సందీప్, మాధవి ప్రేమ గురించి సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన స్నేహితుడు

404

మిర్యాల‌గూడ‌లో జ‌రిగిన సంఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రోదారుణం హైద‌రాబాద్ లోజ‌రిగింది.. ఇది కూడా కులాంత‌ర వివాహం చేసుకున్న కూతురిపై క‌క్ష‌తో ఇలా దాడికి పాల్ప‌డ్డాడు అమ్మాయి తండ్రి, న‌గ‌రం న‌డిబొడ్డున ఈ దారుణం జ‌రిగింది… తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారనే కారణంతో సందీప్ – మాధవి జంటపై అమ్మాయి తండ్రి మ‌నోహ‌ర్ చారి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. సందీప్, మాధవి తమ బండి వద్ద నిలుచుని ఉండగా వారి వెనకే బైక్ పై వచ్చిన తండ్రి మ‌నోహ‌ర‌చారి తన బ్యాగులోంచి కత్తి బయటకు తీసి దాడి చేశాడు.

సందీప్, మాధవిలపై దాడి, యువతి పరిస్థితి విషమం

ఈ దాడిలో సందీప్, మాధవికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు సనత్‌నగర్‌లోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది…కులాంతర వివాహమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మాట్లాడుకుందాం… రమ్మని పిలిచిన మాధవి తండ్రి ఈ దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. రెండు నిమిషాలు మాట్లాడిన త‌ర్వాత ఈ దాడికి పాల్పాడ్డాడు తండ్రి . ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి త‌ర్వాత సందీప్ సోదరుడు స్పందిస్తూ మాధవి, సందీప్ ఇద్దరు మేజర్లేనని తెలిపారు. ఇద్దరూ బోరబండకు చెందినవారే.

పట్టుకునే ప్రయత్నం చేసినా విఫలం, ఓ వ్యక్తి ధైర్యం చేసి తన్నాడు

ఇక నెల రోజుల క్రిత‌మే ఆర్య‌స‌మాజ్ లో పెళ్లి చేసుకున్నారని , దీనిపై పోలీసుల‌కు కూడా ర‌క్ష‌ణ క‌ల్పించాలి అని కేసు పెట్టాము అని చెప్పాడు సందీప్ సోద‌రుడు, ఇక అబ్బాయి ఎస్సీ సామాజిక వ‌ర్గం అని అమ్మాయి బీసీల‌కు చెందిన వారు చెబుతున్నారు.. ఇలాంటి దాడి జ‌రుగుతుంది అని తాము ఊహించ‌లేద‌ని మొన్ననే స్టేష‌న్లో కూడా ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నామ‌ని, కుమార్తెని ఇంటికి వ‌చ్చెయ్య‌మ‌ని పిలిచినా రాలేద‌ని , దీంతో వారిపై కోపం పెంచుకున్నారు అని తెలుస్తోంది. ఇక ఇద్ద‌రికి ఇష్టం ఉంది అని అందుకే పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సందీప్ ఫ్రెండ్స్, త‌మ కులం వేరు అని అయినా మా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని ఆ అమ్మాయి తండ్రి అనేవాడు, చివ‌ర‌కు ఇంత దారుణానికి ఒడిగ‌ట్టాడు అని అంటున్నారు.. 10వ త‌ర‌గ‌తి నుంచి ప్రేమించుకుని ఇటీవ‌లే పెళ్లి చేసుకున్నారు అని చెబుతున్నారు సందీప్ స్నేహితులు, మ‌రి చూశారుగా రెండు రోజుల్లో ఇలాంటి దారుణం మ‌రొక‌టి జ‌ర‌గ‌డం పై అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు, దీనిపై మీ అభిప్రాయాల‌ను తెలియ‌చేయండి ఇలాంటివి జ‌రుగ‌కుండా ఉండాలి అంటే ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలో కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.