మైల బట్టలను ఇరుముడిలో పెట్టుకొని శబరిమల వెళ్ళింది తరువాత ఏం జరిగిందో తెలిస్తే షాక్

472

శబరిమల అయ్యప్ప సన్నిధానంలోకి అన్ని వయస్కుల మహిళలను ప్రవేశించవచ్చునని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో.. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కొందరు మహిళలు శబరిమలకు వెళ్లారు. ఈ స‌మ‌యంలో ఇక్క‌డ పెద్దఎత్తున వివాదాలు జ‌రిగాయి, మ‌హిళ‌ల‌ను గుడిలోకి రాకుండా ప‌లువురు అడ్డుకున్నారు అయినా కొంద‌రు స్వామిని ద‌ర్శించి తీరుతాము అని చెప్పారు.. ఈ సమ‌యంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ముస్లీం మహిళ, మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ముస్లీం సమాజం బహిష్కరించింది.

శబరిమలలోని అయ్యప్ప సన్నిధానానికి అత్యంత దగ్గరగా వెళ్లి, వెనుదిరిగి వచ్చిన ముస్లిం యువతి రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన మరుసటి రోజే ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించినట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. రెహానా బీఎస్ఎన్ఎల్‌లో టెలికాం టెక్నీషియన్‌గా పనిచేస్తుండగా.. ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. కాగా సెప్టెంబర్ 30న ఫాతిమా.. తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టింది. ఆ ఫేస్‌బుక్ పేజీలో శబరిమలకు వెళ్లిన ఫోటోను పోస్టు చేశారు. నీలక్కల్ వద్ద చేరుకున్న ఆమెను పోలీసులు సన్నిధానం వరకు తీసుకెళ్లగలిగారు. మైల బట్టలను ఇరుముడిలో పెట్టుకొని శబరిమల వెళ్ళింది అని ఆమె చాలా పాప‌పూరిత ప‌ని చేసింది అని భ‌క్తులు ఆమెపై విమ‌ర్శ‌లు చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే భక్తుల నిరసనలతో ఆమె వెనుదిరిగి వ‌చ్చింది, ఆ తర్వాత ఆమె మైల బట్టలు ఇరుముడిలో పెట్టుకుని వచ్చిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె నివాసాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రెహానాను ముస్లింల నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన కూడా విడుదలైంది. తాజాగా ఆమె ఉద్యోగం కూడా ఊడింది. రెహానా చేసిన పని వల్ల హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అదే సమయంలో ఆమె చేసిన పని హిందూ ఆచారానికి విరుద్ధమని చెప్పారు. అలాగే, మత విశ్వాసాలను కాలరాస్తూ విగ్రహారాధన చేయాలన్న ఆమె ఉద్దేశ్యం కారణంగా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు మ‌త పెద్ద‌లు. ఆమె కిస్ ఆఫ్ లవ్ ఆందోళనలో పొల్గొన్నదని చెప్పారు. అలాగే అసభ్యకరంగా నటించిందన్నారు. కాబట్టి ఆమె ముస్లీం పేరును ఉపయోగించడానికి వీల్లేదన్నరు. ఇక ఇప్పుడు ఆమెని క‌ల‌వ‌డానికి ఎవ‌రూ వెళ్ల‌డం లేదు అలాగే ఆమె ఒక్క‌రే ఉంటున్నార‌ట. స‌మాజం నుంచి ఆమె చేసిన ప‌నికి వెలివేసిన‌ట్లు అయింది అని తెలుస్తోంది. ఇక ఈ విష‌యంలో ఆమెకు ఎవ‌రూస‌పోర్ట్ గా లేరు అని చెబుతున్నారు ఆమె స‌న్నిహితులు. మ‌రి ఆమె చేసిన పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.