హైదరబాద్ మ్యాచ్ లో ఓడిన తరువాత షాకింగ్ కామెంట్స్ చేసిన రస్సెల్

257

ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ అసాధారణ ఆటతీరు కనబరుస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు వెన్నుముకలా మారాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన రస్సెల్ 74 సగటుతో 377 పరుగులు చేశాడు. ఇందులో అతడి స్ర్టైక్ రేట్ 220 పైనే ఉండడం విశేషం. ఇంతటి ప్రభావం చూపిస్తున్న రస్సెల్‌ను ఓ వ్యక్తి ఏడిపించాడట. ఈ విషయాన్ని ఎవరో చెప్పలేదు. అతడే స్వయంగా వెల్లడించాడు.

ఈ క్రింది వీడియో చూడండి

ఐపిఎల్‌ లో తన ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు ఒంటిచేత్తో విజయాలను అందించి సత్తా చాటుతున్నాడు. బౌలింగ్‌ లో పరవాలేదనిపిస్తున్నాడు కానీ బ్యాటింగ్‌ విషయానికి వస్తే ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగులు సునామీ స ష్టిస్తున్నాడు. పూనకం వచ్చినట్లు భారీ షాట్లతో విరుచుకుపడుతూ జట్టుకు విలువైన పరుగులు అందిస్తూ విజయతీరాలకు చేరుస్తున్నాడు. ఇలా ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిలా మారిన రస్సెల్స్‌ గతంలో కేకేఆర్‌ యాజమాన్యం తనను ఏడిపించిదంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.

Image result for andre russell

ఈ సీజన్‌లో తన ఫామ్ గురించి స్పందిస్తూ ‘‘2017లో నేనే నిషేదం ఎదుర్కొన్న సమయంలో ఎంతో డిప్రెషన్‌కు గురయ్యాను. ఆ సమయంలో నాకు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ ఫోన్ చేశాడు. ‘మనమంతా ఒకే కుటుంబం. నిన్ను మేము ఎప్పటికీ వదులుకోము’ అని అన్నాడు. దీంతో నా కళ్లు నీటితో నిండిపోయాయి. సాధారణంగా నేను ఏడవను. కానీ, వెంకీ నన్ను ప్రేమతో ఏడిపించాడు. ఈ సీజన్‌లో నా ప్రదర్శనకు ఒక రకంగా ఆయనే కారణం. కాబట్టి అతడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని జమైకన్ స్టార్ చెప్పుకొచ్చాడు.

Image result for venkatesh in ipl match

డోపింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రె రస్సెల్‌పై స్వతంత్ర యాంటీ డోపింగ్‌ ట్రిబ్యునల్‌ సంవతర్సం నిషేధం విధించిన విషయం తెలిసిందే. 2017 జనవరి 31 నుంచి అతనిపై సస్పెన్షన్‌ అమలు చేశారు. 2015లో రస్సెల్‌ మూడు సార్లు డోపింగ్‌ టెస్ట్‌కు హాజరు కాలేదు. అందుకు తగిన కారణాలను కూడా వివరించక పోవడంతో అతనిపై జమైకా డోపింగ్‌ నిరోధక కమిషన్‌ చార్జ్‌ నమోదు చేసింది. తర్వాత ముగ్గురు సభ్యుల ట్రిబ్యునల్‌ అతణ్ణి విచారించి శిక్షను ఖరారు చేసింది. దీంతో ఆ సీజన్‌కు రస్సెల్ స్థానాన్ని గ్రాండ్‌హోమ్‌తో భర్తీ చేసుకుంది కేకేఆర్ యాజమాన్యం.

Image result for venkatesh in ipl match

డోపింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు రస్సెల్స్‌ 2017లో అంతర్జాతీయ క్రికెట్‌ నుండి నిషేధానికి గురయ్యాడు. దీంతో అతడు ఆ సంవత్సరం జరిగిన ఐపిఎల్‌ కు కూడా దూరమయ్యాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులతో తీవ్ర డిప్రెషన్‌ లోకి వెళ్లిన సమయంలో తనకు కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ నుండి ఫోన్‌ వచ్చిందని…జట్టు మొత్తం నీకు మద్దతుగా వుంటామంటూ ఆయన ధైర్యానిచ్చారని రస్సెల్స్‌ వెల్లడించాడు. ఆయన ఆ మాటలను విన్న వెంటనే తనకు ఏడుపు ఆగలేదని…చిన్నపిల్లాడిలా గుక్కపట్టి మరీ ఏడ్చానని స్వయంగా రస్సెల్స్‌ బయటపెట్టాడు. ఆయన చెప్పినట్లు నిషేధం తర్వాత ఈ ఐపిఎల్‌ సీజన్‌ 12 లో మళ్లీ తనకు కేకేఆర్‌ తరపున బరిలోకి దిగే అవకాశాన్ని కల్పించారన్నాడు. వెంకి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వుండాలనే తాను కసితో ఆడుతున్నట్లు తెలిపాడు. ఈ సీజన్లో తానే ఈ స్థాయిలో రెచ్చి పోయి సక్సెస్‌ ఫుల్‌ ఆటగాడిగా రాణించడానికి కేకేఆర్‌ సీఈవోనే కారణమని…ఆయనకు తాను రుణపడి వున్నానని రస్సెల్స్‌ ఉద్వేగభరితంగా మాట్లాడాడు. కేకేఆర్ యాజమాన్యంపై రసెల్ స్పందన పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పెట్టండి..