఆమె పోరాటం చేస్తున్నారు. మహిళల డ్రైవింగ్, పలు కట్టుబాట్లు గురించి ఆమె ప్రశ్నిస్తున్నారు. మిగతా దేశాల్లోని ఆడవాళ్లు ఎలాంటి జీవితం అనుభవిస్తున్నారో.. ఇస్లామిక్ దేశాల్లో కూడా అదే పద్ధతి వచ్చేలా పోరాడుతానంటోందీమె.

సౌదీలోని ఆడవాళ్ల కష్టాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చేది, ఇప్పటికి ఇస్తుంది కూడా. సిరియన్ రిఫ్యూజీలకు, సోమాలియా పిల్లలకు ఆపన్న హస్తం అందిస్తోంది అమీరా. వీరి సమస్యలు తీర్చడానికి ప్రపంచంలో ఉన్న ఎంతోమంది పెద్దలను కలిసి చర్చించడం, వారికి సహాయాలు అందించడమే పనిగా పెట్టుకుంది అమీరా. యునైటెడ్ కింగ్ డమ్ ప్రిన్స్ తో కలిసి అనేక సోషల్ వర్క్స్ చేస్తుంది. ఆమె చేసిన సోషల్ వర్క్స్ కారణంగా ఆమెకు అనేక అవార్డ్స్ కూడా లభించాయి. దానిలో మెడల్ ఫర్ అవుట్ స్టాండింగ్ఫిలాంట్రోపీ అవార్డు కూడా ఆమెకు వచ్చింది. ప్రిన్సెస్ అమీరా కేవలం రాజకుమారి మాత్రమే కాదు బిజినెస్ ఉమెన్ కూడా. ప్రపంచంలోని 90 దేశాల్లో సేవల అందిస్తున్న అల్వీద్ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ఆమె బాధ్యతలు చేపట్టారు.. అలాగే టైమ్ ఎంటర్ టైన్ మెంట్ కూ చైర్ పర్సన్ గా పనిచేస్తుంది.ఈమె ఆదాయం కూడా ఎక్కువ. ఆమె భర్త ఆదాయం కూడా భారీగానే ఉంది. ఇయర్ కు వీళ్ళ ఆదాయం 2 బిలియన్ డాలర్స్ అంటే 16000 కోట్ల రూపాయలు. ప్రిన్సెస్ అమీరా గురించి చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఏమిటంటే.. ఆమె ఒకసారి టీవీ షోలో కూడా కనిపించింది. ఆ టీవీ షోను CNN కండక్ట్ చేసింది. ఆమె ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది.

Image result for ప్రిన్సెస్ అమీరా

ఆమె వేసుకునే డైమండ్ ఇయర్ రింగ్స్ ఖరీదు 40 మిలియన్ డాలర్స్ అంటే 280 కోట్ల రూపాయలు. ఆమె యొక్క కార్ల కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టు అయితే ఆమె దగ్గర రోల్స్ రాయల్స్ కారు ఉంది. దాని ఖరీదు 6 కోట్లకు పైగానే ఉంటుంది. అదే కాకుండా ఆడిR8, ఫెరారీ 458, రోల్స్ రాయల్స్ ఫాంటమ్, మెర్సడిస్ లాంటి ఎంతో విలువైన కార్లు ఉన్నాయి.