Breaking News:‘ఆర్‌ఎక్స్‌ 100’డైరెక్టర్‌ ఇంట తీవ్ర విషాదం..శోక సంద్రంలో సినీ పరిశ్రమ

76

దర్శకుడు కావాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన అజయ్ భూపతి… వీరూ పోట్ల, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల వద్ద అసిస్టెంటుగా పని చేశాడు. సహాయ దర్శకుడిగా పని చేస్తూ తనలోని క్రియేటివిటీకి మరింత పదును పెట్టుకున్నారు.వర్మ వద్ద శిష్యరికం చేసిన అనంతరం సొంతగా ‘ఆర్ఎక్స్ 100’ కథ రాసుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తొలి ప్రయత్నంలోనే సంచలన విజయం అందుకున్నాడు. తొలి సినిమా చేసే వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు అలాగే ఆగాడు.. చివ‌ర‌కు ఇటీవ‌ల ఆయ‌న ఓ ఇంటివాడు అయ్యాడు..ఆత్రేయపురంకు చెందిన లక్ష్మీ శిరీష అనే అమ్మాయిని అజయ్ పెళ్లిచేసుకున్నాడు.

ఇంటిలో ఎంతో సంతోష వాతావ‌ర‌ణం ఉంది ఇక త‌న కొత్త సినిమా క‌థ విష‌యంలో బీజీగా ఉన్నారు ఆయ‌న‌.. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఇంట విషాదం అల‌ముకుంది. ఆయ‌న స‌క్సెస్ ని చూసి ఎంతో సంతోషించిన ఆయ‌న తండ్రి వేగేశ్న రామరాజు అనారోగ్యంతో క‌న్నుమూశారు.. ఆయ‌న వ‌య‌సు 54 సంవ‌త్స‌రాలు…ఆయన కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ రాజమహేంద్రవరంలోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కుమారుడు అజయ్‌భూపతి ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాన్ని నిర్మించి సక్సెస్‌ డైరెక్టర్‌గా నిలివ‌డం, ఆయ‌న‌ని ఎంతో సంతోషింప‌చేసింది. రామరాజు కుమార్తె అమెరికాలో స్థిరపడ్డారు. అజయ్‌ భూపతిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. 11 రోజుల పాటు ఆత్రేయపురం స్వగ్రామంలో నిత్య కర్మల్లో అజయ్‌ భూపతి పాల్గొంటారు.

ఇక పెద్దఎత్తున సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌ను ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న వెంట చిత్ర యూనిట్ ఉంది. మ‌రి ఆయ‌న మృతిప‌ట్ల మీరు కూడా సంతాపం తెలియ‌చేయండి, ఆయ‌న ఆత్మ‌కు శాంతిచేకూరాలి అని కామెంట్ల‌ద్వారా కోరుకుందాం.